ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎన్ఐఐఎఫ్ నిర్వహించే ఫండ్ పోర్ట్‌లు , లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, రోడ్లు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్ , మాన్యుఫ్యాక్చరింగ్‌ను కవర్ చేసే 16 సంస్థలలో పెట్టుబడి పెట్టింది.
Posted On:
12 DEC 2022 4:10PM by PIB Hyderabad
నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) భారత ప్రభుత్వం, గ్లోబల్ ఇన్వెస్టర్లు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు (ఎండీబీ) , దేశీయ ఆర్థిక సంస్థల మధ్య సహకార పెట్టుబడి వేదికగా ఏర్పాటు అయింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరాద్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఎన్ఐఐఎఫ్ వద్ద ప్రస్తుతం మాస్టర్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ , స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ ఫండ్ అనే మూడు ఫండ్‌లు ఉన్నాయని, అవి పోర్టులు , లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, రోడ్లు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్ , తయారీకి సంబంధించిన 16 సంస్థలలో పెట్టుబడి పెట్టాయని మంత్రి పేర్కొన్నారు. ఇండియా జపాన్ ఫండ్ ద్వారా భారతదేశంలోని బహుళ రంగాలలో పెట్టుబడులను సులభతరం చేయడానికి నవంబర్ 2022లో అవగాహన ఒప్పందంపై సంతకం అయిందని మంత్రి తెలిపారు. ఎన్ఐఐఎఫ్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నాయని మంత్రి చెప్పారు:-
అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ), ఆస్ట్రేలియన్‌సూపర్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, పీఎస్పీ ఇన్వెస్ట్‌మెంట్స్, టెమాసెక్, యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారని తెలిపారు. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ , న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి ఎండీబీలు ఇందులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ , కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి దేశీయ ఆర్థిక సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
***
(Release ID: 1883309)
Visitor Counter : 120