జల శక్తి మంత్రిత్వ శాఖ

కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన సమావేశం అయిన నదుల అనుసంధానం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ


కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఒక వరం.. 8 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

Posted On: 13 DEC 2022 5:58PM by PIB Hyderabad

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (NWDA) సొసైటీ  36వ వార్షిక సాధారణ సమావేశం,  నదుల అనుసంధానం కోసం ఏర్పాటైన  ప్రత్యేక కమిటీ (SCILR) 20వ సమావేశం 2022 డిసెంబర్ 13న  కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగింది. సమావేశాన్ని ప్రారంభించిన శ్రీ షెకావత్ మాట్లాడుతూ జలవనరుల రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. దేశంలో నీటి లభ్యత పెంచి, దేశంలో ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న నదుల అనుసంధానం కార్యక్రమం కీలకంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా కరువు పీడిత ప్రాంతాలు, వర్షం ఆధారంగా వ్యవసాయం సాగుతున్న ప్రాంతాలకు నీరు సరఫరా చేయడానికి వీలవుతుందని అన్నారు. కెన్ బెట్వా లింక్ ప్రాజెక్టు  (నేషనల్ పెర్స్‌పెక్టివ్ ప్లాన్ కింద 1వ ఐఎల్‌ఆర్ ప్రాజెక్ట్) నిర్మాణాన్ని చేపట్టడం జలవనరుల రంగంలో కీలక అంశమని శ్రీ షెకావత్ అన్నారు. 2021 డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపిందని తెలిపారు. బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఒక వరంగా మారనుంది మరియు ఇది ప్రణాళిక చేయబడింది. 8 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని శ్రీ షేకావత్ వివరించారు. 

* కరువు పీడిత మరియు వర్షాధార వ్యవసాయ ప్రాంతాలకు నీటిని అందించడానికి నదుల అనుసంధాన కార్యక్రమం సహాయపడుతుంది: కేంద్ర జలశక్తి మంత్రి

* జాతీయ  ప్రణాళికలో భాగంగా తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ERCP)తో  సవరించిన పర్బతి-కలిసింద్-చంబల్ (PKC) లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టే ప్రతిపాదనకు నదుల అనుసంధానం కోసం ఏర్పాటైన  ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా  పర్బతి-కలిసింద్-చంబల్ ప్రాజెక్ట్   దశ-1 ను గుర్తించింది. 

*  కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం ఇటీవల పంపిన నీరా ను ఏర్పాటు  ప్రతిపాదన తాజా పరిస్థితిని కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. 

* అజెండా లో పొందుపరిచినా వివిధ అంశాలపై నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ సమావేశంలో వివరించారు. 

* 2021-22 సంవత్సరానికి సంబంధించి  నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆడిట్ నివేదిక, నేషనల్ ఇంటర్‌లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ ఏర్పాటుపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. 

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల వివరాలను సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ వివరించారు. నదుల అనుసంధానం కోసం  నిర్మాణంలో ఉన్న పనులు, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు  తదితర అంశాలను డైరెక్టర్ జనరల్ ప్రస్తావించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి  నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆడిట్ నివేదిక, నేషనల్ ఇంటర్‌లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ ఏర్పాటుపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది.  జాతీయ  ప్రణాళికలో భాగంగా తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ERCP)తో  సవరించిన పర్బతి-కలిసింద్-చంబల్ (PKC) లింక్ ప్రాజెక్ట్‌ను చేపట్టే ప్రతిపాదనకు నదుల అనుసంధానం కోసం ఏర్పాటైన  ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపింది. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా  పర్బతి-కలిసింద్-చంబల్ ప్రాజెక్ట్   దశ-1 ను సమావేశం  గుర్తించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం ఎదురు చూస్తున్న  నేషనల్ ఇంటర్‌లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ ఏర్పాటు అంశాన్ని కూడా సమావేశం చర్చించింది. ఇదివరకు జరిగిన నదుల అనుసంధానం కోసం ఏర్పాటైన  ప్రత్యేక కమిటీ,టాస్క్ ఫోర్స్ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, వీటిపై వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల నుంచి అందిన సమాచారం సమావేశంలో వచర్చకు వచ్చింది. 

జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు, కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి శ్రీ గోవింద్ ఎం కర్జోల్, తమిళనాడు జలవనరుల మంత్రి  శ్రీ దురై మురుగన్ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ జలవనరుల మంత్రి శ్రీ తులసీ రామ్ సిలావత్ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. జలవనరుల శాఖ  ప్రత్యేక కార్యదర్శి  ముగింపు వ్యాఖ్యలతో సమావేశం ముగిసింది.

***



(Release ID: 1883299) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi , Punjabi