నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

హ‌రిత ఉద‌జ‌ని వినియోగంలో పెరుగుద‌ల

Posted On: 13 DEC 2022 5:22PM by PIB Hyderabad

 ప్ర‌ధాన‌మంత్రి 15 ఆగ‌స్టు 2021న త‌న స్వాతంత్ర్య‌ దినోత్స‌వ ఉప‌న్యాసంలో జాతీయ హైడ్రోజెన్ (ఉద‌జ‌ని) మిష‌న్ ను ప్ర‌క‌టించారు. నూత‌న, పున‌రాత్ప‌ద‌క ఇంధ‌న మంత్రిత్వ శాఖ త‌ద‌నుగుణంగా హ‌రిత ఉద‌జ‌ని ఉత్ప‌త్తి, విస్త‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి ఇంట‌ర్‌- ఆలియా ప్ర‌తిపాదిస్తున్న ముసాయిదా మిష‌న్ ప‌త్రాన్ని సిద్ధం చేసింది. 
శిలాజేంధ‌నం (ఫాజిల్ ఫ్యూయెల్స్‌) స్థానంలో హరిత ఉద‌జ‌నిని వినియోగించేందుకు అవ‌కాశ‌ముంది, శిలాజేంధ‌నం ఆధారిత ఫీడ్ స్టాక్ (దాణా నిల్వస‌రుకు)ను అనేక రంగాల‌లో  అన‌గా క్రిమిసంహార‌క ఉత్ప‌త్తి, పెట్రోలియం శుద్ధి, ఉక్కువ ఉత్ప‌త్తి, ర‌వాణా అప్లికేష‌నన్లు త‌దితరాల‌లో ఉప‌యోగించవ‌చ్చు.
ఈ స‌మాచారాన్ని రాజ్య‌స‌భ మంగ‌ళ‌వారంనాడు లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో కేంద్ర విద్యుత్, నూత‌న, పున‌రావృత్త ఇంధ‌న మంత్రి శ్రీ ఆర్‌.కె. సింగ్ వెల్ల‌డించారు. 

***



(Release ID: 1883287) Visitor Counter : 145


Read this release in: English , Urdu