విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దేశంలో విద్యుత్తు ఉత్పత్తి మరియు పంపిణీ
Posted On:
13 DEC 2022 5:17PM by PIB Hyderabad
దేశంలో ప్రస్తుత స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 408.72 జీడబ్ల్యుగా ఉంది. ఇది దేశ అవసరాలకు సరిపోతోంది. ప్రస్తుత సంవత్సరం 2022-23లో (అక్టోబర్, 2022 వరకు) దేశంలోని అన్ని సంప్రదాయ మరియు సాంప్రదాయేతర వనరుల నుండి విద్యుత్తు ఉత్పత్తి 970,683 మిలియన్ యూనిట్లుగా (ఎంయు) నిలిచింది. దేశంలో విద్యుత్తు ఉత్పత్తి డిమాండ్ కు అనుగుణంగా ఉంటొంది. భారత ప్రభుత్వం డిసెంబర్, 2014లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయుజీజేవై)ని ప్రారంభించింది. ఈ పథకం కింద అన్ని రాష్ట్రాలు 28 ఏప్రిల్, 2018 నాటికి జనాభా లెక్కల్లో గల అన్ని గ్రామాలకు విద్యుద్దీకరణను నిర్ధారించాయి. డీడీయుజీజేవై కింద మొత్తం 18,374 గ్రామాలకు విద్యుద్దీకరణ జరిగింది. కేంద్ర విద్యుత్తు మరియు నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఈరోజు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1883197)