ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సమస్యా పరిష్కార సూచీలో వరుసగా నాలుగో నెల నవంబర్‌లో అగ్రస్థానంలో నిలిచిన యుఐడిఎఐ
Posted On:
13 DEC 2022 2:44PM by PIB Hyderabad
నవంబర్ 2022 నెలకు పాలనా సంస్కరణలు & ప్రజా సమస్యల పరిష్కార విభాగం (డిఎఆర్‌పిజి) ఇటీవలే ప్రచురించిన నివేదిక ప్రకారం గ్రూప్ ఎ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ)కు ప్రజా సమస్యల పరిష్కారంలో మరొకసారి తొలిర్యాంకును ప్రదానం చేశారు. ఈ ర్యాంకింగుల్లో యుఐడిఎఐ వరుసగా నాలుగవ నెలలో అగ్రస్థానంలో నిలిచింది.
యుఐడిఎఐ కొత్త ఓపెన్ సోర్స్ సిఆర్ఎం (కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్) వ్యవస్థ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచి, నివాసితులకు సేవలను అందిస్తోంది. ఈ వ్యవస్థకు ఫోన్ కాల్, ఇ-మెయిల్, చాట్‌బాట్, వెబ్ పోర్టల్, సోషల్ మీడియా, లేఖ, సమస్యలను నమోదు చేయడానికి వెళ్లడం, ట్రాక్ చేసి, సమర్ధవంతంగా పరిష్కరించడానికి తోడ్పాటునిచ్చే సమర్ధత కలిగిన వ్యవస్థ ఉంది.
నూతన సిఆర్ఎం వ్యవస్థ ద్వారా యుఐడిఎఐ కేంద్రీకృత పరిష్కార నిర్వహణ యంత్రాంగం దిశగా కదిలుతోంది. యుఐడిఎఐ కేంద్ర కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు (ఆర్ఒలు) సిఆర్ఎం కేసులను సృష్టించి, వివిధ మార్గాల ద్వారా సామాన్య ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నాయి.
యుఐడిఎఐ నూతనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ (ఎఐ-ఎంఎల్) ఆధారిత చాట్‌బోట్ - ఆధార్ మిత్రా కూడా పౌరులకు ప్రాచుర్యం పొందడమే కాక ప్రముఖ సినీ తార ప్రజాదరణ పొందిన టీవీ క్విజ్ షోలో కూడా చోటు చేసుకుంది. రోజువారీ ఆధార్ మిత్రపై 30 వేల సంభాషణలు జరుగుతున్నాయి, అది త్వరలోనే 50వేలు దాటవచ్చని భావవిస్తున్నారు.
నూతన చాట్‌బాట్ - చెక్ ఆధార్, ఎన్‌రోల్‌మెంట్/ తాజాపరిచే స్థితి, ట్రాకింగ్ ఆఫ్ ఆధార్ పివిసి కార్డ్ స్థితి, ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ప్రాంతం తదితరాలకు సంబంధించిన సమాచారం వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది. ప్రజలు తమ సమస్యలను ఆధార్ మిత్రపై నమోదు చేసుకొని, ట్రాక్ చేసుకోవచ్చు. ఆధార్ మిత్ర ఇంగ్లీషు, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.
యుఐడిఎఐ ప్రజలకు సరళమైన జీవన సౌలభ్యాన్ని అందించేందుకు నిరంతరం పని చేయడమే కాక తన సమస్యా పరిష్కార యంత్రాంగాన్ని మరింత సమర్ధవంతమైన సేవలను అందించేలా బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉంది.
***
(Release ID: 1883163)