నౌకారవాణా మంత్రిత్వ శాఖ

హిందూ మహాసముద్రంలో నీలి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తీసుకున్న చర్యలు

Posted On: 13 DEC 2022 1:50PM by PIB Hyderabad

కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ డీప్ ఓషన్ మిషన్‌ను (డీవోఎం) ప్రారంభించింది.సముద్ర గర్భ సాంకేతికత అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే, వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ అంశాలతో ముడిపడిన కార్యక్రమం ఇది. సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లగలిగే మానవ సహిత సబ్‌మెర్సిబుల్‌ను రూపొందించడం, సముద్ర గర్భంలో తవ్వకం సాంకేతికతలు, సముద్ర గర్భంలో ఖనిజ వనరులు, సముద్ర జీవ వైవిధ్యం అన్వేషణ, సముద్రంలో అన్వేషణ కోసం పరిశోధన నౌకను కొనుగోలు చేయడం, సముద్ర వాతావరణ మార్పుల సలహా సేవల అభివృద్ధి, సముద్ర గర్భ పరిశీలనలు, సముద్ర జీవశాస్త్రంలో సామర్థ్య నిర్మాణం వంటివి కూడా దీనిలో భాగం. హిందూ మహాసముద్రంలో నీలి ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి డీప్ ఓషన్ మిషన్ కార్యకలాపాలు సాయపడతాయి.

ఇంధన సామర్థ్య నది సర్వే డ్రిఫ్టర్ డ్రోన్ (స్వతంత్రంగా వ్యవహరించగల సర్వే డ్రోన్‌) రూపకల్పనకు సంబంధించిన పనిని ఇండియన్ మారిటైమ్ విశ్వవిద్యాలయానికి (ఐఎంయూ) దేశీయ జలమార్గాల అధీకృత సంస్థ కట్టబెట్టింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.21.94 లక్షలు. ఇప్పటి వరకు రూ.14.47 లక్షలు విడుదలయ్యాయి.

ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానం రూపంలో కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ రాజ్యసభకు సమర్పించారు.

*****



(Release ID: 1883084) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Tamil