ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈసీఎల్జీఎస్ కింద రూ. 3.58 లక్షల కోట్లు జారీ చేయడంతో

Posted On: 12 DEC 2022 4:13PM by PIB Hyderabad

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) 2020 మేలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా, అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), వ్యాపార సంస్థలకు వారి కార్యాచరణ బాధ్యతలను తీర్చడంలో, వారి వ్యాపారాలను పునఃప్రారంభించడంలో మద్దతు ఇవ్వడానికి ప్రారంభించారు. .
 

ఈ పథకం కింద, అర్హులైన రుణగ్రహీతలకు రుణాలు అందించే సంస్థలకు 100% క్రెడిట్ గ్యారెంటీ వర్తిస్తూఉంది. పథకం కింద అనుమతించదగిన హామీ పరిమితిని రూ. 4.5 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లుకు పెంచారు.   అదనపు హామీ కవర్‌తో పౌర విమానయాన రంగంతో సహా హాస్పిటాలిటీ మరియు సంబంధిత సంస్థల కోసం ప్రత్యేకంగా రూ.50,000 కోట్లు కేటాయించారు. 

అందువల్ల, దేశీయ విమానయాన సంస్థలకు ఇటీవలి క్రెడిట్ మద్దతు పథకంలో  ఎంఎస్ఎంఈల వాటా తగ్గింపునకు దారితీయలేదు. 30.11.2022 నాటికి,  ఈసీఎల్జీఎస్ కింద రూ. 3.58 లక్షల కోట్ల గ్యారెంటీలు జారీ అయ్యాయి. , దీని వలన 1.19 కోట్ల మంది రుణగ్రహీతలు ప్రయోజనం పొందుతున్నారు.

 

 

 

ఎంఎస్ఎంఈల వాటా 

హామీ ఇవ్వబడిన రుణాల సంఖ్య

95.17%

హామీ నగదు మొత్తం 

66.23%

 

ఎంఎస్ఎంఈల రుణగ్రహీతలలో చాలా మందికి రూ. రూ. 50 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఈ వర్గం రుణగ్రహీతల కోసం, ఈసీఎల్జీఎస్ పథకం అనేది 'ఆప్ట్ అవుట్' పథకం, అంటే ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలు మద్దతును పొందకూడదని లేదా అనర్హులుగా నిర్ణయించుకుంటే తప్ప, రుణదాతలు అటువంటి అర్హత కలిగిన రుణగ్రహీతల వర్గానికి అర్హత గల మద్దతును అందించాలి. అందువల్ల, ఈ పథకం  ఎంఎస్ఎంఈ  లకు సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించడం జరిగింది. 

ఎన్సీజిటిసి నుండి స్వీకరించిన ఇన్‌పుట్‌ల ప్రకారం, ఈసీఎల్జీఎస్ పథకం కింద రుణం తీసుకున్న క్రెడిట్ కింద నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పిఏలు ) శాతం క్రింది విధంగా ఉంది:

 

హామీ ఇచ్చిన రుణం (రూ. కోట్లలో)

ఎన్పిఏ బకాయిలు (రూ. కోట్లలో)

రుణాల శాతంగా ఎన్పిఏ హామీ  ఇవ్వబడింది

3,58,894.27

13,964.58

3.89%

మూలం: ఎన్ సీ జి టి సి 

 

 

****


(Release ID: 1883015) Visitor Counter : 127


Read this release in: English , Urdu