యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కాశీ తమిళ సంగమంలో స్నేహపూర్వక టేబుల్ టెన్నిస్ పోటీని ప్రారంభించిన - శ్రీ అనురాగ్ ఠాకూర్
సాహిత్యం, సంస్కృతి, క్రీడల ద్వారా రెండు సంస్కృతులు ఏకమవుతున్నాయి: శ్రీ అనురాగ్ ఠాకూర్
వారణాసిలోని సిగ్రా స్టేడియం అభివృద్ధి పనులను సమీక్షించిన - శ్రీ అనురాగ్ ఠాకూర్
వారణాసిలోని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ కార్యాలయాలలో 'స్పేస్-ఆడిట్' నిర్వహించిన - శ్రీ అనురాగ్ ఠాకూర్
నాడు పోస్టు చేయడమైనది:
12 DEC 2022 5:05PM by PIB Hyderabad
సాహిత్యం, సంస్కృతి, క్రీడలు, ఇతర అంశాల ద్వారా రెండు సంస్కృతులు ఏకమవుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎనిమిది రోజుల పాటు జరిగే ‘కాశీ తమిళ సంగమం - క్రీడా సదస్సు' లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన స్నేహపూర్వక టేబుల్ టెన్నిస్ పోటీని ఆయన ప్రారంభించారు.
వారణాసిలోని సిగ్రా స్టేడియం అభివృద్ధి పనులను శ్రీ అనురాగ్ ఠాకూర్ పరిశీలించి, సమీక్షించారు. స్టేడియం అభివృద్ధి పనుల్లో, ఆయన కొన్ని గుణాత్మకమైన మార్పులను ప్రతిపాదించారు. ఆయన వారణాసిలోని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ కార్యాలయాల్లో 'స్పేస్ ఆడిట్' లను కూడా నిర్వహించారు. ఆయన కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
సభను ఉద్దేశించి శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమంలో సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే క్రీడల ద్వారా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను కలిపే కార్యక్రమం కూడా జరుగుతోందని అన్నారు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఉన్న అనుబంధం వేల సంవత్సరాల నాటి మన ప్రాచీన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.
కాశీ తమిళ సంగమం ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రి కి శ్రీ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమం ద్వారా 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కల సాకారమవుతోందని అన్నారు. నేటి క్రీడాకారుల్లో కనిపిస్తున్న ఉత్సాహం ఉత్తరప్రదేశ్, తమిళనాడు జట్ల ఆటగాళ్లలో కూడా కనిపిస్తోందని అన్నారు.
తమిళనాడు ప్రజలు కాశీ విశ్వనాథుని దర్శించుకునే అవకాశం పొందడం తో పాటు, ఈ ప్రాంత కళలు, సంస్కృతి గురించి తెలుసుకుంటున్నారని, ఇది అందరికీ గర్వకారణమని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు నుంచి వచ్చిన క్రీడాకారులు అందరినీ, ఆయన పిలిచి పలకరించారు.
*****
(రిలీజ్ ఐడి: 1883012)
సందర్శకుల సూచీ సంఖ్య : : 135