ఆర్థిక మంత్రిత్వ శాఖ
అర్హులైన 35 బాంకులకు చెందిన 3,06,146 మంది డిపాజిటర్లకు క్లెయిముల పరిష్కారం కింద రూ. 4,055.10 కోట్లు చెల్లించిన డిఐసీజీసీ
Posted On:
12 DEC 2022 6:29PM by PIB Hyderabad
డిపాజిట్ బీమా, ఋణ హామీ సంస్థ సవరణ చట్టం, 2021 అమలులోకి వచ్చిన 1.9.2021 మొదలుకొని 30.11.2022 దాకా డిఐసీజీసీ అర్హులైన 35 బాంకులకు చెందిన 3,06,146 మంది డిపాజిటర్లకు క్లెయిముల పరిష్కారం కింద రూ. 4,055.10 కోట్లుచెల్లించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్ రావ్ కరద్ లోక్ సభలో ఈ రోజు ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
పరిష్కరించిన క్లెయిముల వివరాలు అనుబంధం -1 లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
చట్ట సవరణకు ముందు పదేళ్ళ కాలానికి సంవత్సరాల వారీగా, బాంకుల వారీగా డీఐసీజీసీ చేసిన క్లెయిముల పరిష్కారం, అలా పరిష్కరించినందుకు డీఐసీజీసీకి చెల్లింపులు, రికవరీ శాతం తదితర సమాచారమ్ అనుబంధం-2 లో ఇవ్వబడింది.
మరింత సమాచారం ఇస్తూ, డీఐసీజీసీ చట్టం, 1961 ప్రకారం 1.9.2021 నుంచి 30.11.2022 వరకు బాంకు డిపాజిటర్లకు డిపాజిట్ బీమా చెల్లింపు జరిగిన తరువాత 12 బాంకులు దివాలా తీశాయన్నారు. ఈ వివరాలు అనుబంధం-3 లో పొందుపరచామన్నారు.
మరింత నేపధ్య సమాచారం అందిస్తూ, డీఐసీజీసీ చట్టం, 1961 ను డీఐసీజీసీ (సవరించిన) చట్టం, 2021 గా చేసిన తరువాత రూ. 5 లక్షల లోపు డిపాజిటర్లు ఒక నిర్దిష్ట కాలపరిమితి లోగా తమ డిపాజిట్లు తీసుకునే అవకాశం కలిగిందన్నారు. 90 రోజులలోగా మధ్యంతర చెల్లింపులకు రిజర్వ్ బాంకుకు వీలుకలిగిందన్నారు. ఏఐడి కింద ఉంచిన బాంకులు మొత్తం డిపాజిటర్ల వివరాలను 45 రోజులలోగా సమర్పించాల్సి ఉంటుందని, 90 రోజులలోగా డీఐసీజీసీ ఆ క్లెయిమ్ లను పరిష్కరిస్తుందని వివరించారు.
****
(Release ID: 1883011)
Visitor Counter : 156