మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉన్నత విద్యా సంస్థలలో నూతన విద్యా విధానం అమలు
Posted On:
12 DEC 2022 4:20PM by PIB Hyderabad
13.04.2022న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూ జీ సీ) ‘ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను (అకడమిక్ ప్రోగ్రామ్‌లను) కొనసాగించడానికి మార్గదర్శకాలు’ జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు https://www.ugc.ac.in/pdfnews/5729348_Guidelines-for-pursuing-two-academic-programmes-simultaneously.pdf
ఈ లింక్ లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ప్రయోజనం కోసం ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని మరియు విద్యార్థులు ఏకకాలంలో రెండు విద్యా కార్యక్రమాలను కొనసాగించేందుకు వీలుగా తమ చట్టబద్ధమైన సంస్థల ద్వారా యంత్రాంగాలను రూపొందించాలని ఉన్నత విద్యా సంస్థలను యూ జీ సీ అభ్యర్థించింది.
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ ఐ ఐ టీ), హైదరాబాద్, స్వయంప్రతిపత్తి కలిగిన ఉన్నత విద్యా సంస్థ (యూనివర్శిటీగా పరిగణించబడుతుంది) మరియు ఈ విద్యావిషయంలో మార్గదర్శకాలను రూపొందించడానికి స్వయంప్రతిపత్తి కలిగి ఉందని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏ ఐ సీ టీ ఈ) తెలియజేసింది.
విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 1882945)
Visitor Counter : 129