సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కళలు, సంస్కృతి మరియు హస్తకళల అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా ఏడు జోనల్ సాంస్కృతిక కేంద్రాలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది: శ్రీ జీ. కిషన్ రెడ్డి
Posted On:
12 DEC 2022 5:56PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కళ, సంస్కృతి మరియు హస్తకళల పరిరక్షణ మరియు అభివృద్ధి కోసం, భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పాటియాలా, నాగ్‌పూర్, ఉదయపూర్, ప్రయాగ్‌రాజ్, కోల్‌కతా, దిమాపూర్ మరియు తంజావూరులో ప్రధాన కార్యాలయాలు గా ఏడు జోనల్ కల్చరల్ సెంటర్‌లను (జెడ్ సి సి) ఏర్పాటు చేసింది. ఈ జెడ్ సి సిలు ఏడాది పొడవునా తమ సభ్య రాష్ట్రాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తాయి. వివిధ కార్యకలాపాలు/కార్యక్రమాలను నిర్వహించడం కోసం, జెడ్ సి సిలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా వార్షిక గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందజేస్తుంది. రాష్ట్ర/యుటి వారీగా ఎటువంటి నిధులు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా విడుదల చేయబడవు.
ఇంకా, దేశవ్యాప్తంగా కళ, సంస్కృతి మరియు హస్తకళల సంరక్షణ మరియు అభివృద్ధి కోసం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ జెడ్ సి సిల ద్వారా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలను (ఆర్ ఎస్ ఎమ్) నిర్వహిస్తుంది. భారతదేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఉత్సవాలు వేదికలవుతాయి. నవంబర్, 2015 నుండి, దేశవ్యాప్తంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా పన్నెండు రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాలు నిర్వహించబడ్డాయి.
ఈ జెడ్ సి సిలు తమ ప్రోగ్రామ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి కనీసం 42 ప్రాంతీయ ఉత్సవాలను నిర్వహిస్తాయి. కనుమరుగవుతున్న అనేక కళారూపాలతో సహా భావితరాల కోసం కళా జ్ఞాన నిధిని సరిగ్గా పదిలపరచడం కోసం కృషి జరుగుతోంది
ఈ జెడ్ సి సి లు పలు కళల రూపాలను డిజిటల్ ఫార్మాట్‌లో (ఆడియో మరియు వీడియో ఫార్మాట్‌లు రెండూ) డాక్యుమెంట్ చేసాయి.
ఇంకా, దేశంలోని వివిధ జానపద కళలు సంస్కృతిని పరిరక్షించడం మరియు ప్రచారం చేయడం కోసం, ఈ జెడ్ సి సి లు అనేక పథకాలను అమలు చేస్తాయి. యువ ప్రతిభావంతులైన కళాకారులకు అవార్డు, గురు శిష్య పరంపర, రంగస్థల (థియేటర్) పునరుజ్జీవనం, పరిశోధన మరియు డాక్యుమెంటేషన్, శిల్పగ్రామ్, ఆక్టేవ్ మరియు నేషనల్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వంటి పథకాలు వీటి లో కొన్ని.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మరియు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు లోక్‌సభలో ఈ సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 1882943)
Visitor Counter : 220