ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
‘ఇండియా గ్లోబల్ ఫోరమ్’కు హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లనున్న మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
-పర్యటనలో భాగంగా యుఏఈ దేశ ఏఐ, డిజిటల్ ఎకానమీ, రిమోట్ వర్క్ అప్లికేషన్స్ శాఖల మంత్రి ఒమర్ సుల్తాన్ అల్ ఒలామాను కలువనున్న మంత్రి
- పరస్పర సహకారానికి సాధ్యమైన మార్గాలను కనుగొనడానికి పరిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, అంకుర సంస్థలు మరియు ఆవిష్కర్తలతో కూడా మంత్రి సమావేశం
Posted On:
12 DEC 2022 6:01PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు నైపుణ్యత అభివృద్ధి & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
శాఖల కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ డిసెంబర్ 13-15, 2022 తేదీలలో దుబాయ్‌లో జరిగే ‘ఇండియా గ్లోబల్ ఫోరమ్’కు (ఐజీఎఫ్) హాజరు కానున్నారు. ఐజీఎఫ్ అనేది అంతర్జాతీయ వ్యాపార మరియు ప్రపంచ నాయకులకు ఎజెండా-నిర్దేశనకు సంబంధించిన ఒక వేదిక. ఐజీఎఫ్ వేదికలో పాల్గొనేందుకు మంత్రి సోమవారం రాత్రికి దుబాయ్ చేరుకోనున్నారు. మంగళవారం (రేపటి) నుండి ఆయన వరుస సమావేశాలలో పాల్గొంటారు. మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ - గ్లోబలైజేషన్ ఆఫ్ ది ఇండియన్ టెక్ అండ్ ఇన్నోవేషన్ టాలెంట్‌కు హాజరు కావడం ద్వారా మంత్రి వరుస సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో భారతదేశం, యుఏఈ మరియు యునైటెడ్ కింగ్డమ్లలో ఉన్న సాంకేతిక రంగాలకు చెందిన 50 మంది నాయకులు, మంత్రులు, సీఈఓలు మరియు ఈ అంతర్జాతీయంగా ఆయా రంగాలకు చెందిన పర్యావరణ వ్యవస్థలకు చెందిన వాటాదారులు పాల్గొంటారు. ఆ తర్వాత మంత్రి రోజు మొత్తం వివిధ పరిశ్రమల నాయకులు, పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు మరియు ఇన్నోవేటర్‌లతో ముచ్చటిస్తారు. భారతదేశంలో తమ విస్తరణను పెంచుకోవాలనే ఆకాంక్షతో ఉన్న వ్యవస్థాపకులతో సహకార మార్గాలను గురించి చర్చించి అవకాలను అంచనా వేయడమే లక్ష్యంగా ఈ పరస్పర చర్చలు జరుగనున్నాయి. ఇండియా స్టాక్ ప్రపంచీకరణ గురించి కూడా మంత్రి ఈ వేదికపై చర్చించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, ఖర్చుతో కూడుకున్న మరియు స్కేలబుల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో భారతదేశం సాధించిన విజయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుండి ఆసక్తి కలిగిస్తోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా నిలబెడుతున్నాయి. అనంతరం మంత్రి యుఏఈకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ మరియు రిమోట్ వర్క్ అప్లికేషన్స్ శాఖ సహాయ మంత్రి ఒమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామాను కలవనున్నారు. అతను కూడా మంత్రితో కలిసి ‘పార్ట్‌నర్స్ ఇన్ డిస్‌రప్షన్ & ఇన్నోవేషన్’ ఐజీఎఫ్ సంయుక్త సెషన్‌లో పాల్గొంటారు. భారతదేశం మరియు యుఏఈ మధ్య సాంకేతిక సహకారాన్ని విజయవంతం చేయడానికి గల అవకాశాలను గురించి ఈ సమావేశంలో గుర్తిస్తారు. https://indiaglobalforum.com/
***
(Release ID: 1882940)
Visitor Counter : 134