సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఉద్యమ సఖి కింద నమోదు చేసుకున్న మహిళా పారిశ్రామికవేత్తలు

Posted On: 12 DEC 2022 1:32PM by PIB Hyderabad

ఎంఎస్‌ఎంఈ రంగంలో ఇప్పటికే ఉన్న/రాబోయే మహిళా పారిశ్రామికవేత్తలకు 'సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ' అందిస్తున్న ఆర్థిక పథకాలు, విధానాలు, కార్యక్రమాల సంబంధిత సమాచారాన్ని ఉద్యమ సఖి పోర్టల్ (https://udyam-sakhi.com) అందిస్తుంది. 2022 అక్టోబర్‌ వరకు, తమిళనాడు రాష్ట్రం నుంచి ఉద్యమ సఖి పోర్టల్‌లో నమోదు చేసుకున్న మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన జిల్లాల వారీ వివరాలు అనుబంధంలో ఉన్నాయి.

తయారీ కేంద్రం & యంత్రాల కోసం పెట్టుబడి, టర్నోవర్‌ ఆధారంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలుగా (ఎంఎస్‌ఎంఈలు) వర్గీకరణ ప్రమాణాల ఆధారంగా, ఉద్యోగ్ ఆధార్ మెమోరాండం దాఖలు చేసే గత ప్రక్రియ స్థానంలో ఆన్‌లైన్ పోర్టల్ https://udyamregistration.gov.inలో మహిళా పారిశ్రామికవేత్తల సహా నమోదు చేసుకునేందుకు ఉద్యమ్‌ నమోదును 2020 జులై నుంచి మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది.

అన్ని రంగాల్లోని ఎంఎస్‌ఎంఈల అన్ని వ్యాపార అవసరాలకు ఏక గవాక్ష డిజిటల్ పరిష్కారంగా సమగ్ర బీ2బీ పోర్టల్ అయిన MSMEmart.comని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఐసీ) నిర్వహిస్తోంది. ప్రపంచ మార్కెట్‌ పోటీలో నిలబడేలా ఎంఎస్‌ఎంఈలకు అత్యాధునిక సేవలను అందిస్తోంది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ప్రోత్సహించడానికి ఈ-కామర్స్ పోర్టల్ ekhadiindia.comని కేవీఐసీ కూడా నిర్వహిస్తోంది.

***


(Release ID: 1882935)
Read this release in: English , Urdu , Tamil