నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్లోబల్ ఇండస్ట్రీ కి అనుగుణంగా ట్రైనింగ్ మాడ్యూల్స్
Posted On:
12 DEC 2022 3:32PM by PIB Hyderabad
యువతకు ఉత్తమ అవకాశాలను అందించడానికి ప్రపంచ పరిశ్రమల నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీలలో రీ-ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేయవలసిన అవసరాన్ని అంచనా వేయడానికి నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత్వ (ఎంటర్ప్రిన్యూర్షిప్) మంత్రిత్వ శాఖ ఎలాంటి అధ్యయనం చేయలేదు. అయితే, ఎం ఎస్ డి ఇ ఆధ్వర్యం లోని ఎన్ ఎస్ డి సి ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, జర్మనీ, జపాన్, కింగ్ డం ఆఫ్ ఆఫ్ సౌదీ అరేబియా, కువైట్, మలేషియా, ఒమన్, ఖతార్, రొమేనియా, సింగపూర్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్ డం వంటి 16 దేశాలలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి గల డిమాండ్ పై అంతర్జాతీయ అంచనా జరిపింది. అయినప్పటికీ, ప్రపంచ అవసరాలను అర్థం చేసుకోవడానికి నైపుణ్య శిక్షణ తులనాత్మక విశ్లేషణ నిర్వహించబడలేదు.
స్కిల్ ఇండియా మిషన్ కింద, నైపుణ్య అభివృద్ధి ,వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ (ఎంఎస్ డి ఇ) దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై), జన్ శిక్షన్ సంస్థాన్ (జెఎస్ఎస్), నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఎపిఎస్), పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటిఐ) వంటి వివిధ పథకాల ద్వారా నైపుణ్య శిక్షణను అందిస్తోంది. 30.09.2022 నాటికి, మొత్తం 166.64 లక్షల మంది అభ్యర్థులకు పిఎంకెవివై (2015 నుండి), జెఎస్ఎస్ (2018 నుండి), ఎన్ఏపిఎస్ (2018 నుండి) పథకాల కింద శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన అభ్యర్థులలో 9.17 లక్షల మంది అభ్యర్థులు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కు చెందినవారు. హర్యానా రాష్ట్రంలో 8.03 లక్షల మంది అభ్యర్థులకు పిఎంకెవివై, జెఎస్ఎస్, ఎన్ఎపిఎస్ కింద శిక్షణ ఇచ్చారు. ఇందులో షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థుల సంఖ్య 5335.
ఐటీఐల ద్వారా 2014-2022 మధ్య కాలంలో మొత్తం 69.08 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 7.72 లక్షల మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉన్నారు. హర్యానా రాష్ట్రం కోసం, 2014-2022 మధ్య ఎస్ టి అభ్యర్థులతో సహా 2.90 లక్షల మందికి ఐటీఐల ద్వారా శిక్షణ ఇచ్చారు. నైపుణ్య శిక్షణా సంస్థలలో పరిశ్రమల స్థాపన విద్య, శిక్షణ, సలహా, వ్యవస్థాపకత్వ నెట్ వర్క్ ను సులభంగా పొందడం ద్వారా వ్యవస్థాపకత్వ అభివృద్ధికి అనువైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి మంత్రిత్వ శాఖ ఒక పైలట్ పథకం అయిన ప్రధాన మంత్రి యువ (పిఎం యువ) యోజనను అమలు చేసింది. పది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేశారు. 31.03.2022 నాటికి, దేశవ్యాప్తంగా సుమారు 62,577 మంది అభ్యర్థులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందారు.
ప్రపంచ మార్కెట్ లో పోటీ పడటానికి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులతో సహా యువతకు నైపుణ్యాలు, సామర్థ్యాలను అందించడానికి ఎం ఎస్ డిఇ ద్వారా సమాచార మార్పిడి, నైపుణ్య సామరస్యం, అర్హతల గుర్తింపు మొదలైన రంగాలలో సహకార ఫ్రేమ్ వర్క్ ను అందించడానికి నైపుణ్యాభివృద్ధి రంగంలో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి
వివిధ చొరవలు తీసుకున్నారు. ఎంఎస్ డిఇ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ డిసి కూడా ఉద్యోగ శిక్షణ, సామర్థ్య నిర్మాణం మొదలైన వాటిపై యజమానుల అనుసంధానం కోసం బి టు బి ఒప్పందాలు చేసింది.
ఇంకా, ప్రవాసి కౌశల్ వికాస్ యోజన (పికెవివై) పథకం కింద, ఎంఇఎ సహకారంతో ఎంఎస్ డి ఇ అభ్యర్థులకు ప్రీ-డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ (పిడిఓటి) ను అందిస్తోంది, తద్వారా వారు విదేశాలలో పోటీపడటానికి అవసరమైన సాప్ట్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. అలాగే, అంతర్జాతీయ నైపుణ్యాల ప్రమాణాలకు ప్రభావం పెంచడానికి, ప్రభుత్వం 2007 నుండి ప్రపంచ నైపుణ్యాల పోటీలో పాల్గొంటోంది. ఈ పోటీ 2022 ఎడిషన్ లో, హర్యానా నుండి 01 ఎక్సలెన్స్ పతకాలతో సహా 02 వెండి పతకాలు 03 కాంస్య పతకాలు ,13 ఎక్సలెన్స్ పతకాలతో భారతదేశం 11 వ స్థానంలో ఉంది.
నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు లోక్ సభలో ఒక లిఖితపూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.
*****
(Release ID: 1882934)
Visitor Counter : 135