బొగ్గు మంత్రిత్వ శాఖ
పరిమిత దేశీయ లభ్యత కారణంగా కోకింగ్ కోల్ దిగుమతి
Posted On:
12 DEC 2022 4:06PM by PIB Hyderabad
దేశంలో కోకింగ్ కోల్ (ఖనిజాలు గల బొగ్గు) పరిమితంగా అందుబాటులో ఉన్నందున, ఉక్కు పరిశ్రమ అవసరాలను నెరవేర్చేందుకు కోకింగ్ కోల్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఉక్కు ఉత్పత్తిలో కోకింగ్ కోల్ ముఖ్యమైన వ్యయాంశంగా ఉన్నందున, కోకింగ్ కోల్ అంతర్జాతీయ ధరలు ఇటీల పెరిగిన క్రమంలో అది ఉక్కు ఉత్పాదన వ్యయ నిర్మితిని ప్రభావితం చేసింది. గత మూడేళ్ళల్లో దిగుమతి చేసుకున్న కోకింగ్ కోల్ వివరాలు దిగువన ఇవ్వడం జరిగిందిః-
సంవత్సరం దిగుమతి చేసుకున్న కోకింగ్ కోల్ (ఎంటి)
2019-20 51.83
2020-21 51.19
2021- 22 57.16
భారత ఉక్కు మంత్రిత్వ శాఖ, రష్యన్ ఫెడరేషన్ ఇంధన మంత్రిత్వ శాఖ మధ్య ఉక్కు తయారీలో ఉపయోగించే కోకింగ్ కోల్ విషయంలో సహకారం కోసం అవగాహనా ఒప్పందంపై 14-10-2021న సంతకాలు జరిగాయి.
నూతన భౌగోళిక ప్రాంతాలను బహుముఖీయం చేసే ఉద్దేశ్యంతో, సెయిల్ (SAIL) కోకింగ్ కోల్ పారిశ్రామిక స్థాయి సరఫరా కోసం రష్యన్ మైనర్‌తో 24-08-2022న ఒప్పందం పై సంతకాలు చేసింది. ప్రస్తుతం సెయిల్ దీర్ఘకాలిక ఒప్పందాల కింద ఆస్ట్రేలియా, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ), ఇండొనేషియా & మొజాంబిక్ నుంచి దిగుమతి రకం మెటలర్జికల్ బొగ్గును సేకరిస్తోంది. రాష్ట్రీయ ఇస్పాట్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్_ కూడా ఆస్ట్రేలియా, కెనెడా, యుఎస్ఎ, ఇండొనేషియా, మొజాంబిక్‌లలోని వివిధ అంతర్జాతీయ సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది.
ఉక్కు పరిశ్రమలో డిఆర్ ప్లాంట్ సాంకేతిక ఆధారిత బొగ్గుతో పోలిస్తే దేశీయ నాన్ కోకింగ్ బొగ్గు వినియోగం పరిమితంగా ఉంది.
ఈ సమాచారాన్ని బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ రాజ్యసభలో ఇచ్చిన లిఖిత సమాధానం ద్వారా సోమవారం వెల్లడించారు.
***
(Release ID: 1882871)