ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమక్షంలో విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ 2022 దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ 'సమిష్టి కృషితో 2025 నాటికి దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు '


8 కోట్ల ఈ-సంజీవని సంప్రదింపుల వల్ల లబ్ధిదారులకు దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 10 DEC 2022 6:04PM by PIB Hyderabad

రెండు రోజుల పాటు జరగనున్న  విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ 2022 దినోత్సవ కార్యక్రమాలను ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి  ఆనందిబెన్ పటేల్ ఈ రోజు వారణాసి రుద్రకేష్ కన్వెన్షన్ సెంటర్ లో  వర్చువల్ విధానంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమక్షంలో ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖల మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ దయ శంకర్ మిశ్రా, శ్రీమతి విడదల రజని (ఆంధ్రప్రదేశ్), శ్రీ బన్నా గుప్తా (జార్ఖండ్), డాక్టర్ ప్రభురామ్ చౌదరి (మధ్యప్రదేశ్), శ్రీ ధన్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), శ్రీ రవీంద్ర జైస్వాల్ (ఉత్తరప్రదేశ్), శ్రీమతి. చంద్రిమా భట్టాచార్య (పశ్చిమ బెంగాల్), డాక్టర్ సపమ్ రంజన్ (మణిపూర్) మరియు డాక్టర్ ఎంకే శర్మ (సిక్కిం) కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆరోగ్య సేవలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు చేస్తున్న కృషిని అభినందించారు. టెలి సంప్రదింపులు అందించేందుకు 1.33 లక్షల  ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కేంద్రాల్లో సేవలు అందిస్తున్న వైద్య నిపుణులు ప్రజలకు వివిధ వ్యాధుల పట్ల అవగాహన  కల్పించి ముందస్తు  పరీక్షలు చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని శ్రీమతి  ఆనందిబెన్ పటేల్ సూచించారు. స్థానిక ప్రజలను వ్యాధుల విషయంలో చైతన్యవంతులను చేయాలని  అన్నారు.  సమిష్టి కృషితో దేశంలో అన్ని రకాల వ్యాధులను నిర్మూలించవచ్చని అన్నారు. . నిక్షయ్-మిత్ర  స్ఫూర్తి మరియు సాధించిన  పురోగతిని గవర్నర్ ప్రశంసించారు. 'కేంద్రం, రాష్ట్రాలు, సమాజం  మరియు వ్యక్తుల సమిష్టి  కృషితో, 2025 నాటికి మనం టీబీ - ముక్త్ భారత్ లక్ష్యాన్ని సులభంగా సాధించడానికి అవకాశం ఉంది. మనమందరం ముందుకు వచ్చి ని- క్షయ మిత్ర గా పనిచేసి   క్షయ వ్యాధిగ్రస్తులకు అండగా ఉందాం." అని గవర్నర్ అన్నారు. 

కోవిడ్-19 సమయంలో  అంకిత భావంతో  నిస్వార్థ సేవలు అందించిన సామాజిక ఆరోగ్య అధికారులను డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఆరోగ్య రంగంలో ఈ-సంజీవని సమర్థ సేవలు అందిస్తున్నదని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. డిజిటల్ వైద్య విధానానికి ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం  ఈ-సంజీవని కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తున్నదని అన్నారు.  ఈ-సంజీవని వల్ల ప్రతి రోగి వైద్య సేవలు పొందడానికి ఇది రోగికి ప్రతి ఆరోగ్య సందర్శనకు 21.59 కి.మీ  ఆదా చేసిందని మరియు ప్రత్యేకంగా మరియు పరోక్షంగా 941.51  రూపాయలను ఆదా చేసిందని వివరించారు. ఈ విధానం వల్ల దేశం మొత్తం మీద 7,522 కోట్ల రూపాయల ఆదా జరిగిందని పేర్కొన్నారు. టెలీ సంప్రదింపుల సౌకర్యం  ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాల్లో లభిస్తుందని డాక్టర్ మాండవీయ తెలిపారు.    ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు 12 ఆరోగ్య సేవలు అందిస్తున్నాయని అన్నారు. వీటికి మరింత ప్రచారం కల్పించి, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నెలకు ఒకసారి   స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్స్ మరియు చికిత్స విధానాలపై ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని మంత్రి సూచించారు. 

  “ మనకు కావలసిన ప్రపంచాన్ని నిర్మించండి: అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తు ”అనే నినాదంతో  విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ 2022 దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించే అంశంలో ఆరోగ్య రక్షణ అంశం ప్రాధాన్యత వివరించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సమస్యలు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో   విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ కృషి చేస్తుంది. జీ20 లో భారతదేశం  విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత అంశంగా గుర్తించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆరోగ్య రంగం ఉపయోగపడుతుందని భారతదేశం భావిస్తోంది. 

సదస్సు  మొదటి రోజున కింది తరగతుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన   రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులు  ప్రదానం చేయబడ్డాయి:
1. లక్ష్య సాధన కోసం  ఆరోగ్య కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు నిర్వహణ ,
2. టెలి కన్సల్టేషన్), మరియు
3. ABHA ID కేటాయింపు 

 PM- ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) మరియు 15 వ  ఆర్థిక సంఘం సిఫార్సులు అమలుపై మంత్రుల స్థాయి  సమావేశం కూడా ఈరోజు జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎ సిఇఒ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, శ్రీమతి రోలి సింగ్, ఎఎస్ అండ్ ఎండి (ఎన్‌హెచ్‌ఎం), కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు  చెందిన సీనియర్ అధికారులు మరియు అభివృద్ధి భాగస్వాముల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

***

 


(Release ID: 1882629) Visitor Counter : 342


Read this release in: English , Urdu , Hindi , Tamil