గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారతదేశ యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి , శిక్షణ కోసం అవసరాల ఆధారిత స్కిల్ మ్యాపింగ్ కు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ పిలుపు.
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై సమక్షంలో బెంగళూరులోని కుంబలగోడులో నేషనల్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (రుడ్ సెట్) - ఎన్ఎఆర్ కొత్త క్యాంపస్ ను మంత్రి ప్రారంభించిన కేంద్ర మంత్రి
Posted On:
10 DEC 2022 5:12PM by PIB Hyderabad
ఆర్ ఎస్ ఇ టిఐ ల ద్వారా 44 లక్షల మంది యువత శిక్షణ పొందగా వీరిలో దాదాపు 31 లక్షల మంది అభ్యర్థులు ఇప్పటివరకు స్థిరపడ్డారని, శిక్షణ పొందిన 44 లక్షల మంది యువతలో 29 లక్షల మంది మహిళా అభ్యర్థులు (సుమారు 66%) ఉన్నారని కేంద్ర . మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు.
శిక్షణ పొందిన 14.28 లక్షల మంది అభ్యర్థులు ఆర్ ఎస్ ఇ టిఐ ల తరఫున బ్యాంకులు , ఆర్థిక సంస్థల నుంచి రూ.7200 కోట్ల క్యుములేటివ్ క్రెడిట్ పొందారు.
భారతదేశ యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి శిక్షణ కోసం అవసరాల ఆధారిత స్కిల్ మ్యాపింగ్ అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు. ఉద్యోగ శిక్షణలో నాణ్యత ముఖ్యమని పేర్కొన్న మంత్రి, దేశంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఎలక్ట్రానిక్, విద్య , శిక్షణ, ఐటి అండ్ బిపిఓ , పర్యాటకం , ఆతిథ్య రంగాలతో సాంప్రదాయ ట్రేడ్ లను ఎలా ఉత్తమంగా అనుసంధానించవచ్చో మార్గాలను అన్వేషించాలని మంత్రి కోరారు.
బెంగళూరులోని కుంబలగోడులో నేషనల్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (రుడ్సెట్) నూతన క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కేంద్ర గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ,ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే,కర్ణాటక రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత , జీవనోపాధి మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వథ్ నారాయణ్, కర్ణాటక సహకార శాఖ మంత్రి శ్రీ ఎస్ టి సోమశేఖర, ఎంపి , ఎన్ఎఆర్ అధ్యక్షుడు డాక్టర్ వీరేంద్ర హెగ్గడే ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు - ఆర్ఎస్ఇటిఐలు భారతదేశాన్ని ప్రధాన మానవ వనరుల కేంద్రంగా నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఆర్ఎస్ఇటిఐలు 44 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చాయని, వారిలో దాదాపు 31 లక్షల మంది అభ్యర్థులు స్థిరపడ్డారని శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు
శిక్షణ పొందిన మొత్తం అభ్యర్థుల్లో 29 లక్షల మంది (66 శాతానికి పైగా )మహిళా అభ్యర్థులు ఉన్నారని, ఇది ఆర్ఎస్ఇటిఐలు "మహిళా సాధికారతకు" చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయని రుజువు చేస్తుందని మంత్రి తెలియజేశారు.
రాబోయే 20 ఏళ్లలో భారత శ్రామిక శక్తి 32 శాతం పెరుగుతుందని, మొత్తం ప్రపంచ మానవశక్తి నాలుగు శాతం తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి నివేదికను డాక్టర్ గిరిరాజ్ సింగ్ ఉదహరించారు.
శిక్షణ పొందిన అభ్యర్థులకు వారి విజయవంతమైన సెటిల్మెంట్ కోసం అవసరమైన రుణాలను అందుబాటులో ఉంచడానికి ఆర్ఎస్ఇటిఐలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఆయన అన్నారు. శిక్షణ పొందిన 14.28 లక్షల మంది అభ్యర్థులకు లో లింక్ చేసిన క్రెడిట్ , క్యుములేటివ్ క్రెడిట్ పంపిణీ రూ.7200 కోట్లు. ఆర్ఎస్ఈటీఐ శిక్షణ పొందిన అభ్యర్థుల క్రెడిట్ లింకేజీ సగటు స్థాయి 51 శాతంగా ఉందని మంత్రి తెలిపారు.
బెంగళూరులోని ఎన్ఎఆర్ కొత్త క్యాంపస్ ప్రాజెక్ట్ కోసం రూ .25 కోట్లు ఆమోదించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఎకరాల భూమిని కేటాయించింది
ప్ర స్తుతం 27 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల లోని 572 జిల్లాల్లో 590 ఆర్ ఎస్ ఈటీఐలు పని చేస్తున్నాయి.
వీటిలో కర్ణాటకలో 33 ఆర్ఎస్ఇటిఐలు ఇప్పటివరకు 3.49 లక్షల మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చాయి. ఆర్ఎస్ఇటిఐలను ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులతో సహా 24 బ్యాంకులు స్పాన్సర్ చేస్తాయి.
1982 లో కెనరా బ్యాంక్, పూర్వపు సిండికేట్ బ్యాంక్, ధర్మస్థల లోని ఎస్ డి ఎం ఇ ట్రస్ట్, డాక్టర్ డి.వీరేంద్ర హెగ్గాడే, ధర్మాధికారి, శ్రీ క్షేత్ర ధర్మస్థల ఆధ్వర్యంలో.దేశంలోని గ్రామీణ యువతలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (రుడ్సెట్) ప్రత్యేక భావనకు మార్గదర్శకంగా నిలిచాయి.అప్పటి నుండి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా రుడ్సేటి నమూనాను ప్రతిబింబిస్తున్నందున బ్యాంకులు తమ లీడ్ డిస్ట్రిక్ట్ లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను (ఆర్ ఎస్ ఇటిఐ) ఏర్పాటు చేయాలని సూచించింది. 2008లో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ రుడ్సేటీ-ఎన్ఎఆర్ 2011లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
అంతకుముందు, శ్రీ గిరిరాజ్ సింగ్ హాస్టల్ బ్లాక్ ను లాంఛనంగా ప్రారంభించారు, శ్రీ బొమ్మై కొత్త క్యాంపస్ అడ్మిన్ బ్లాక్ ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కూడా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ కర్మా జింపా భూటియా, కర్ణాటక ప్రభుత్వ సీనియర్ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విజయవంతమైన ఆర్ ఎస్ ఈటీఐ RSETI ట్రైనీల అనుభవాన్ని పంచుకోవడం , వ్యవస్థాపకులకు బ్యాంకు రుణాల పంపిణీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.
<><><><>
(Release ID: 1882348)
Visitor Counter : 297