సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ముంబైలో ప్యాక్‌మాచ్ ఆసియా 2022లో ప్యాకేజింగ్‌పై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశం
Posted On:
07 DEC 2022 6:04PM by PIB Hyderabad
మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ప్యాక్‌మాచ్ ఆసియాలో ప్యాకేజింగ్‌పై మెగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను 7–9 డిసెంబర్, 2022 మధ్య ముంబైలో కొనుగోలుదారుల అమ్మకందారుల సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ రోజు ప్రారంభ సెషన్‌లో మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, పీహెచ్డీసీసీఐ, ఐపీఎంఎంఐ, ఐఐపీ, డీజీఎఫ్టీ, లంక, యూకే, జర్మనీ, బంగ్లాదేశ్, ఇటలీ, ఘనా, నేపాల్, భూటాన్, కెన్యా, స్పెయిన్, ఆస్ట్రేలియా, మయన్మార్ పరిశ్రమల నుండి విదేశీ ప్రతినిధులు/స్పీకర్లు ప్రతినిధులు వివిధ సాంకేతిక సెషన్లలో ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా ఎంఎస్ఎంఈలు హాజరవుతున్నాయి. మెగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ భాగంగా కొనుగోలుదారుల అమ్మకందారుల సమావేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా, ఈపీఆర్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, బయో-డిగ్రేడబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్స్, లేటెస్ట్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ పరిశ్రమకు వ్యాపార అవకాశాలపై వివిధ సాంకేతిక సెషన్లు నిర్వహిస్తున్నారు. ప్యాకేజింగ్ పరిశ్రమలో ఎంఎస్ఎంఈ వృద్ధికి తోడ్పడే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. అదనంగా, బీ2బీ సెషన్‌లు, ఎగుమతి కోసం వ్యాపార అనుసంధానాలను కలిగి ఉండటానికి భారతీయ ఎంఎస్ఎంఈలతో సాంకేతిక సహకారం కోసం కొనుగోలుదారు అమ్మకందారుల సమావేశాలు కూడా జరుగుతున్నాయి.
***
(Release ID: 1882011)
Visitor Counter : 88