ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డిసెంబర్‌ 10న వారణాసిలో సార్వత్రిక ఆరోగ్య భద్రత (యుహెచ్‌సి) దినోత్సవం-2022


“మనం కోరుకునే ప్రపంచ నిర్మాణం: అందరికీ ఆరోగ్యకర

భవిష్యత్తు” ఇతివృత్తంగా రెండురోజుల ఆరోగ్యమంత్రుల

సదస్సుకు యూపీ గవర్నర్‌ శ్రీమతి ఆనందీబెన్‌పటేల్‌ శ్రీకారం;

సదస్సుకు హాజరుకానున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌

Posted On: 08 DEC 2022 1:15PM by PIB Hyderabad

త్తరప్రదేశ్‌లోని వారణాసిలో “సార్వత్రిక ఆరోగ్య భద్రత (యుహెచ్‌సి) దినోత్సవం-2022”లో భాగంగా 2022 డిసెంబర్ 10, 11 తేదీల్లో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రెండు రోజుల సదస్సును నిర్వహించనుంది. రాష్ట్ర గవర్నర్‌ గౌరవనీయ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమక్షంలో ఈ వేడుకలను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో రోజు ఆరోగ్య మంత్రుల సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సహకార-కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష్ హాల్ వేదిక కానుండగా- వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ఇందులో పాల్గొంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి/ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సహా ‘ఎన్‌హెచ్‌ఎం’ మిషన్ డైరెక్టర్లు, ఆరోగ్యశాఖ డైరెక్టర్, ఇతర రాష్ట్ర అధికారులు, 900 మంది సామాజిక ఆరోగ్య అధికారులు/ఆరోగ్య-శ్రేయో కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లు, 5 రాష్ట్రాల- ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మెడికల్ ఆఫీసర్లు, జాతీయ నిపుణులు, ‘ఎబి-హెచ్‌డబ్ల్యూసీ’ల విస్తరణకు తోడ్పడే అభివృద్ధి-అమలు భాగస్వాములు కూడా హాజరవుతారు. మొత్తంమీద వారణాసిలో జరిగే సదస్సులో 1200 మందికిపైగా పాల్గొంటారని అంచనా.

ప్రగతిశీల, వ్యాధినివారక, వ్యాధి నిర్మూలక, పునరావాస ఆరోగ్య సేవలు పేదలందరికీ అందుబాటులో ఉండాలన్నది సార్వత్రిక ఆరోగ్య భద్రత (యుహెచ్‌సి) లక్ష్యం. అలాగే సదరు సేవలకు చెల్లింపు చేయాల్సి వస్తే ఎలాంటి భారం కాకుండా అవన్నీ సమర్థంగా, తగినంత నాణ్యతతో లభ్యమయ్యేలా చూడాలన్నది ధ్యేయం.” కాగా, ఏటా డిసెంబరు 12న “అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య భద్రత దినోత్సవం” నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి అధికారికంగా 2017లో ప్రకటించింది. ఈ కార్యక్రమానికి “మనం కోరుకునే ప్రపంచ నిర్మాణం: అందరికీ ఆరోగ్యకర భవిష్యత్తు”ను ఇతివృత్తంగా నిర్ణయించింది. ప్రపంచ ప్రజానీకం మొత్తానికీ ఆరోగ్యకర భవిష్యత్తు ఇవ్వడంలో ఆరోగ్య భద్రత పాత్రను, ప్రాముఖ్యాన్ని ఈ ఇతివృత్తం స్పష్టం చేస్తుంది. అలాగే, జి20 ఆరోగ్య స్థితిగతుల అనుసరణ కూడా దీని ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంది. మరోవైపు సార్వత్రిక ఆరోగ్య భ్రదత, మెరుగైన ఆరోగ్య సంరక్షణపైనా దృష్టి సారించాలని నిర్దేశిస్తుంది.

‘యుహెచ్‌సి’ సదస్సులో భాగంగా మూడు సచివుల స్థాయి సమావేశాలుంటాయి:

  1. పీఎం-ఏబీహెచ్‌ఐఎం’ అమలుతోపాటు ఆరోగ్యంపై 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం
  2. వ్యాధి నిర్మూలన- (టీబీ, కాలా అజర్‌, లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌, మలేరియా, లెప్రసీ)
  3. ప్రధానమంత్రి జనారోగ్య యోజన (పీఎంజేఏవై) అమలు, ‘పీఎంజేఏవై’ కార్డుల పంపిణీ

కార్యక్రమంలో భాగంగా ‘ఎబి-హెచ్‌డబ్ల్యుసి’లు, టెలి-మనస్‌ (ఎంఎఎన్‌ఎఎస్‌), సీహెచ్‌ఓలకు శిక్షణ కార్యక్రమాలు, ప్రారంభోత్సవంలో ‘సాక్షాత్‌’ పోర్టల్‌లకు డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ శ్రీకారం చుడతారు. అలాగే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను సత్కరిస్తారు.

ఉత్తమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కింది ఇతివృత్తాల ఆధారంగా సత్కారం:

ఎ. లక్ష్యాల మేరకు ‘హెచ్‌డబ్ల్యూసీ'ల కార్యాచరణ సాధన

బి. దూరవాణి సంప్రదింపులు

సి. ‘ఎబిహెచ్‌ఎ ఐడి’ సృష్టి; వివిధ ఆరోగ్య పోర్టళ్లలో వివరాల నమోదు

ప్రధాన కార్యక్రమానికి అనుబంధంగా ఉత్తర భారత సామాజిక ఆరోగ్యాధికారుల (సీహెచ్‌ఓ) తొలి ప్రాంతీయ సమావేశం నిర్వహించబడుతుంది. ఇందులో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు పాల్గొంటాయి. ఈ రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది ‘సీహెచ్‌ఓ’లు, ఎంబీబీఎస్‌ వైద్యాధికారులు, ఆయుష్ వైద్యులు (‘పీహెచ్‌సీ’లు, ఆయుష్ డిస్పెన్సరీల ఇన్‌ఛార్జ్) పాల్గొంటారు. అలాగే ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య-శ్రేయో కేంద్రాల పరిధిలో అత్యుత్తమ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బృందాలకూ (‘సీహెచ్‌ఓ, ఆశా, ఎఎన్‌ఎం’) సత్కారం ఉంటుంది. ప్రాంతీయ ‘సీహెచ్‌ఓ’ సమావేశంలో నాలుగు ప్రధాన ఇతివృత్తాలు కింది రంగాలపై దృష్టి సారిస్తాయి:

  1. ఆస్పత్రి-ప్రజారోగ్య విధులు- సేవల విస్తరణ ప్యాకేజీ రూపకల్పన, శ్రేయో కార్యకలాపాల నిర్వహణ, వార్షిక ఆరోగ్య కేలెండర్ రోజులు వగైరా...
  2. నిర్వాహక విధులు- హెచ్‌డబ్ల్యూసీ బృందం నాయకత్వం, హెచ్‌డబ్ల్యూసీ నిర్వహణ, డేటా ఆధారిత ప్రణాళిక-పర్యవేక్షణ
  3. సామాజిక సంధానం-సమీకరణ-జనారోగ్య సమితితో కలిసి పనిచేయడం, ఇతర విభాగాలతో సమన్వయ చర్యలు, ‘హెచ్‌డబ్ల్యూసీ’లో ఆయుష్ సేవలు.
  4. ఐటీ కార్యకలాపాలు- ఇ-సంజీవని ద్వారా దూరవాణి సేవలు- సంరక్షణ కొనసాగింపు, టెలిమానస్‌ ‘ఎబిహెచ్‌ఎ – ఐడి.’

 

******



(Release ID: 1882009) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Marathi