అణుశక్తి విభాగం

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద భారత అణుశక్తి సంస్థ (ఎన్‌పీసీఐఎల్‌) ఇప్పటిదాకా చేసిన ఖర్చు రూ.663 కోట్లు: కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌


ఇందులో 70 శాతందాకా అణు విద్యుత్‌ ప్లాంట్ల పరిసర

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించబడింది

Posted On: 08 DEC 2022 1:56PM by PIB Hyderabad

మిళనాడులోని కల్పాక్కం, కూడంకుళం సహా దేశంలోని అన్ని అణువిద్యుత్‌ ప్లాంట్లలో వినియోగించిన ఇంధన-రేడియోధార్మిక-అణు వ్యర్థాల సురక్షిత నిర్వహణ-నిల్వ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన, పీఎంవో-ప్రజా సమస్యలు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు.

మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ- రియాక్టర్‌లో వాడిన తర్వాత, అలా వెచ్చించిన ఇంధనాన్ని నీటితో నింపిన నిల్వ కొలనులలో ఉంచి, నిరంతరం జాగ్రత్తగా పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఇక కూడంకుళం విషయంలో ఇంధనం ‘ఐఏఇఏ’ రక్షణలో ఉన్నందున, వాడిన ఇంధన నిల్వల భద్రత బాధ్యత కూడా ‘ఐఏఇఏ’ తనిఖీ అధికారుల చేతిలోనే ఉంటుందని పేర్కొన్నారు. వాడిన ఇంధన నిల్వ కొలనులు AERB మార్గదర్శకాల ప్రకారం రూపొందించినవి కాగా- ఇవి అంతర్జాతీయ నియంత్రణ విధానాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతసహా ఇతరత్రా బాధ్యతల కింద అణువిద్యుత్‌ ప్లాంట్ల పరిసరాల్లోని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన గురించి ఆయన వివరించారు. కంపెనీల చట్టం-2013 నిర్దేశిస్తున్న కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా భారత అణుశక్తి సంస్థ (ఎన్‌పీసీఐఎల్‌) ఇప్పటిదాకా రూ.663 కోట్లు వెచ్చించిందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. ఇందులో దాదాపు 70 శాతానికిపైగా సొమ్మును అణువిద్యుత్‌ ప్లాంట్లుగల పరిసర గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేసినట్లు పేర్కొన్నారు.

దీంతోపాటు కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం ఇరుగుపొరుగు గ్రామాల కోసం ‘పరిసర ప్రాంతాల ప్రత్యేకాభివృద్ధి కార్యక్రమం (ఎన్‌డిపి) కింద రూ.500 కోట్లు (మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లు, గృహనిర్మాణానికి రూ.300 కోట్లు) ఖర్చు చేశామని తెలిపారు.

 

******



(Release ID: 1882003) Visitor Counter : 112


Read this release in: English , Tamil