అణుశక్తి విభాగం
కూడంకుళంలోని అణు విద్యుత్ ప్లాంటులో తలా 1000 మెగావాట్ల సామర్థ్యంగల
నాలుగు యూనిట్లు 2027నాటికి పూర్తి: కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్
Posted On:
08 DEC 2022 1:54PM by PIB Hyderabad
కూడంకుళంలోని అణువిద్యుత్ కేంద్రంలో చెరో 1000 మెగావాట్ల సామర్థ్యంగల 1, 2 యూనిట్లు ఇప్పటికే పనిచేస్తుండగా, ఇదేతరహాలో తలా 1,000 మెగావాట్ల సామర్థ్యంతో మరో నాలుగు యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన, పీఎంవో-ప్రజా సమస్యలు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నిర్మాణంలోగల నాలుగు యూనిట్లను ప్రగతిశీలంగా 2027కల్లా పూర్తిచేస్తే కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం 6000 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో ఉత్పాదన చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబుగా చేసిన ప్రకటనలో- కూడంకుళం ప్రాజెక్టు అంచనా స్థాపిత సామర్థ్యం 6000 మెగావాట్లు కాగా, ఇందులో ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యంగల ఆరు అణు విద్యుత్ రియాక్టర్లున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వీటిలో తొలి రెండు యూనిట్లు అంటే ‘కెకెఎన్‌పీపీ-1, 2’ (2X1000 మె.వా.) పనిచేస్తుండగా, మిగిలిన నాలుగూ- ‘కెకెఎన్‌పీపీ-3, 4 (2X1000 MW), ‘కెకెఎన్‌పీపీ-5, 6 (2X1000 MW) ఇంకా పూర్తికావాల్సి ఉంది.
అణు విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్తు (కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్‌సహా)ను కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంలోని వివిధ లబ్ధిదారు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు కేటాయిస్తుంది. కాగా- ‘కెకెఎన్‌పీపీ-1, 2’ (2X1000 మె.వా.)ల నుంచి ఏ రాష్ట్రానికీ కేటాయించని విద్యుత్తు నుంచి కేరళకు 266 మెగావాట్లు స్థిరంగా దక్కుతోంది. ప్రస్తుతం (ఎవరికీ కేటాయించనిది సహా) కేరళ రాష్ట్రం ‘కెకెఎన్‌పీపీ-1 నుంచి 13.48 శాతం, ‘కెకెఎన్‌పీపీ-2 నుంచి 13.30 శాతం వంతున విద్యుత్ కేటాయింపు పొందుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాణంలోగల ‘కెకెఎన్‌పీపీ-3, 4తోపాటు ‘కెకెఎన్‌పీపీ-5, 6 యూనిట్ల నుంచి విద్యుత్ కేటాయింపుపై కేంద్ర విద్యుత్ శాఖ తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుని, సమాచారమిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
******
(Release ID: 1882001)
Visitor Counter : 207