రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

రోడ్డు ఓవర్ వంతెనల నిర్మాణం

Posted On: 08 DEC 2022 12:49PM by PIB Hyderabad

ప్రస్తుత సంవత్సరంలో కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ మరియు మహారాష్ట్రతో కలిపి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారులపై రోడ్ ఓవర్ బ్రిడ్జిలతో సహా రోడ్లు / రహదారుల నిర్మాణం కోసం 46,960.52 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం 80 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 

జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు ప్రాజెక్టుల వారీగా బదులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా కెటాయించడం జరుగుతుంది.   2021-22 మరియు 2022-23 ఆర్థిక సంవత్సరాలకు గాను, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ మరియు మహారాష్ట్రతో కలిపి, జాతీయ రహదారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 45,117.02 కోట్ల రూపాయలను కేటాయించింది.  

గత సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరంలో ఆమోదం పొందిన మొత్తం 80 ప్రాజెక్టులలో 21,288.98 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 24 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి, 2025 ఆగస్టు నాటికి, ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది.  మిగిలిన 56 ప్రాజెక్టులు వివిధ బిడ్డింగ్ దశల్లో ఉన్నాయి.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్‌ సభకు లిఖిత పూర్వకంగా  అందజేసిన సమాధానంలో, ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

*****



(Release ID: 1881997) Visitor Counter : 68


Read this release in: Tamil , English , Urdu , Bengali