జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది శుద్ధి మంత్రిత్వ శాఖ

అక్టోబ‌ర్ 2022 నెల‌కు వాట‌ర్ హీరోస్‌; షేర్ యువ‌ర్ స్టోరీస్ పోటీ విజేత‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ

Posted On: 06 DEC 2022 6:12PM by PIB Hyderabad

జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని జ‌ల‌వ‌న‌రులు, న‌దీ అభివృద్ధి, గంగా పున‌రుద్ధ‌ర‌ణ విభాగం, వాట‌ర్ హీరోస్‌;  షేర్ యువ‌ర్ స్టోరీస్ (జ‌ల వీరులు;  మీ క‌థ‌ల‌ను పంచుకోండి) పోటీని ప్రారంభించింది. నేటివ‌ర‌కూ, మైగ‌వ్ పోర్ట‌ల్‌పై ఈ పోటీకి సంబంధించి మూడు ఎడిష‌న్ల‌ను ప్రారంభించారు. తొలి ఎడిష‌న్‌ను 01.09.2019 నుంచి 30.08.2020 వ‌ర‌కు ప్రారంభించ‌గా, రెండ‌వ ఎడిష‌న్‌ను 19.09.2020 నుంచి 31.08.2021 వ‌ర‌కు సాగింది. మూడ‌వ ఎడిష‌న్ 01.12.2021న ప్రారంభ‌మై 30.11.2022వ‌ర‌కు సాగింది. 
నీటి విలువ‌ను ప్రోత్స‌హించ‌డం, దేశ‌వ్యాప్తంగా జ‌ల సంర‌క్ష‌ణ కృషిని, నీటి వ‌న‌రుల నిల‌క‌డైన అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డం దీని ల‌క్ష్యం.  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా, దేశంలో నీటిని సంర‌క్షించ‌డం అన్న ప్ర‌యోజ‌నాన్ని అనుస‌రించేందుకు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌ను ఇవ్వాలి. ఈ పోటీ ల‌క్ష్యం నీటి సంర‌క్ష‌ణ ప‌ట్ల అవ‌గాహ‌న‌ను పెంపొందించి, నీటి వీరుల అనుభ‌వాల‌ను పంచుకోవ‌డమే కాక నీటి సంర‌క్ష‌ణ‌, నిర్వ‌హ‌ణ ప‌ట్ల ఒక వైఖ‌రిని సృష్టించి త‌ద్వారా భాగ‌స్వాముల‌లో ప్ర‌వ‌ర్త‌నా మార్పును సృష్టించ‌డం. 
ఈ పోటీ  ఉద్దేశ్యం నీటి విలువ‌ను ప్రోత్స‌హించ‌డం, నీటి సంర‌క్ష‌ణ‌, నీటి వ‌న‌రుల నిల‌క‌డైన అభివృద్ధి పై దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తును అందించ‌డం. 
ఈ పోటీ ల‌క్ష్యం నీటి సంర‌క్ష‌ణ ప‌ట్ల అవ‌గాహ‌న‌ను పెంపొందించి, నీటి వీరుల అనుభ‌వాల‌ను పంచుకోవ‌డమే కాక నీటి సంర‌క్ష‌ణ‌, నిర్వ‌హ‌ణ ప‌ట్ల ఒక వైఖ‌రిని సృష్టించి త‌ద్వారా భాగ‌స్వాముల‌లో ప్ర‌వ‌ర్త‌నా మార్పును సృష్టించ‌డం.
దేశంలో నీటి సంర‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాన్ని అనుస‌రించేందుకు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌ను ఇవ్వ‌డం.
అనేక జాతీయ స్థాయి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఆర్‌డ‌బ్ల్యుహెచ్ ప‌రిష్కారాన్ని ప్ర‌ద‌ర్శించాయి. 
దేశ‌వ్యాప్తంగా ఉన్న స్వ‌చ్ఛంద సంస్థ‌లు న‌గ‌రాల‌లో ఎండిన చెరువుల‌ను పున‌రుద్ధ‌రించేందుకు, మొక్క‌ల‌ను నాటేందుకు చేతులు క‌లుప‌నున్నాయి. 
అక్టోబ‌ర్‌, 2022 మాసానికి ముగ్గ‌రు విజేత‌లను ప్ర‌క‌టించారు. వారు రూ. 10,000 న‌గ‌దు, స‌ర్టిఫికెట్‌ను అందుకోనున్నారు. వివ‌రాల‌ను దిగువ‌న ఇవ్వ‌డం జ‌రిగిందిః 
శ్రీ మహేంద‌ర్ సింగ్ తావ‌ర్‌, ఐఎఎస్‌
ఆయ‌న ప్ర‌జ‌ల కోసం జ‌న్ చౌపాల్‌ను నిర్వ‌హిస్తారు. ఇందులో చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌పై చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హించి, శ్ర‌మ‌దానం చేసేందుకు ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌ను ఇస్తారు. ఆయ‌న ఘ‌జియాబాద్ మున్సిపల్ క‌మిష‌న‌ర్‌గా గ్రీన్ బాండ్‌ను ప్రారంభించారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించేందుకు ఆయ‌న దేశ‌వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ గ్రూప్‌ల‌ను / ఎన్జీవోల‌ను న‌గ‌రంలోని ఎండిన చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు, మొక్క‌ల‌ను నాటేందుకు చేతులు క‌ల‌ప‌వ‌ల‌సిందిగా అభ్య‌ర్ధించారు. 
ఎహ‌సాస్‌, ఎన్జీవో
గ‌త కొన్నేళ్ళుగా జ‌ల సంర‌క్ష‌ణ క్ష‌త్రంలో ఈ సంస్థ ప‌ని చేస్తూ, ఇంటిక‌ప్పుల‌పై వాన‌నీటి నిల్వ న‌మూనాను ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ న‌మూనాను క‌నీస తాపీప‌నితో ఏర్పాటు చేసుకోవ‌డ‌మేకాక‌, నిర్వ‌హ‌ణ ఉచితం, చౌక అయిన‌ది కావ‌డ‌మే కాక శుభ్రం చేసే ఫిల్ట‌ర్ వ్య‌వ‌స్థ‌తో ఉంటుంది. అనేక రాష్ట్రాల‌లో వీరి న‌మూనాను ప్ర‌య‌త్నించి, ప‌రీక్షించారు. వీరు ఈ ఆర్‌డ‌బ్ల్యుహెచ్ ప‌రిష్కారాన్ని అనేక జాతీయ స్థాయి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో ప్ర‌ద‌ర్శించారు. 

కుమారి నేహా కుష్వాహా
మ‌న పూర్వీకుల జ్ఞాప‌కార్ధం మొక్క‌లు నాట‌డం అన్న శీర్షిక‌తో ఆమె మొక్క‌లు నాటే ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ఆమె మొక్క‌లు నాటే ప్ర‌చారం ద్వారా మొక్క‌ల ఆకుల నుంచి ఆవిరైన నీటి ప‌రిమాణంపై ప్ర‌యోగం చేసింది. 
ఈ పోటీని నెల‌వారీగా నిర్వ‌హిస్తారు. దీని వివ‌రాల‌ను మైగ‌వ్ పోర్ట‌ల్‌లో పొంద‌వ‌చ్చు. ఈ పోటీలో పాల్గొనేందుకు, వ్య‌క్తులు నీటి సంర‌క్ష‌ణ కృషికి సంబంధించి 1-5 నిమిషాల వీడియోలు, క‌నీసం 300 ప‌దాల వివ‌ర‌ణ‌, త‌మ కృషికి సంబంధించిన కొన్ని ఫోటోల‌ను పోస్ట్ చేయ‌డం ద్వారా త‌మ విజ‌య గాథ‌ల‌ను పంచుకోవాలి. అంతేకాక‌, పోటీలో పాల్గొనేవారు త‌మ వీడియోల‌ను మైగ‌వ్ పోర్ట‌ల్ (www.mygov.in)లో పంచుకోవ‌చ్చు. త‌మ ఎంట్రీల‌ను waterheroes.cgwb[at]gmail[dot]com అన్న మెయిల్ ఐడికి పంప‌డం ద్వారా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. 

 

****
 



(Release ID: 1881286) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi