యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

భారతదేశంలో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లను తయారు చేయడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి : కేంద్ర యువజన & క్రీడా వ్యవహారాల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్,

Posted On: 06 DEC 2022 7:30PM by PIB Hyderabad

అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లను తయారు చేయడంలో విశ్వవిద్యాలయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కేంద్ర సమాచార, ప్రసార, యువజన, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి పేర్కొన్నారు.    ఆయన ఈ రోజు చెన్నైలో క్రీడా ప్రముఖులు, భారత ఒలింపిక్ సంఘం ఆఫీస్ బేరర్లు, ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముసాయిదా విధి విధానాలు రూపొందించేందుకు 40 నుంచి 50 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలియజేశారు.

దేశంలో 943 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఒక్కొక్క క్రీడాకారుడి చొప్పున దత్తత తీసుకుని వారికి విద్య, అంతర్జాతీయ శిక్షణ సౌకర్యాలు కల్పించగలిగితే భారత్ 900 నుంచి 1000 మంది అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయగలదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ దిశగా ముందుకెళ్లేందుకు, "ఖేలో ఇండియా ప్రాజెక్టు" కింద కేంద్ర ప్రభుత్వం, వివిధ "స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" కేంద్రాలు ప్రారంభించినట్లు, ఆయన చెప్పారు.  స్పోర్ట్స్ సైన్స్ రంగంలో కూడా ఒక "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌" ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం యోచిస్తోంది.  సైన్స్ మద్దతు లేకుండా ఒక అథ్లెట్ ఏమీ సాధించలేడు.  ప్రతి అథ్లెట్ విజయం వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంటుందని, కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

హర్యానాలోని సోనిపట్‌ లో ఒక స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ ను ప్రారంభించనున్నట్లు, ఆయన చెప్పారు.  కర్ణాటక లోని బెంగళూరు, పంజాబ్‌ లోని పాటియాల లో కూడా ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, కేంద్ర మంత్రి చెప్పారు. 

 

 

*****



(Release ID: 1881285) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Hindi