రైల్వే మంత్రిత్వ శాఖ
పొగమంచు వాతావరణంలో రైళ్ళ జాప్యాన్ని నివారించేందుకు భారతీయ రైల్వేలు తీసుకున్న చర్యలు
Posted On:
06 DEC 2022 4:40PM by PIB Hyderabad
పొగమంచుకాలంలో రైళ్ళ కార్యకలాపాల భద్రతను పెంచేందుకు, దేశంలోని ఉత్తర ప్రాంతాలలో మంచు ఉన్న సమయంలో రైళ్ళ నిర్వహణ సజావుగా సాగేందుకు భారతీయ రైల్వేలు పలు చర్యలు చేపట్టింది.
రైళ్ళలో పొగమంచు పరికరాలను ఉపయోగించడంతో, పొగమంచు/ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గరిష్టంగా అనుమతించదగిన వేగాన్ని గంటకు 60 కిమీల నుంచి గంటకు 75 కిమీలకు పెంచవచ్చని నిర్ణయించింది.
పొగమంచు ఉన్న కాలంలో పొగమంచుతో ప్రభావితమైన ప్రాంతాలలో రైళ్ళను నడిపే పైలెట్లకు విశ్వసనీయ సురక్షిత పొగమంచు పరకరాలు అందుబాటులో ఉంటే వారికి సమకూరుస్తారు.
డెటొనేటర్లు అందుబాటులో ఉంచడం, తగినన్ని డెటొనేటర్ల సరఫరా చేయాలని నిశ్చయించింది. ఫాగ్ సిగ్నల్స్ ( పొగమంచు సంకతాలు) లేదా డెటొనేటర్లుగా తెలిసిన డెటొనేటింగ్ సిగ్నల్స్ అనేవి పట్టాలపై అమర్చే ఉపకరణాలు. ఇంజిన్ ఆ పట్టాలపై వెళ్ళినప్పుడు డ్రైవర్ దృష్టిని ఆకర్షించేందుకు బిగ్గరగా పేలుతాయి.
సైటింగ్ బోర్డు వద్ద లేదా (రెండు దూరపు సిగ్నళ్ళు ఉన్న సందర్భంలో దూరంగా ఉన్న సిగ్నల్) వద్ద పట్టాల వద్ద సున్నంతో మార్కింగ్ చేయాలి.
సిగ్నళ్ళను ప్రదర్శించే బోర్డులు, విజిల్ బోర్డులు, ఫాగ్ సిగ్నల్ పోస్టులు, రద్దీగా ఉండే, ప్రమాదాలు జరిగే అవకాశమున్న దుర్బలమైన లెవెల్ క్రాసింగ్ గేట్లు (రోడ్డు రైలుదారి కలియుచోట రైలు గేట్లు) వద్ద పెయింటింగ్ చేయడం లేదా పసుపు/ నలుపు ప్రకాశించే రేఖలను వేయాలి. అవి సరిగ్గా కనిపించేందుకు తిరిగి పెయింటింగ్ చేసే పనిని పొగమంచు కాలం వచ్చే ముందే పూర్తి చేయాలి.
రద్దీగా ఉండే రైలు గేట్ల వద్ద బారియర్లను ఎత్తివేయడం అవసరమైనప్పుడు, పసుపు/ నలుపు ప్రకాశవంతమైన సూచిక రేఖలను ఏర్పాటు చేయాలి.
కొత్తగా వచ్చిన సీటింగ్ కమ్ లగేజ్ రేక్(ఎస్ఎల్ఆర్)లకు ఇప్పటికే ఎల్ఇడి ఆధారిత ఫ్లాషర్ టెయిల్ లైట్లను అమర్చారు, కనుక ఎరుపు రంగు లైట్లు అమర్చి ఉన్న ఎస్ఎల్ఆర్‌లలో వాటిని మార్చి వాటి స్థానంలో ఎల్ఇడి లైట్లను అమర్చాలి.పొగమంచు వాతావరణంలో భద్రతను నిర్ధారించడంలో ఇది చాలా ముఖ్యమైన అడుగు.
ఇప్పటికే ఉన్న సూచనల ప్రకారం స్టాప్ సిగ్నళ్ళను గుర్తించడం కోసం సిగ్మా ఆకారంలోని రెట్రో రిఫ్లెక్టివ్ స్ట్రిప్ ను ఏర్పాటు చేయాలి. పొగమంచుతో ప్రభావితమైన రైల్వేలు సిబ్బంది విధులు మారే స్థలాలను సమీక్షించుకోవాలి. రహదారిపై ప్రయాణ గంటలు పెరిగిన నేపథ్యంలో, సిబ్బంది విధులు మారే నూతన/ అదనపు ప్రాంతాలలో రైల్వేలు మౌలికసదుపాయాలను సృష్టించవచ్చు. అదే సమయంలో, పొగమంచు కాలంలో లోకో/ సిబ్బంది/ రేక్ లింక్‌లను సమీక్షించుకోవాలి. ముఖ్యంగా పొగమంచు కాలంలో పని చేసే స్థావర లేదా స్థిర సిబ్బంది అందరినీ (లోకో పైలెట్లు/ అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డులు) ను మంచు సమయంలో రైలు కోసం వినియోగించుకోవాలి.
పొగమంచు కాలంలో లోకో పైలెట్లు అన్ని జాగ్రత్తలను పాటించాలి. పొగమంచు కాలంలో, మంచు కారణంగా దృగ్గోచరత పరిమితంగా ఉన్న సమయంలో లోకోపైలెట్ భావించినప్పుడు, ఏదైనా అవరోధం వచ్చే ముందే రైలును నిలిపివేసేలా రైలును నియంత్రించగలిగే వేగంలో రైలును నడపాలి. ఈ వేగం ఎట్టి పరిస్థితుల్లోనూ గంటకు 75 కిమీలను మించకూడదు.
లెవెల్ క్రాసింగుల వద్ద వస్తున్న రైలు గురించి గేట్‌మెన్‌కు, రహదారిని వినియోగించే ప్రజలను హెచ్చరించేందుకు లోకో పైలెట్లు తరచుగా కూతలు వేస్తుండాలి.
***
(Release ID: 1881284)