నీతి ఆయోగ్

స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ వారోత్సవాల్లో భాగంగా 'విద్యార్థుల సృజనను వెలికితీయడానికి' విద్యార్థులను ప్రోత్సహిస్తున్న షీ స్టెమ్ 2022

Posted On: 05 DEC 2022 4:33PM by PIB Hyderabad

స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ వీక్‌లో భాగంగా, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం,సుస్థిరత రంగాలలో మహిళలు జరుపుకునే వార్షిక కార్యక్రమం షీ స్టెమ్, వరుసగా మూడవ సంవత్సరం విజయవంతంగా నిర్వహించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం, జర్మన్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (డిడబ్ల్యూఐహెచ్ న్యూఢిల్లీ) భాగస్వామ్యంతో భారతదేశంలోని స్వీడన్ రాయబార కార్యాలయం ఈ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
భారతదేశంలో స్వీడన్ రాయబారి  జాన్ థెస్లెఫ్ వీడియో సందేశం ద్వారా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. “షీ స్టెమ్ సంప్రదాయాన్ని కొనసాగించడం చాలా సంతోషకరమని అన్నారు. ఇది స్వీడన్-ఇండియా నోబెల్ స్మారక వారపు ప్రధాన కార్యక్రమంగా జరుగుతోందని తెలిపారు. 

 

నీతి ఆయోగ్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ మాట్లాడుతూ, నేడు, స్టెమ్ లో మహిళల ప్రమేయంతో ముఖ చిత్రమే మారుతోందని అన్నారు.  దీనిలో పాల్గొనే మహిళల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఏటిఎల్ మారథాన్ 2021లో మహిళల భాగస్వామ్యం 49% పెరిగిందని అన్నారు. 

షీ స్టెమ్ 2022 న్యూ ఢిల్లీలోని దర్బారీ లాల్ డిఏవి మోడల్ స్కూల్‌లోని విద్యార్థుల సంగీత ప్రదర్శనతో ప్రారంభమైంది, షీ స్టెమ్ 2022కి ఈ పాఠశాల ఆతిధ్యమిస్తోంది. ఆ తర్వాత ,స్టెమ్ వ్యాపార రంగాల్లోని మహిళలతో చర్చలు జరిగాయి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ - సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్-సిఎఫ్టిఆర్ఐ), సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా. శ్రీదేవి అన్నపూర్ణ సింగ్,  ఈ చర్చల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్రీదేవి పోషకాహార లోపం ఉన్న పిల్లలకు సప్లిమెంటరీ ఫుడ్స్ అభివృద్ధి చేయడంలో, పిల్లలపై ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం ప్రభావాన్ని అధ్యయనం చేయడంలో విస్తృతమైన కృషి చేశారు. స్థిరమైన భవిష్యత్తు కోసం సమస్య పరిష్కారానికి స్టెమ్ రంగాలలో మహిళలు తమ ప్రత్యేక దృక్పథాలను తీసుకురావాల్సిన అవసరం గురించి ఆమె చెప్పారు. 

ఈ సదస్సులో భారత్ లో స్వీడన్‌కు చెందిన ఇన్వెస్ట్ కమీషనర్ సిసిలియా ఆస్కార్సన్, ఎడ్-టేక్ కంపెనీ ప్రెప్ బైట్స్ సీఈఓ మమతా కుమారి, న్యూరోబయాలజిస్ట్ డాక్టర్ వసుధారాణి దేవనాథన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ లో బయాలజీ ప్రొఫెసర్ రూపాలీ మెహ్రా, కంటెంట్ పీపుల్ ఏబి  వ్యవస్థాపకులు పాల్గొన్నారు. 

న్యూ ఢిల్లీలోని స్వీడన్ రాయబార కార్యాలయం సైన్స్ & ఇన్నోవేషన్ హెడ్ డాక్టర్ పెర్-ఆర్నే విక్స్‌ట్రోమ్ మాట్లాడుతూ, మహిళలు, బాలికలు తమ ప్రతిభను, వారి జ్ఞానం, వారి సామర్థ్యాలను సైన్స్ అండ్ టెక్నాలజీకి పురుషులు, అబ్బాయిలతో సమానంగా అందించినప్పుడు, సమాజాలు అభివృద్ధి చెందుతాయని, ఆవిష్కరణ సామర్థ్యం వాస్తవానికి పెరుగుతుందని అన్నారు. 

 

***



(Release ID: 1881182) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi , Tamil