అంతరిక్ష విభాగం
2022 డిసెంబర్ 5న జరిగే "అబుదాబి స్పేస్ డిబేట్"లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కు భారత అధికార ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వం
Posted On:
04 DEC 2022 4:05PM by PIB Hyderabad
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తో కలిసి డాక్టర్ జితేంద్ర సింగ్ అబుదాబి అంతరిక్ష చర్చ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.
'అంతరిక్ష దౌత్యం - అంతర్జాతీయ సహకారాన్ని ప్రారంభించడంలో విదేశాంగ విధానం పాత్ర' అనే అంశంపై జరిగే మినిస్టీరియల్ ప్లీనరీకి డాక్టర్ జితేంద్ర సింగ్ హాజరు
ద్వైపాక్షిక అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై యుఎఇ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మంత్రి , యుఎఇ అంతరిక్ష సంస్థ చైర్ పర్సన్ సారా అల్ అమిరితో ప్రతినిధి వర్గం స్థాయి చర్చలు జరపనున్న డాక్టర్ జితేంద్ర సింగ్
సారా అల్ అమిరితో ప్రతినిధి వర్గం స్థాయి చర్చల సందర్భంగా అధునాతన , అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాలలో భారత్- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉమ్మడి స్టార్ట్-అప్ వెంచర్ల గురించి ప్రస్తావించనున్న డాక్టర్ జితేంద్ర సింగ్
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) పీఎంఓ పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ను సందర్శించే భారత అధికారిక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు.
అబుదాబి లో సోమవారం ప్రారంభమయ్యే రెండు రోజుల "అబుదాబి స్పేస్ డిబేట్" కు డాక్టర్ జితేంద్ర సింగ్ నేతృత్వం లోని భారత ప్రతినిధివర్గం
హాజరవుతుంది.
రెండు రోజుల అంతర్జాతీయ సమావేశం "అబుదాబి స్పేస్ డిబేట్" లో పాల్గొనేందుకు యుఎఇకి బయలుదేరే ముందు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తో కలిసి భారతదేశం తరఫున డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.
యుఎఇ విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి, ఇజ్రాయిల్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల మంత్రితో కలిసి 'అంతరిక్ష దౌత్యం , అంతర్జాతీయ సహకారాన్ని ప్రారంభించడంలో విదేశీ విధానం పాత్ర' అనే అంశంపై జరిగే మంత్రుల ప్లీనరీకి డాక్టర్ జితేంద్ర సింగ్ హాజరవుతారు.
ద్వైపాక్షిక అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై యుఎఇ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మంత్రి ,యుఎఇ స్పేస్ ఏజెన్సీ చైర్పర్సన్ సారా అల్ అమిరితో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతినిధి స్థాయి చర్చలు జరపనున్నారు.
అబుదాబికి బయలుదేరే ముందు డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, అరేబియా ద్వీపకల్పంలో భారతదేశం , యుఎఇ సంయుక్త అంతరిక్ష సహకారం ఒక పెద్ద ముందడుగు వేసే అంచున ఉందని, ఇరు దేశాలు ద్వైపాక్షిక అంతరిక్ష సహకారానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని
అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), యూఏఈ స్పేస్ ఏజెన్సీ (యుఎఇఎస్ఎ) 2016 లో అంతరిక్ష అన్వేషణ ,శాంతియుత ప్రయోజనాల కోసం బాహ్య అంతరిక్షాన్ని ఉపయోగించడంలో సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన చెప్పారు.
పర్యావరణ సమాచారాన్ని సేకరించడానికి ఉద్దేశించిన యుఎఇ మొదటి నానో శాటిలైట్ - 'నయీఫ్ -1' ను పిఎస్ఎల్వి ద్వారా శ్రీహరికోట నుండి ప్రయోగించినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
యుఎఇ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష శక్తి అని, దాని అంతరిక్ష ప్రయాణంలో గత 25 సంవత్సరాలలో వేగంగా పురోగతి సాధించిందని అన్నారు. జూలై 2020 లో, యుఎఇ తన మార్స్ మిషన్ హోప్ ప్రోబ్ ను ప్రారంభించింది, ఇది ఫిబ్రవరి 2021 లో అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి అరబ్ దేశంగా, ప్రపంచంలో ఆరో దేశంగా యూఏఈ నిలిచింది. త్వరలో రషీద్ రోవర్ లేదా ఎమిరేట్స్ లూనార్ మిషన్ ను ప్రారంభించాలని యుఎఇ యోచిస్తోంది. సెప్టెంబర్ 2019 లో, హంజాలా అల్ మన్సూరి కజకిస్తాన్ నుండి రష్యన్ అంతరిక్ష వాహనం ద్వారా ఎనిమిది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కు వెళ్ళినప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి ఎమిరాటీ అయ్యాడు. ఈ ఏడాది మరో యూఏఈ వ్యోమగామిని నాసా క్రూ రొటేషన్ ఫ్లైట్ స్పేస్ఎక్స్ క్రూ-6లో ఆరు నెలల పాటు ఐఎస్ఎస్కు తరలించేందుకు ఎంపిక చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అంతరిక్ష సంస్కరణలు అనేక కొత్త మార్గాలను తెరుస్తున్నాయని, గత నెలలోనే భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించడం ద్వారా భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో కొత్త ప్రారంభాన్ని పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సంస్కరణలు
అంకుర సంస్థల సృజనాత్మక
సామర్ధ్యాలను కూడా వెలికితీశాయని, అతి తక్కువ కాల వ్యవధి లోనే రెండు స్పేస్ స్టార్ట్ అప్ ల నుండి, స్పేస్ శిధిలాల నిర్వహ ణ , నానో శాటిలైట్ , లాంచ్ వెహికిల్ , గ్రౌండ్ వ్యవస్థలు, పరిశోధనల వంటి అత్యాధునిక రంగాలలో
పనిచేస్తున్న 105 స్టార్టప్ లు ఉన్నాయని ఆయన అన్నారు.
2021 అక్టోబర్ 11 న అంతరిక్ష, ఉపగ్రహ సంస్థల ప్రధాన పరిశ్రమల సంఘం ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐ ఎస్ పి ఎ ) ను ప్రారంభించిన సందర్భంగా, ప్రధాన మంత్రి "అంతరిక్ష సంస్కరణలకు మా విధానం నాలుగు మూలస్తంభాలపై ఆధారపడి ఉంది - ఆవిష్కరణలలో ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ, సహాయకుడిగా ప్రభుత్వ పాత్ర, యువతను భవిష్యత్తుకు సిద్ధం చేయడం, అంతరిక్ష రంగాన్ని సామాన్యుడి పురోగతికి వనరుగా చూడటం" అని చెప్పిన విషయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు.
యుఎఇ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మంత్రి యుఎఇ స్పేస్ ఏజెన్సీ చైర్ పర్సన్ సారా అల్ అమిరితో ప్రతినిధి స్థాయి చర్చల సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్- అధునాతన ,అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాలలో భారతదేశం - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉమ్మడి స్టార్ట్-అప్ వెంచర్ల గురించి మాట్లాడే అవకాశం ఉంది. అంతరిక్ష రంగంలో ఇరు దేశాలకు ఉన్న అపార మైన సామర్థ్యాల దృష్ట్యా ఈ రంగంలో
సహకారం , ద్వైపాక్షిక సంబంధాల
బలోపేతానికి ఒక కొత్త కోణం అవుతుంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ల నాయకత్వంలో శతాబ్ధాల నాటి ద్వైపాక్షిక సంబంధాలు 2017లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎదిగినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 72 బిలియన్ డాలర్ల నుండి వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని భావిస్తున్నాయి.
*****
(Release ID: 1880868)
Visitor Counter : 212