వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐపీ దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారానికి ప్రతిరోజూ బహిరంగ సదస్సు నిర్వహిస్తున్న ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ (CGPDTM)

Posted On: 02 DEC 2022 3:30PM by PIB Hyderabad

దేశంలో మేధో సంపత్తి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్న లక్ష్యంతో  2022 అక్టోబర్ 17వ తేదీ నుంచి  ఐపీ దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారానికి ప్రతిరోజూ ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ (CGPDTM)బహిరంగ సదస్సు  నిర్వహిస్తోంది. 

 https://ipindia.gov.in/newsdetail.htm?835/ ద్వారా సదస్సులో పాల్గోవచ్చు. 

 ఐపీ కార్యాలయాన్ని సందర్శించకుండా సమస్యకు పరిష్కారం పొందే అవకాశం అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో బహిరంగ సదస్సు విధానానికి  ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ శ్రీకారం చుట్టింది. సంబంధిత వర్గాల సమస్యలు, అనుమానాలను ఐపీవో అధికారులు వర్చువల్ విధానంలో పరిష్కరిస్తారు. దేనివల్ల ఐపీ దరఖాస్తుల పరిష్కారం వేగంగా జరుగుతుంది. 

2022 అక్టోబర్  17 నుంచి అన్ని పని దినాలలో ఉదయం 10.30 నుంచి 11.30 వరకు బహిరంగ సదస్సు నిర్వహించబడుతోంది.  సదస్సు ప్రారంభ కార్యక్రమంలో   దేశం వివిధ ప్రాంతాలకు చెందిన  104 మంది వాటాదారులు పాల్గొన్నారు.   పేటెంట్‌లు, డిజైన్‌లు, ట్రేడ్‌మార్క్‌లు మరియు కాపీరైట్‌ల రంగాలలో  తలెత్తుతున్న సమస్యలను, సమస్యల పరిష్కరించడానికి గల మార్గాలను సదస్సులో దరఖాస్తుదారులు ప్రస్తావిస్తున్నారు.  తమ  దృష్టికి తీసుకు వచ్చిన  సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సదస్సులో సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పలువురు హాజరవుతున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి  తగిన చర్యలు తీసుకోవడంలో కార్యాలయంలో జరుగుతున్న  విపరీతమైన జాప్యానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావిస్తున్నారు. సమస్యను  లేవనెత్తిన తేదీ నుంచి నిర్దిష్ట  కాలపరిమితితో పరిష్కరించబడతాయి. 

బహిరంగ సదస్సు నిర్వహించిన వాటాదారులు అందించిన సమాచారం, వివరాల  ఆధారంగా, భారత  ఐపీ  ఆఫీస్ ట్రేడ్ మార్క్స్ షో కాజ్ హియరింగ్‌ల కోసం “డైనమిక్ కాజ్ లిస్ట్” వ్యవస్థను 1 డిసెంబర్ 2022 నుంచి అమల్లోకి తెచ్చింది, దీనిలో ఆన్‌లైన్ లో సమస్యలను వివరించడానికి  వెబ్‌సైట్ లో ఒక  లింక్ కూడా అందుబాటులో ఉంటుంది. 

***(Release ID: 1880592) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi , Tamil