సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గల నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం (కర్తవ్యపథ్) సమీపంలోని స్వామీ వివేకానంద రోడ్డులో 02 నుంచి 07 వరకు దివ్య కళా మేళా
తమ ఉత్పత్తులను, నైపుణ్యాలను ప్రదర్శించనున్న దాదాపు 22 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది దివ్యాంగ కళాకారులు/ హస్తకళాకారులు, వ్యవస్థాపకులు
ఈ కార్యక్రమాన్ని 02 డిసెంబర్ 2022న సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభించనున్న కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్
Posted On:
01 DEC 2022 2:17PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గల నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం (కర్తవ్యపథ్) సమీపంలోని స్వామీ వివేకానంద రోడ్డులో 02 నుంచి 07 డిసెంబర్, 2022 వరకు దేశం నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగ వ్యవస్థాపకులు/ హస్తకళాకారుల ఉత్పత్తులను, నైపుణ్యాలను ప్రదర్శించే విశిష్ట కార్యక్రమం దివ్య కళా మేళాను విభాగం నిర్వహిస్తోంది.
జమ్మూ, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హస్తకళలు, చేనేత, ఎంబ్రాయిడరీ, ప్యాకేజ్డ్ ఆహారం తదిరాల ఒక చోట చూడడం అన్నది వచ్చినవారికి మనోహరమైన అనుభవాన్ని ఈ ప్రదర్శన అందించనుంది.
దాదాపు 22 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 200మంది దివ్యాంగ హస్తకాళాకారులు/ కళాకారులు, వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులను, నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. దిగువన పేర్కొన్న వర్గాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి - ఇంటి అలంకరణ & జీవనశైలి, వస్త్రాలు, స్టేషనరీ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, ప్యాకేజ్ ఆహారం, ఆర్గానిక్ ఉత్పత్తులు, బొమ్మలు & కానుకలు, వ్యక్తిగత ఉపకరణాలైన నగలు, క్లచ్ బ్యాగ్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇది అందరూ, స్థానికం కోసం గళమెత్తేందుకే కాక దివ్యాంగ హస్తకళాకరులు చేసిన ఉత్పత్తులను మరింత పట్టుదలతో చూసేందుకు/ కొనుగోలు చేసేందుకు మంచి అవకాశం.
ఆరురోజుల పాటు సాగే దివ్యకళా మేళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు తెరిచే ఉండడమే కాక, దివ్యాంగ కళాకారులు, ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించవచ్చు. సందర్శకులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తమకు ఇష్టమైన ఆహారాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఆస్వాదించవచ్చు.
ఈ కార్యక్రమాన్ని 02 డిసెంబర్ 2022న, అనగా రేపు సాయంత్రం 4.00 గంటలకు కేంద్ర సామాజిక న్యాయం& సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రులు శ్రీ రామదాస్ అథావలే, ప్రతిమా భౌమిక్ కూడా హాజరుకానున్నారు.
ఈ భావనను ప్రోత్సహించేందుకు విభాగం భారీ ప్రణాళికలను కలిగి ఉంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం దివ్య కళా మేళాను నిర్వహించడమే కాక దీనిని ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా చేపట్టనున్నారు.
***
(Release ID: 1880447)
Visitor Counter : 214