భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

డి అండ్ బి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2022 లో టెక్ ఇనిషియేటివ్ అవార్డును గెల్చుకున్న మంథన్ ప్లాట్‌ఫాం

Posted On: 30 NOV 2022 12:01PM by PIB Hyderabad

డి అండ్ బి  బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2022 లో  మంథన్ ప్లాట్‌ఫాం టెక్ ఇనిషియేటివ్ అవార్డును గెల్చుకుంది. ముంబై లో 2022 నవంబర్ 29న జరిగిన కార్యక్రమంలో  మంథన్ ప్లాట్‌ఫాం కు టెక్ ఇనిషియేటివ్ అవార్డును అందజేశారు. పరిశ్రమ మరియు శాస్త్రీయ పరిశోధన మరియు అభివృద్ధి పర్యావరణ వ్యవస్థ మధ్య స్థాయిలో సహకారాన్ని ప్రోత్సహించే వేదిక అయిన మంథన్‌కు మద్దతుగా సాంకేతిక మౌలిక సదుపాయాలను రూపొందించినందుకు ఈ అవార్డును అందించారు.పరిశ్రమ, శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధి వ్యవస్థ మధ్య సమన్వయం సాదించేందుకు దోహదపడే  సాంకేతిక పరిజ్ఞాన వేదికను  మంథన్ అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కార్యాలయం అందజేసింది. ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వ  ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (PSA) కార్యాలయం  వ్యూహాత్మక అలయన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సప్నా పోటి , NSEIT. ఎండీ సీఈవో శ్రీ. అనంతరామన్ శ్రీనివాసన్ స్వీకరించారు. 

పరిశ్రమ, పరిశోధన, అభివృద్ధి మధ్య సమన్వయం సాధించే లక్ష్యంతో మంథన్ పనిచేస్తోంది. 76 వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మంథన్ ను ప్రారంభించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGలు) మరియు జాతీయ శాస్త్రీయ మిషన్‌ల మధ్య సహకారం సాధించి సమస్యల పరిష్కారానికి అవసరమైన  బహుళ వాటాదారులకు సాధికారత కల్పించడానికి మంథన్ ఏర్పాటయింది. 

కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కె సూద్ మంథన్ వేదికను ప్రారంభించారు. 'శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల మధ్య భాగస్వామ్యాలు అభివృద్ధి చేయడానికి వేదిక కృషి చేస్తుంది' అని సూద్ పేర్కొన్నారు. 'జీడీపీ పరంగా పరిశ్రమల భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఊపునిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా విద్యాసంస్థలు మరియు పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి.   సమస్యలు లేదా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి రెండు వైపులా కలిసి వచ్చినప్పుడు వేదిక  ద్వారా ఆశించిన ఫలితాలు లభిస్తాయి ” అని సూద్ పేర్కొన్నారు. 

మంథన్ ఏర్పాటుకు కృషి చేసిన బృందాన్ని పీఎస్ఏ శాస్త్రీయ కార్యదర్శి డాక్టర్ పర్వీందర్ మైని అభినందించారు. “ ప్రభుత్వ-ప్రైవేటు-విద్యా సహకారంతో సుస్థిరత లక్ష్యాలను సాధించడానికి వీలు కల్పించే ఒక విశిష్ట వేదికగా మంథన్ పనిచేస్తుంది.లక్ష్య సాధనలో  మంథన్  పరివర్తనాత్మక పాత్ర పోషిస్తుంది.  ఇది వినూత్న ఆలోచనలు  సజావుగా అమలు అయ్యేలా చూసి భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడానికి సహకరిస్తుంది.  ఈ గుర్తింపు డిజిటల్ ఇండియా  విశాల దృక్పథాన్ని గుర్తు చేస్తుంది మరియు మంథన్ విజయం కోసం వివిధ బృందాలు అందించిన  సహకారాన్ని గుర్తు చేస్తుంది.” అని డాక్టర్ పర్వీందర్ మైని అన్నారు.

  పీఎస్ఏ వ్యూహాత్మక అలయన్స్ డివిజన్ డైరెక్టర్ డాక్టర్ సప్నా పోటి మాట్లాడుతూ “ దేశం గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో పటిష్టమైన  శాస్త్ర, సాంకేతిక, వినూత్న ఆవిష్కరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒక వేదిక అవసరం.  భారతదేశంలో పరిశోధన మరియు ఆవిష్కరణల వేదికగా  పనిచేసే మంథన్   పరిశ్రమలు తమ ప్రాజెక్టు మరియు ఆవిష్కరణ భాగస్వాములను CSR మరియు పరిశ్రమ పరిశోధన అభివృద్ధి రంగాల కలిసి పనిచేసే అవకాశం కల్పించి ఆలోచనల మార్పిడిని సులభతరం చేస్తుంది, ప్రజల సహకారాన్ని  మెరుగుపరచడం మరియు శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధికి సహకరించే  వ్యవస్థను దేశంలో మంథన్‌ అభివృద్ధి.చేస్తుంది' అని వివరించిన  డాక్టర్ సప్నా పోటి బృందం సభ్యులను అభినందించారు. 

“ దూరదృష్టితో ఏర్పాటైన మంథన్ ప్లాట్‌ఫారమ్  డిజిటల్ ఇండియా కళను సాకారం చేస్తుంది.  స్వదేశంలో వినూత్నంగా  రూపొందిన మంథన్ డిజిటల్ ఇండియా ను సాకారం చేస్తుంది. మంథన్ ప్లాట్‌ఫారమ్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ఈ అవార్డు జట్టు కృషి మరియు శ్రేష్ఠత కోసం కఠినమైన అన్వేషణ ఫలితం ”అని  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎండీ సీఈవో  శ్రీ ఆశిష్‌కుమార్ చౌహాన్ అన్నారు. 

అవార్డు అందుకున్న NSEIT  ఎండీ సీఈవో  నంతరామన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ “ వినియోగదారులకు  అధిక-ప్రభావ మరియు సంక్లిష్టమైన ప్రాజెక్ట్‌లను అందించడంలో NSEIT  నిబద్ధతకు ఈ అవార్డు ఒక నిదర్శనం. ఇన్నోవేషన్ ఎక్సలెన్స్‌ను అందించడంలో మరియు బలమైన వ్యాపార ఫలితాలను అందించడంలో NSEIT చేస్తున్న  ప్రయత్నాలను గుర్తించినందుకు నేను జ్యూరీ సభ్యులకు మరియు డన్  బ్రాడ్‌స్ట్రీట్‌లోని  బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామి అనే గౌరవాన్ని మాకు అప్పగించినందుకు భారత ప్రభుత్వానికి  PSA కార్యాలయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్‌ను ఫలవంతం చేసినందుకు మంథన్ విజయవంతంగా ప్రారంభించడం వెనుక ఉన్న బృందాలు చేసిన కృషి వల్ల అవార్డు లభించింది' అన్నారు. 

 

డన్  బ్రాడ్‌స్ట్రీట్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2022:
 

డన్  బ్రాడ్‌స్ట్రీట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల కోసం B2B డేటా, అంతర్దృష్టులు మరియు AI-ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ల వేదిక.  1841 నుంచి  చెందిన కంపెనీలు ప్రమాదాన్ని నిర్వహించడంలో మరియు అవకాశాలను బహిర్గతం చేయడంలో వారికి సహాయపడటానికి డన్  బ్రాడ్‌స్ట్రీట్‌పై ఆధార పడుతున్నాయి. డన్ అండ్  బ్రాడ్‌స్ట్రీట్ SME మరియు మిడ్-కార్పొరేట్ 'బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2022' అనేది SMEలు మరియు మిడ్-కార్పొరేట్‌ల విజయాలు మరియు పనితీరును గుర్తించి అందజేయడం జరుగుతోంది. . ఈ అవార్డు ఎక్కువగా వ్యాపార పనితీరు ప్రమాణాల  ఆధారంగా 23 విభాగాల్లో ప్రధానం చేయడం జరుగుతోంది. . బ్యాంకింగ్ మరియు ఇంధన అభివృద్ధి రంగాలకు చెందిన నిపుణులతో కూడిన విశిష్ట జ్యూరీ ప్యానెల్ అవార్డు ప్రతిపాదనలను సమీక్షించింది.
NSEIT గురించి:

NSEIT లిమిటెడ్ అనేది  సంక్లిష్ట  డిజిటల్ వ్యవస్థలో  ప్రధానంగా బ్యాంకింగ్, బీమా మరియు క్యాపిటల్ మార్కెట్ పర్యావరణ వ్యవస్థలో అత్యుత్తమ ఫలితాలు  అందించడంపై దృష్టి సారించిన ఒక గ్లోబల్ టెక్నాలజీ సంస్థ.   నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా 100% అనుబంధ సంస్థగా NSEIT లిమిటెడ్ పనిచేస్తోంది. అప్లికేషన్ మోడరనైజేషన్, బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్, డేటా అనలిటిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & క్లౌడ్ సర్వీసెస్, సైబర్‌సెక్యూరిటీ, ఎడ్‌టెక్ మరియు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ సొల్యూషన్స్ రంగాలలో NSEIT లిమిటెడ్ సేవలు అందిస్తోంది. 

మరింత సమాచారం కోసం t www.nseit.com.ని సందర్శించండి .



(Release ID: 1880166) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Marathi , Hindi