నీతి ఆయోగ్
'కార్బన్ క్యాప్చర్' పై అధ్యయన నివేదికను విడుదల చేసిన - నీతి ఆయోగ్
Posted On:
29 NOV 2022 8:59PM by PIB Hyderabad
వినియోగం, మరియు నిల్వ (సి.సి.యు.ఎస్) విధాన వ్యవస్థ, భారతదేశంలో దాని విస్తరణ విధానం - భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి, పెరుగుదలను నిర్ధారించడానికి, ముఖ్యంగా స్వచ్ఛమైన ఉత్పత్తులు, విద్యుత్ ఉత్పత్తికి, ఇది ఆత్మనిర్భర్ భారత్ కు దారితీస్తుంది.
‘కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్, అండ్ స్టోరేజ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్స్ డిప్లాయ్మెంట్ మెకానిజం ఇన్ ఇండియా’ పేరుతో ఒక అధ్యయన నివేదిక ఈరోజు విడుదలైంది. తగ్గించడం చాలా కష్టమైన రంగాల నుండి లోతైన డీకార్బనైజేషన్ ను సాధించడానికి ఉద్గార తగ్గింపు వ్యూహంగా కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ మరియు స్టోరేజ్ యొక్క ప్రాముఖ్యతను నివేదిక అన్వేషిస్తుంది. ఈ నివేదిక, దాని అమలు కోసం వివిధ రంగాలలో అవసరమైన విస్తృత స్థాయి విధాన జోక్యాలను వివరిస్తుంది.
భారతదేశం తన మొత్తం స్థాపిత సామర్థ్యంలో 50 శాతం శిలాజ-ఆధారిత శక్తి వనరుల నుండి సాధించడానికి ఎన్.డి.సి. లక్ష్యాలను నవీకరించింది. 2030 నాటికి ఉద్గార తీవ్రతలో 45 సహాయం తగ్గింపు మరియు 2070 నాటికి దాన్ని పూర్తిగా సున్నా స్థాయికి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. తగ్గించడం చాలా కష్టతరమైన రంగాల నుంచి, డీకార్బనైజేషన్ సాధించడానికి ఒక తగ్గింపు వ్యూహంగా, కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ మరియు స్టోరేజ్ (సి.సి.యు.ఎస్) పాత్ర చాలా ముఖ్యమైనది.
బొగ్గు యొక్క గొప్ప గుణాన్ని ఉపయోగించుకుంటూ, దిగుమతులను తగ్గించి, తద్వారా ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తూనే స్వచ్ఛమైన ఉత్పత్తుల ఉత్పత్తిని సి.సి.యు.ఎస్. ప్రారంభించగలదు." అని, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెర్రీ పేర్కొన్నారు. తగ్గించడం చాలా కష్టతరమైన రంగాన్ని డీ-కార్బన్ చేయడానికి, సి.సి.యు.ఎస్. సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ఖచ్చితంగా ఒక ముఖ్యమైన చర్య అవుతుంది.
సి.సి.యు.ఎస్. ప్రాజెక్టులు గణనీయమైన ఉపాధి కల్పనకు కూడా దోహదపడతాయి. 2050 నాటికి దాదాపు 750 ఎం.పి.టి.ఏ. కార్బన్ క్యాప్చర్ పూర్తి సమయం సమానమైన (ఎఫ్.టి.ఈ) ప్రాతిపదికన దశలవారీగా సుమారు 8 నుంచి 10 మిలియన్ల ఉపాధి అవకాశాలను సృష్టించగలదని అంచనా వేయడం జరిగింది.
"శిలాజ ఆధారిత ఇంధన వనరులపై భారతదేశం ఆధారపడటం భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉంది, కాబట్టి భారతీయ పరిస్థితులకు సి.సి.యు.ఎస్. విధానం అవసరం." అని, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ అభిప్రాయపడ్డారు.
సంగ్రహించిన సి.ఓ.2 ని గ్రీన్ యూరియా, ఆహార, పానీయాల ఫారమ్ అప్లికేషన్; నిర్మాణ వస్తువులు (కాంక్రీట్, కంకర); రసాయనాలు (మిథనాల్, ఇథనాల్); పాలిమర్‌లు (బయో-ప్లాస్టిక్‌లతో సహా); భారతదేశంలో విస్తృత మార్కెట్ అవకాశాలతో మెరుగైన చమురు రికవరీ (ఈ.ఓ.ఆర్), వంటి విభిన్న విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్చడానికి, సి.సి.యు.ఎస్. అనేక రకాల అవకాశాలను అందించగలదని నివేదిక సూచిస్తోంది. ఆ విధంగా ఇది వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడనుంది.
అంతర్జాలం ద్వారా ప్రత్యక్ష ప్రసారం:
https://www.youtube.com/watch?v=biwDpAqvTFA
రిపోర్ట్ లింక్:
https://www.niti.gov.in/sites/default/files/2022-11/CCUS-Report.pdf
*****
(Release ID: 1879924)
Visitor Counter : 267