సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫీ 53లో “సినిమా ఆఫ్ ద వరల్డ్” విభాగంలో ప్రదర్శించిన చెక్ చిత్రం “ఆర్డినరీ ఫెయిల్యూర్స్”
మీపై మీకు విశ్వాసం ఉన్నట్టయితే మీరెన్నటికీ విఫలం కారు : డైరెక్టర్ క్రిస్టినా గ్రోసన్
“ఆర్డినరీ ఫెయిల్యూర్స్ (Czech title: Běžná selhání) చిత్రం నిర్మించాలనే ఆలోచన కోవిడ్ 19 మహమ్మారి కాలంలోనే వచ్చింది. ఆ మహమ్మారి ప్రజల సాధారణ జీవితాలను విచ్ఛిన్నం చేసింది. వాస్తవం, మా స్క్రిప్ట్ పక్కపక్కనే ఉన్నట్టు కనిపిస్తాయి” అని చిత్ర దర్శకురాలు క్రిస్టినా గ్రోసన్ అన్నారు. చలనచిత్రోత్సవం సందర్భంగా పిఐబి నిర్వహించిన “టేబుల్ టాక్స్” కార్యక్రమంలో మీడియా, ఫెస్టివల్ ప్రతినిధులతో ఆమె గోవాలో 2022 నవంబర్ 25వ తేదీన సంభాషించారు. ఇఫీ 53లో “ప్రపంచ సినిమా” విభాగంలో ఈ చిత్రం ప్రదర్శించారు.
వినూత్నమైన, ప్రకృతిసిద్ధమైన విపత్తు తమ జీవితాల్లో ఎదురైనప్పుడు ముగ్గురు మహిళలు ఆ పరిస్థితులను వారు ఎలా ఎదుర్కొన్నారు, భవిష్యత్తులోకి ఎలా చూడగలిగారు అనేది ఆర్డినరీ ఫెయిల్యూర్స్ వివరిస్తుందని క్రిస్టినా గ్రోసన్ చెప్పారు.
ఆర్డినరీ ఫెయిల్యూర్స్ ను తాను ఒక కళాఖండంగా వర్గీకరిస్తానని, చెక్ రిపబ్లిక్ లోను, యూరప్ లోను ప్రస్తుత చలనచిత్ర మార్కెట్, ప్రజల వైఖరి ఇలాంటి చిత్రాలకు మద్దతు ఇచ్చేదిగా ఉన్నదని చిత్ర నిర్మాత మారెక్ నోవక్ చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా చెక్ రిపబ్లిక్, హంగెరీ, ఇటలీ, స్లోవాకియా ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
చలనచిత్రాల్లో లింగవివక్ష, ఒటిటి విభాగంలో మహిళలు దర్శకత్వం వహించే చిత్రాల పట్ల ఏర్పడుతున్న నిర్లిప్తత గురించి ప్రశ్నించగా పరిస్థితి నింపాదిగా మెరుగుపడుతున్నదని, మహిళలకు క్రమంగా మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయని క్రిస్టినా తెలిపారు. తన వృత్తి జీవితం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చలనచిత్ర రంగంలోకి ప్రవేశించాలని మరింత మంది మహిళలను ఆమె ఆహ్వానించారు.
ఈ చిత్రం మహిళలే లక్ష్యంగా రూపొందించినదా అన్న ప్రశ్నకు క్రిస్టినా గ్రోసన్ సమాధానం చెబుతూ సమాజంలోని ఒక వర్గం కన్నా మొత్తం జనాభాను ఉద్దేశించి ఈ చిత్రం నిర్మించినట్టు తెలిపారు. చెక్ రిపబ్లిక్ లో అధిక శాతం మంది చలనచిత్ర ప్రేక్షకులు, సాంస్కృతిక అభిలాషులు మహిళలేనని నిర్మాత నోవాక్ అన్నారు.
ఇటు యువత, అటు వృద్ధులు కూడా ఆర్డినరీ ఫెయిల్యూర్స్ చిత్రాన్ని ఆదరించడం క్రిస్టినా గ్రోసన్ కు చాలా ఆనందంగా ఉంది. ఇఫీ 53లో ఈ చిత్రం చూసిన వయోవృద్ధులైన ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడం కూడా ఆమెకు ఆనందకరమైన ఆశ్చర్యం కలిగించింది.
సమయం గడిచిపోతున్నదనుకుంటున్న తీరులో ఆర్డినరీ ఫెయిల్యూర్స్ చిత్రం అత్యంత సమీప భవిష్యత్తును స్పష్టంగా వీక్షించడంతో పాటు ముగ్గురు కథానాయికలు పరస్పరం అనుసంధానం అయ్యేలా చేసింది. ఒక దానికి ఒకటి సమాంతరంగా ఈ చిత్రంలోమూడు కథలు నడుస్తాయి. ముగ్గురూ కొత్త కొత్త అవకాశాలు అన్వేషించుకుంటూ ఈ పరిస్థితుల్లో తాము ఎలా వ్యవహరించాలి, ప్రపంచం అంతా వేరుపడిన సమయంలో కొత్త అడుగు ఎలా వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.
చిత్రం వివరాలు...
డైరెక్టర్ : క్రిస్టినా గ్రోసన్
నిర్మాత : మారెక్ నోవాక్
స్క్రీన్ ప్లే : క్లారా వ్లాసకోవా
సినిమాటోగ్రాఫర్ : మార్క్ గ్యోరి
ఎడిటర్ : అన్నా మెల్లర్
నటీనటులు : తత్జానా మెద్వెకా, బియాటా కనోకోవా, నోరా క్లిమెసోవా, విసా కెరెకెస్, ఆడమ్ బెర్కా, రిస్టిస్లోవ్ నోవక్ జూనియర్, జనా స్ర్టికోవా, లుబోస్ వెసెలీ
2022| చెక్/ హంగేరియన్/ ఇటాలియన్/ స్లోవేయికియన్ | కలర్ | 84 నిముషాలు
కథ
ఒక టీనేజర్, ఆందోళనకరమైన తల్లి, ఇటీవలే వితంతువైన ఒక మహిళ అంతుపట్టని ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకుని జీవితాలు కల్లోలితం కావడం చూశారు. ప్రపంచం కల్లోలితం అవుతున్న తరుణంలో ఆ ముగ్గురు మహిళలు జీవితంలో తమ స్థానం కోసం అన్వేషించుకుంటూ ఉంటారు.
డైరెక్టర్ : క్రిస్టినా గ్రోసన్ 1987 జూలై 26న రొమేనియాలోని అరాద్ లో జన్మించారు. ఆమె అలాంగ్ కేమ్ ఏ ప్రిన్స్ (2020), బెజ్నా సెల్హానీ (2022), హాలిడే ఎట్ సీ సైడ్ (2013) చిత్రాల రచయిత, దర్శకురాలు.
***
(Release ID: 1879523)
Visitor Counter : 141