సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ-53 ప్రతినిధులకు కనువిందు చేసిన - మెక్సికో చలన చిత్రాలు


"53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో మెక్సికో సినిమాలు పాల్గొనడం మాకు గర్వకారణం" : మెక్సికో ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి మిగ్యుల్ టోరుకో మార్క్వెస్


"ప్రజల మధ్య విభేదాలు తొలగించి, దేశాల మధ్య బంధాలు పెంపొందించడానికి చలనచిత్రాలు ఉత్తమ మార్గం": మిగ్యుల్ టోరుకో మార్క్వెస్

Posted On: 27 NOV 2022 2:23PM by PIB Hyderabad

53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ), తన ప్రతినిధులందరికీ అతి మనోహరమైన మెక్సికన్ విందును సిద్ధం చేసింది.  ఈ చలన చిత్రోత్సవంలో భాగంగా మెక్సికో దేశానికి చెందిన పలు చలన చిత్రాలను వివిధ విభాగాల్లో ప్రదర్శిస్తున్నారు.  మెక్సికో ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి మిగ్యుల్ టోరుకో మార్క్వెస్ ఒక వీడియో సందేశం ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ,  “గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ ముఖ్యమైన ఘట్టాన్ని మీతో పంచుకోవడం నాకు గర్వకారణం. మెక్సికో దాని ప్రత్యేక సంస్కృతి, వైవిధ్యాలకు ప్రసిద్ధి చెందింది.  ఈ వారసత్వంలో చాలా ముఖ్యమైన భాగం మా సినిమా.  దిగ్గజాలు గా పరిగణించబడే గొప్ప సినీ దర్శకులు, నటులు మ  దేశంలో ఉన్నారు.  మా చలన చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చాయి." అని పేర్కొన్నారు.   మెక్సికో సినిమా తమ దేశంలోని సామాజిక, సాంస్కృతిక వాతావరణానికి ప్రతీకగా ఆవిర్భవించిందని ఆయన అభివర్ణించారు.  తన తల్లి మరియా ఎలెనా మార్క్వెస్, తండ్రి మిగ్యుల్ టొరుకో ఇద్దరూ, మెక్సికో సినిమా 'స్వర్ణయుగానికి' చెందిన మెక్సికో చలన చిత్ర నటులు అని కూడా, ఆయన గర్వంగా తెలియజేశారు. 

మంత్రి ఇంకా మాట్లాడుతూ, ప్రజల మధ్య విభేదాలను తొలగించడానికిదేశాల మధ్య సంబంధాలను పెంపొందించడానికి సినిమాలే ఉత్తమమైన మార్గమని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను.  మెక్సికో ప్రస్తుతం అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన సృజనాత్మకతనిర్మాణ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  ఇది సినిమా రంగంలో కొత్త శకానికి దారి తీస్తుంది.  ఇటువంటి అద్వితీయమైన ఉత్సవాల్లో మెక్సికో చలనచిత్రాలు పాల్గొనడం మాకు గర్వకారణం.   అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ మా గొప్ప మద్దతుప్రశంసలను అందించాలనుకుంటున్నాను.  మీ అందరికీ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. అని పేర్కొన్నారు. 

'ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. 'టేబుల్ టాక్' విభాగంలో - 'రెడ్ షూస్' చిత్ర నిర్మాత అలెజాండ్రో డి ఇకాజా మాట్లాడుతూ,   మెక్సికో ప్రభుత్వం చలన చిత్రాల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసిదాని ద్వారా మా చలన చిత్రం లాంటి కళాత్మక చిత్రాలతో సహా ఇతర చలన చిత్రాలను ప్రోత్సహిస్తోంది.  ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకుండా ఇలాంటి సినిమాలు నిర్మించడం కష్టంఎందుకంటే వాటిని వాణిజ్య పరంగా విజయవంతం చేయడం కష్టం." అని పేర్కొన్నారు.  ఒక వివాహం అనే అంశంపై భారతదేశం తో కలిసి సంయుక్తంగా ఒక చిత్రాన్ని నిర్మించాలని చూస్తున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.  “వాస్తవానికి మేము వివాహానికి సంబంధించిన అంశం పై సంయుక్తంగా ఒక సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నాము.  మన రెండు దేశాల్లో, వివాహాలు చాలా భారీగా, ఆకర్షణీయంగా, చాలా రోజులు గుర్తుండే విధంగా జరుగుతాయి.   రకమైన సామాజికసాంస్కృతిక సారూప్యతలు భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులకు దారి తీసే అవకాశం కూడా ఉంది." అని ఆశాభావం వ్యక్తం చేశారు.  

'రెడ్ షూస్చలన చిత్రం లోని సన్నివేశం 

2022 మెక్సికన్ చిత్రం రెడ్ షూస్ అంతర్జాతీయ పోటీ విభాగంలో 14 ఇతర చిత్రాలతో పోటీపడుతుంది, వీటిలో విజేతకు గౌరవనీయమైన గోల్డెన్ పీకాక్ ప్రదానం చేయబడుతుంది.  'రెడ్ షూస్', అనే చిత్రాన్ని కార్లోస్ ఐచెల్‌ మాన్ కైజర్ దర్శకత్వం వహించారు,   ఏకాంత జీవితాన్ని గడుపుతున్న ఒక రైతు, తన కుమార్తె మరణ వార్తను అందుకున్న పరిస్థితుల గురించి ఈ చిత్రం ద్వారా ఆయన తెలియజేశారు.  ఈ చిత్రం వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో "ప్రేక్షకాదరణ చిత్రం" అవార్డు కోసం పోటీలో ఉంది. ఈ చిత్రం గతంలో అనేక చలన చిత్రోత్సవాల్లో, పలు అవార్డులు సాధించింది. 

'ఐలాండ్ ఆఫ్ లాస్ట్ గర్ల్స్చలన చిత్రం లోని సన్నివేశం 

మెక్సికో, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్మించిన 'ఐలాండ్ ఆఫ్ లాస్ట్ గర్ల్స్అనే చలన చిత్రం, 'ఉత్తమ తొలి చిత్ర దర్శకుడుఅవార్డు కోసం పోటీ పడుతోంది.  ఆన్-మేరీ ష్మిత్, బ్రియాన్ ష్మిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సముద్రపు గుహలో చిక్కుకుని, భారీ అలలు, అతీంద్రియ జీవులతో పోరాడుతున్న ముగ్గురు సోదరీమణుల వీరోచిత గాథ.    గతంలో ఈ చలన చిత్రం మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం తో పాటు, ఫాంటాసియా చలన చిత్రోత్సవంలో కూడా ప్రదర్శించడం జరిగింది. 

ఈ ఉత్సవాలలో భాగంగా, కలైడోస్కోప్ విభాగంలో మెక్సికో, అర్జెంటీనా సంయుక్తంగా నిర్మించిన "మాంటో డి గెమాస్" (రత్నాల వస్త్రం) అనే చలన చిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది.  ఈ చలన చిత్రాన్ని గ్రామీణ మెక్సికో నేపథ్యంలో నిర్మించారు. ఇక్కడ వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు మహిళలు వ్యవస్థీకృత నేరం తో ముడిపడి ఉన్న ఒక వ్యక్తి తప్పిపోయిన కేసు విషయంలో విషాదకర పరిస్థితుల్లో కలుసుకుంటారు.   ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. 53 లో తమ ఉనికిని గుర్తించే మెక్సికన్ మూలానికి చెందిన బ్లాంక్విటాసోల్స్ జర్నీఎమిపినోచియోహుసేరా వంటి చలన చిత్రాలను కూడా ప్రదర్శించడం జరిగింది. 

 

*****



(Release ID: 1879451) Visitor Counter : 151