పార్లమెంటరీ వ్యవహారాలు
నవంబర్ 26,2022 వతేదీ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ ప్రవేశిక ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు అలాగే, రాజ్యాంగంపై క్విజ్‌కు సంబంధించిన పోర్టల్‌లను ప్రారంభించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌జోషి.
Posted On:
25 NOV 2022 4:49PM by PIB Hyderabad
సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం)ను ప్రతిసంవత్సరం నవంబర్ 26 వ తేదీన జరుపుకుంటారు. రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకునేందుకు, వారి సేవలను గుర్తిస్తూ ఈ రాజ్యాంగదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలలో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఈ జాతీయ కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ క్రియాశీల పాత్రపోషిస్తోంది. ఇది ఇప్పటికే రెండు డిజిటల్ పోర్టల్‌లను పునరుద్ధరించి, అప్‌డేట్ చేసింది. ఇందులో ఒకటి రాజ్యాంగ ప్రవేశిక. (https://readpreamble.nic.in/)దీనిని ఇంగ్లీషు, రాజ్యాంగంలోని 8వ షెడ్యూలలో పొందుపరచిన ఇతర 22 భాషలలో రూపొందించారు. మరొకటి 2022 రాజ్యాంగదినోత్సవానికి సంబంధించిన (https://constitutionquiz.nic.in/)ఆన్‌లైన్‌క్విజ్.
కర్టెన్ రైజర్‌గా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌జోషి 25.11.2022న అప్‌డేట్ చేసిన పోర్టల్‌ను ప్రారంభించారు. ఇందులో ఇంగ్లీషుతో సహా 22 అధికార భాషలలలో ప్రవేశికను (https://readpreamble.nic.in/) చదువుకోవచ్చు. మరొకటి రాజ్యాంగంపై (https://constitutionquiz.nic.in/)ఆన్‌లైన్ క్విజ్.
ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీజి.శ్రీనివాస్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సత్యప్రకాశ్, ఇతర అధికారులు, మంత్రిత్వశాఖకుచెందిన అధికారులు హాజరయ్యారు. ఈ పోర్టల్ లను ప్రారంభిస్తూ కేంద్ర మంత్రి శ్రీప్రహ్లాద్ జోషి దేశ ప్రజలందరూ ఈ తమ తమ భాషలలో ఈ రాజ్యాంగ ప్రవేశికను(https://readpreamble.nic.in/) చదువుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రజలు, వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈ పోర్టల్‌లను దర్శించవచ్చని , స్వీయ సంతకంతో సర్టిఫికెట్‌పొందవచ్చని అన్నారు.
దీనిని ఒక ప్రజాప్రచారం గా తీసుకువెళ్లేందుకు జనభాగీదారి గా చేసేందుకు, మంత్రిత్వశాఖ,మరోపోర్టల్‌ను అప్‌డేట్ చేసి రాజ్యాంగంపై ఆన్ లైన్ క్విజ్ ను తీసుకువచ్చిందని అన్నారు. ఈ ఆన్‌లైన్ క్విజ్ అత్యంత సులభమైనదని,ఇందులో రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపైన అత్యంత సులభ ప్రశ్నలు ఉన్నాయని చెప్పారు. ఇందులో ఎవరైనా పాల్గొని (https://constitutionquiz.nic.in/).సర్టిఫికేట్ పొందవచ్చని అన్నారు. ఈ క్విజ్‌ప్రధాన ఉద్దేశం, రాజ్యాంగ మౌలిక విలువలకు ప్రచారం కల్పించడమేకాని ఇందులో పాల్గొనేవారి జ్ఞానాన్ని పరీక్షించడం దీని ఉద్దేశం కాదు. ఇది హిందీ, ఇంగ్లీషు భాషలలోఉంది. అందువల్ల ఎక్కువమంది ఈ క్విజ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.
ప్రధానమంత్రి ఆదేశాలు,చొరవ మేరకు తొలిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నవంబర్ 26 వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. అలాగే 2015 సంవత్సరం అంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 వ జయంతి సంవత్సరమని ఆయన గుర్తుచేశారు.
భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పాత్ర ఎనలేనిదని ,ఇది భారతదేశం గొప్ప ప్రజాస్వామికదేశంగా ఎదిగే లక్ష్య సాధనకు మార్గనిర్దేశం చేసిందని అంటూ ఆయన డాక్టర్. బి.ఆర్.అంబేడ్కర్‌కు నివాళులర్పించారు.మన రాజ్యాంగం సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి. సమాజంలో చిట్టచివరన ఉన్న వారికి సాధికారత కల్పించడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. రాజ్యాంగానికి గల మౌలిక అంశాల గురించి ప్రస్తావిస్తూ, రాజ్యాంగ పత్రం సమానత్వం,న్యాం, స్వేచ్ఛకు పూచీపడడమే కాక సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందన్నారు.ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి ప్రజలకు పిలుపునిస్తూ, ప్రజలు ప్రాథమిక విధులకు సానుకూలంగా కట్టుబడి ఉండాలన్నారు. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు మరొక వ్యక్తి ప్రాథమిక విధులకు సంబంధించినవి అని అన్నారు.వీలైనంత ఎక్కువ మంది ఈ ఉత్సవాలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తమ సర్టిఫికేట్‌ను సంవిధాన్ దివస్#SamvidhanDiwas Facebook @MOPAIndia, Twitter @mpa_india. పైనా షేర్‌చేయాల్సిందిగా కోరారు.
***
(Release ID: 1879342)