ఆయుష్

ఆయుష్ మంత్రిత్వ శాఖ, శాస్త్ర, సాంకేతిక శాఖ మధ్య కుదిరిన - అవగాహన ఒప్పందం


ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ కోసం ఆయుష్ విభాగం లో ఫలితం ఆధారంగా పరిశోధన, శాస్త్రీయ జోక్యాన్ని ప్రోత్సహించడానికి చేతులు కలిపిన - రెండు మంత్రిత్వ శాఖలు

Posted On: 25 NOV 2022 4:00PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్ర, సాంకేతిక విభాగం మధ్య ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు) కుదిరింది.   ఆయుష్ రంగంలో ఫలితం ఆధారంగా శాస్త్రీయ జోక్యంతో పాటు, ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలో వీటిని మరింతగా అమలు చేయడానికి సహకారంతో, కలిసి, సంయుక్తంగా అన్వేషించడానికి వీలుగా పరిశోధన చేయదగిన రంగాలను ఈ ఎం.ఓ.యు. గుర్తిస్తుంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, డి.ఎస్.టి. శాస్త్రవేత్తల సమక్షంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మరియు డి.ఎస్‌.టి. కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ఈ ఎం.ఒ.యు. పై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా, వైద్య రాజేష్ కోటేచాచ మాట్లాడుతూ, కొత్త ఔషధాల అభివృద్ధి, చికిత్సా విధానానికి చెందిన యాంత్రిక అంశాలను ధ్రువీకరించడంలో ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి డి.ఎస్.టి. చూపిస్తున్న నిబద్ధతకు ధన్యవాదాలు తెలియజేశారు. 

డి.ఎస్.టి. కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ముఖ్యంగా ఆరోగ్య శాస్త్రాల్లో సంప్రదాయ జ్ఞానంఆధునిక విజ్ఞానం చేతులు కలుపుతున్నాయిఆయుష్ శాస్త్రవేత్తలువైద్య నిపుణులను మేము ఒక చోటకి చేర్చినప్పుడుసరసమైన ధరలకు అందుబాటులో ఉండే పరిష్కారాలతో ముందుకు రాగలమనే నమ్మకం మాకు ఉంది. దేశంలోని అత్యుత్తమ కార్యక్రమాలలో ఇది ఒకటి అవుతుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. 

ఈ ఎం.ఓ.యు. ద్వారా, ఆయుష్ మంత్రిత్వ శాఖ, డి.ఎస్‌.టి.లు రెండూ, సంయుక్తంగా ఆయుష్ భావనలు, విధానాలు, ఉత్పత్తుల శాస్త్రీయ ధృవీకరణపై ఆర్.&డి. కార్యకలాపాలను చేపట్టేందుకు, సమాచార మార్పిడికి ఒక వేదికను రూపొందించుకోవడం తో పాటు, ఆయుష్-సంబంధిత ప్రాథమిక భావనలు, సూత్రాలను అర్థం చేసుకునే దిశగా ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. 

ఆధునిక శాస్త్రాలలో ప్రాథమిక భావనలు, విధానాలు, కొత్త సాధనాల అభివృద్ధి మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఆయుష్-సంబంధిత వ్యవస్థలతో కూడిన ముఖ్యమైన ప్రాంతాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తిస్తుంది. కాగా, మరోవైపు, శాస్త్ర, ఇంజినీరింగ్ పరిశోధన మండలి (ఎస్.ఈ.ఆర్.బి) ద్వారా, ముఖ్యమైన ప్రాంతాల అమలును చక్కగా నిర్దేశించబడిన ప్రణాళికలు, పరస్పర సంఘటిత చర్యల ద్వారా డి.ఎస్.టి. సమన్వయం చేస్తుంది.

పరిశ్రమలు,  ఆర్.&డి. సంస్థలు (ప్రభుత్వ / ప్రయివేటు), ప్రభుత్వ సంస్థలు / విభాగాలతో భాగస్వామ్యం బలంగా ప్రోత్సహించబడుతుంది.  అదే విధంగా, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల్లో పరిశోధన, సాంకేతిక అభివృద్ధి లో చురుకుగా నిమగ్నమై ఉన్న వ్యక్తి లేదా జాతీయ శాస్త్రవేత్తల సమూహం నుండి ఆయుష్ సంబంధిత ఆర్.&డి. కార్యకలాపాల కింద ప్రతిపాదనలు పంపే విషయం పై కూడా ఈ ఎమ్.ఒ.యు. దృష్టి పెడుతుంది.

*****



(Release ID: 1878996) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi , Malayalam