వ్యవసాయ మంత్రిత్వ శాఖ

తృణధ్యానాలను పోషకహారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఐవైఓఎం) - 2023 అవకాశాన్ని అందిస్తుంది - శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


తృణధాన్యాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ యుద్ధప్రాతిపదిన పని చేస్తోంది: శ్రీ తోమర్

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని చెప్పిన శ్రీ తోమర్

దిల్లీలోని హై కమిషనర్లు/రాయబారులు హాజరైన ఐవైఓఎం23 ముందస్తు ప్రారంభ వేడుకలో ప్రసంగించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

Posted On: 24 NOV 2022 3:57PM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా తృణధ్యాన్యాల ఉత్పత్తిని పెంచడానికి, శుద్ధి చేయడానికి, పంట మార్పిడిని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి, ఆహారంలో చిరుధాన్యాల ప్రాధాన్యత పెంచడానికి ప్రోత్సహించడానికి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఐవైఓఎం) - 2023 అవకాశం కల్పిస్తుందని కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని శ్రీ తోమర్ చెప్పారు.

ఐవైఓఎం23 ముందస్తు ప్రారంభ వేడుకగా కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమంలో, దిల్లీలోని హై కమిషనర్లు/రాయబారులను ఉద్దేశించి శ్రీ తోమర్ ప్రసంగించారు. ఐవైఓఎం23 ద్వారా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా తృణధ్యాన్యాల వినియోగం పెంచడమే అందరి లక్ష్యంగా వెల్లడించారు.

ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల సహకారంతో తృణధ్యాన్యాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి కేంద్ర వ్యవసాయ శాఖ యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని శ్రీ తోమర్ చెప్పారు.

"చిన్న పిల్లలు, మహిళల పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి ప్రాథమిక కేలరీల బదులు తృణధ్యాన్యాల వంటి వైవిధ్యమైన ఆహారాన్ని అందించేలా పంపిణీ కార్యక్రమాల తీరును మార్చేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థకు సమయం ఆసన్నమైంది" అని సూచించారు.

చిరుధాన్యాల్లోని పోషక విలువలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018 ఏప్రిల్‌లో తృణధాన్యాలను పోషకాహారంగా గుర్తించిందని, పోషణ్ మిషన్ ప్రచారంలో వాటిని కూడా చేర్చిందని శ్రీ తోమర్ వెల్లడించారు.

జాతీయ ఆహార భద్రత కార్యక్రమం (ఎన్‌ఎఫ్‌ఎంఎస్‌) కింద 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో పోషకాహార తృణధాన్యాలను అందిస్తున్నారు. అంతేకాక, రాష్ట్రాలు రైతులకు చాలా రకాలుగా సహాయం అందిస్తున్నాయి.

సుస్థిర ఉత్పత్తికి అండగా నిలబడడం, అధికంగా వినియోగించేలా అవగాహన కల్పించడం, మార్కెట్ వసతి, విలువ గొలుసును అభివృద్ధి చేయడం, పరిశోధన & అభివృద్ధి కార్యక్రమాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిధులు అందజేస్తోందని శ్రీ తోమర్ చెప్పారు.

66కు పైగా అంకుర సంస్థలకు రూ.6.25 కోట్లకు పైగా ఇచ్చామని, తదుపరి నిధుల కోసం 25 అంకుర సంస్థలకు ఆమోదం తెలిపామని కేంద్ర వ్యవసాయ మంత్రి చెప్పారు. "తృణధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించేలా వంటకాలు & విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం అంకుర సంస్థల వ్యవస్థాపకులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది" అని వివరించారు.

భారతదేశంలో 500కు పైగా అంకుర సంస్థలు తృణధాన్యాల విలువ ఆధారిత గొలుసులో పనిచేస్తుండగా, ఆర్‌కేవీవై-రాఫ్తార్ కింద 250 అంకు సంస్థలను 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్' ప్రోత్సహిస్తోంది.

సవాళ్లను గుర్తించి ఒక క్రమపద్ధతిలో, ప్రభావవంతంగా పరిష్కరించాలని నీతి ఆయోగ్, ప్రపంచ ఆహార కార్యక్రమం భావిస్తున్నాయని శ్రీ తోమర్ చెప్పారు. "తృణధాన్యాలను ప్రధాన ఆహారంలోకి తేవడం మీద ఈ భాగ్యస్వామం దృష్టి పెడుతుంది. అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం రూపంలోని అవకాశాలను ఉపయోగించుకుని, విజ్ఞాన మార్పిడి ద్వారా ప్రపంచంలో ముందంజ వేయడానికి భారతదేశానికి తోడ్పడుతుంది" అని వెల్లడించారు.

దిల్లీలోని హై కమిషనర్‌లు/రాయబారులను ఉద్దేశించి ప్రసంగించిన విదేశాంగ శాఖ మంత్రి శ్రీ ఎస్.జైశంకర్, కొవిడ్, వాతావరణ మార్పులు, ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచంలో తృణధాన్యాల ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు.

ఆహార భద్రతతో పాటు అంతర్జాతీయ సంబంధాలకు కూడా తృణధాన్యాలు ముఖ్యమని డాక్టర్ జైశంకర్ స్పష్టం చేశారు. ఒక మహమ్మారి ఆహార భద్రతను ఏం చేయగలదో కొవిడ్‌ వచ్చి ప్రపంచానికి గుర్తు చేసిందని చెప్పారు. వాతావరణ మార్పులు ఉత్పత్తిని తగ్గించి వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తాయని అన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో ఆహార భద్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించారు.

కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా మాట్లాడుతూ, చిన్న & సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంపొందించాల్సిన అవసరంపై దృష్టి పెట్టేలా మహమ్మారి చేసిందని, తృణధాన్యాలు ఉత్తమ ఎంపికల్లో ఒకటని అన్నారు. పర్యావరణహిత పంటలైన తృణధాన్యాలను తక్కువ నీటి వినియోగం, తక్కువ కర్బన ఉద్గారాలతో, కరువులో కూడా సాగు చేయవచ్చని చెప్పారు.

సూక్ష్మపోషకాలు, విటమిన్లు, ఖనిజాల గని తృణధాన్యం. ఆహార భద్రత, పోషకాహారంలో చిరుధాన్యాల సహకారం మీద అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం అవగాహన పెంచుతుంది. నిరంతర ఉత్పత్తి, నాణ్యత మెరుగుదల సాగుదారులను ప్రోత్సహిస్తుంది. పరిశోధన & అభివృద్ధి సేవల్లో పెట్టుబడి పెంచడానికి ఔత్సాహికుల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆసియా, ఆఫ్రికా ఖండాలు తృణధాన్యాల ప్రధాన ఉత్పత్తి, వినియోగ కేంద్రాలు. భారతదేశం, నైజర్, సూడాన్, నైజీరియా దేశాలు చిరుధాన్యాల పెద్ద ఉత్పత్తి దేశాలు.

జొన్నలు, ప్రోసో (కామన్ మిల్లెట్) వరుసగా 112, 35 దేశాల్లో అత్యధికంగా సాగవుతున్న తృణధాన్యాలు. చిరుధాన్యాల ఉత్పత్తిలో జొన్న, మొక్కజొన్న 90% పైగా విస్తీర్ణం, ఉత్పత్తిని కలిగి ఉంటాయి. రాగి (ఫింగర్ మిల్లెట్), చీనా (ప్రోసో మిల్లెట్స్), ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కంగ్ని), ఇతర చిరుధాన్యాలు మిగిలిన 10%లో ఉంటాయి.

భారతదేశం తృణధాన్యాల ప్రధాన ఉత్పత్తి దేశం. కంగ్ని, కుట్కి లేదా స్మాల్‌ మిల్లెట్, కోడోన్, గంగోరా, చీనా, బ్రౌన్ టాప్‌, జొన్నలు, రాగులు, ఇతర చిన్న ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఒకటి లేదా ఎక్కువ తృణధాన్యాల పంటలను పండిస్తాయి. గత 5 సంవత్సరాల్లో చూస్తే, 2020-21లో అత్యధికంగా దాదాపు 18 మిలియన్ టన్నుల పంటను భారతదేశం ఉత్పత్తి చేసింది.

2021-22 సంవత్సరానికి సంబంధించిన నాలుగో ముందస్తు అంచనా ప్రకారం, భారతదేశంలో సుమారు 16 మిలియన్ టన్నుల మినుములు ఉత్పత్తి అయ్యాయి. ఇది మొత్తం జాతీయ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 5 శాతం. దీనికి అత్యధికంగా 9.62 మిలియన్ టన్నుల మార్కెట్ వాటా ఉంది. 4.23 మిలియన్ టన్నుల ఉత్పత్తితో జొన్నలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. రాగి మరొక ముఖ్యమైన తృణధాన్యం. ఈ పంట ద్వారా 1.70 మిలియన్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఇతర చిరుధాన్యాల ఉత్పత్తి 0.37 మిలియన్ టన్నులుగా ఉంది.

శాఖాహారం వైపు ప్రజలు మొగ్గుతున్న ప్రస్తుత కాలంలో తృణధాన్యాలు ప్రత్యామ్నాయ ఆహార వ్యవస్థను అందిస్తాయి. సమతుల్య ఆహారంతో పాటు సురక్షిత వాతావరణానికి ఇవి దోహదం చేస్తాయి. మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరాలివి.

కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశీయంగా, అంతర్జాతీయంగా తృణధాన్యాలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనిపై అవగాహన, ప్రజల భాగస్వామ్యం పెంచడానికి అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం 2023 రూపంలో మైగవ్‌ వేదిక ద్వారా ముందస్తు ప్రారంభ వేడుకలు, కార్యక్రమాలను నిర్వహించింది. పోటీ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచడానికి మైగవ్‌ ఒక ముఖ్యమైన, విజయవంతమైన మాధ్యమంగా మారింది.

విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ మీనాక్షి లేఖి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు) దమ్ము రవి, కార్యదర్శి (పశ్చిమ) శ్రీ సంజయ్ వర్మ, దిల్లీలో ఉన్న దాదాపు 100 మంది హై కమిషనర్లు/రాయబారులు, రెండు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

<><><><>



(Release ID: 1878692) Visitor Counter : 340