సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రేమకు సంబంధించిన ప్రశ్నలకు శాస్త్రీయంగా సమాధానం చెప్పే ప్రయత్నమే "మై లవ్ ఎఫైర్ విత్ మ్యారేజ్" చిత్రం : దర్శకురాలు సిగ్నే బౌమనే


నేను ఒక వ్యక్తిగత కథను చెప్పాను - స్త్రీలు ఏమి చేయాలో సామాజిక శక్తులు నియంత్రిస్తున్న నేపథ్యంలో ఇది స్త్రీ వాద, రాజకీయ చిత్రం గా కనిపిస్తుంది : సిగ్నే బౌమనే


నిధులు సేకరించడానికి ఏడు సంవత్సరాలు నిరంతరం పనిచేసాం, 1600 మందికి పైగా ప్రజలు ఈ సినిమాను పూర్తి చేయడానికి సహాయం చేశారు : నిర్మాత స్టర్గిస్ వార్నర్

Posted On: 22 NOV 2022 5:57PM by PIB Hyderabad

స్త్రీలపై చిత్రించిన మూస పద్ధతులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే కథానాయిక జెల్మా యొక్క స్పష్టమైన చిత్రణ – విభిన్నమైన మనస్తత్వాలను కలిగిన - "మై లవ్ ఎఫైర్ విత్ మ్యారేజ్‌" చిత్రం డైరక్టర్ సిగ్నే బౌమనే వ్యక్తిగత జీవితం నుండి ప్రేరణ పొందింది, ఆమె రెండవ వివాహం యొక్క వైఫల్యం, స్త్రీలను నిర్దిష్ట పాత్రలలోకి టైప్‌ కాస్టింగ్ చేయడం, అలాంటి భావాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ఎదగడం - ప్రేమ, సంబంధాల సంక్లిష్టత మరియు సారాంశాన్ని ఆమె తీసుకుంటుంది.

53వ ఐ.ఎఫ్.ఎఫ్.ఐ. లో పి.ఐ.బి. నిర్వహించిన 'టేబుల్ టాక్' లో మీడియా మరియు చలనచిత్ర ప్రతినిధులను ఉద్దేశించి, శ్రీమతి సిగ్నే బౌమనే మాట్లాడుతూ, మహిళలు ఎలా తినాలి, దుస్తులు ఎలా ధరించాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా / ఎవరిని వివాహం చేసుకోవాలి అనే నిబంధనలతో ఎలా ఎదుగుతారు - అనే అంశాలు తరచుగా తల్లుల వంటి అత్యంత సన్నిహిత సంబంధాలతో పాటు, వ్యక్తిగత ఏజెన్సీ పట్ల పూర్తి నిర్లక్ష్యంతో తెలియజేయబడుతుంది.  ఏదైనా తప్పు జరిగితే, సమాజం దానికి తగిన పరిష్కారాన్ని కూడా అందిస్తుంది - ఆమె వివాహంలో తలెత్తే ఏదైనా సంఘర్షణకు తప్పించుకునే మార్గంగా - తన భర్త కంటే తన పిల్లలను ఎక్కువగా ప్రేమించమని, జెల్మా తల్లి సలహా ఇచ్చే సన్నివేశంలో అద్భుతంగా చిత్రీకరించబడింది. 

తన చిత్రాన్ని, స్త్రీవాద చిత్రంగా గుర్తించాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు, శ్రీమతి సిగ్నే సమాధానమిస్తూ, "ఫెమినిస్ట్" అనే పదం మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం గురించి ఎలా సూచిస్తుంది అని సమాధానమిచ్చింది.  స్త్రీలు వ్యక్తిగత కథలు చెప్పడానికి, అలాంటి సమానత్వాన్ని క్లెయిమ్ చేయడానికి లేచినప్పుడు, మహిళల పాత్రలపై సమాజం యొక్క నీటి చొరవ లేని భావనల కారణంగా వారు అడ్డంకులను ఎదుర్కొంటారు.  అటువంటి భావనల కారణంగా, ఆమె వ్యక్తిగతమైన ఏదో ఒక కథనం రాజకీయ లేదా స్త్రీవాద చర్యగా చాలామందికి కనిపించవచ్చని ఆమె భావించింది.

"వ్యక్తుల కోసం కుంచిత మనస్తత్వాలు - జీవ వాస్తవికత, సామాజిక నిర్దేశాల వంటి రెండు క్షమించరాని శక్తుల మధ్య వారు ఎలా జీవించాలి - అనే విషయం నాకు ఆసక్తిని కలిగించింది,  ఈ చిత్రం చేయడానికి నన్ను ప్రేరేపించింది", అని శ్రీమతి సిగ్నే వివరించారు. 

ఈ చిత్రం కార్యరూపం దాల్చడానికి తీసుకున్న ఏడు సంవత్సరాల ప్రయాణం గురించి, నిర్మాత స్టర్గిస్ వార్నర్ మాట్లాడుతూ, వివిధ మార్గాల్లో 1600 మంది అందజేసిన సహాయం ద్వారా ఇది సాధ్యమైందని, ఈ చిత్రంలో ఆ విషయాన్ని పేర్కొన్నట్లు, తెలియజేశారు.   త్రీడీ సెట్లు వేయడం, స్టాప్ మోషన్, స్టిల్ ఫోటోగ్రాఫ్‌లు తీయడం, వాటిపై యానిమేషన్ చేయడం, పొలిటికల్ మ్యాప్ యానిమేషన్‌ సరిగ్గా రూపొందించడం మొదలైన వాటితో ఈ చిత్రానికి ఒక రూపు ఇవ్వడానికి ప్రయత్నిచినట్లు, చిత్ర నిర్మాత వార్నర్ చెప్పారు.

భారతీయ సినిమా రంగం గురించి, చలనచిత్రాల గురించి శ్రీమతి సిగ్నే మాట్లాడుతూ, ఒకప్పటి సోవియట్ యూనియన్‌ లో తాను పెరుగుతున్నప్పుడు, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించే భారతీయ చలన చిత్రాలను బాగా చూసేదాన్ని, అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.  భారతీయ చలనచిత్ర నిర్మాతలు వ్యక్తిగత అనుభవాలపై మరిన్ని వ్యక్తిగత కథనాలను రూపొందించాలని ఆమె సూచించారు.  

నిర్మాత స్టుర్గిస్ వార్నర్ మాట్లాడుతూ, అటువంటి చిత్రాలను భిన్న సంస్కృతులలో చూడాలని, ఓ.టి.టి. ప్లాట్‌ఫారమ్‌ లు / పంపిణీదారులు వ్యక్తిగత కథనాలను వీలైనంత విస్తృతంగా ప్రచారం చేయడానికి పిలుపునివ్వాలని కూడా ఆయన సూచించారు. 

శ్రీమతి సైన్ ప్రేక్షకులపై తన చిత్రం ఊహించిన ప్రభావం గురించి ఆమె మాట్లాడుతూ,  ఈరోజు తీసుకునే ఎంపికలు రేపటి ప్రగతిశీల సమాజాన్ని నిర్వచించగలవని ఆమె భావించారు.  ఇది విభిన్నంగా ఉండే వ్యక్తులపై చలన చిత్రాల ద్వారా ప్రారంభించబడుతుంది. వారు భిన్నంగా ఉండాలని ఎంచుకుంటారు.  సమాజం వారికి భిన్నంగా ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. 

ఐ.ఎఫ్.ఎఫ్.ఐ-53 లో నిన్న ప్రదర్శితమైన "మై లవ్ ఎఫైర్ విత్ మ్యారేజ్" చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది.

సినిమా పేరు : "మై లవ్ ఎఫైర్ విత్ మ్యారేజ్"

దర్శకత్వం & స్క్రీన్‌ ప్లే : సిగ్నే బౌమనే

నిర్మాతలు :        రాబర్ట్స్ వినోవ్స్కిస్, స్టర్గిస్ వార్నర్, సిగ్నే బౌమనే, రౌల్ నాడలెట్

ఎడిటర్ : సిగ్నే బామన్, స్టర్గిస్ వార్నర్.

తారాగణం : జెల్మా, దగ్మారా డొమిన్‌ జిక్. 

జీవశాస్త్రం : మిచెల్ పాక్.

మైథాలజీ సైరెన్లు : ట్రియో లెమోనాడో - ఇవా కట్కో వస్కా, క్రిస్టీన్ పాస్టారే, ఇలుటా అల్స్‌బెర్గా. 

సారాంశం:

ఒక అమ్మాయి ఎలా ప్రవర్తించాలనే సామాజిక అంచనాలకు కట్టుబడి ఉన్నంత కాలం ప్రేమ తన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని జెల్మాకు చిన్నప్పటి నుంచి పాటలు, అద్భుత కథలు ఒప్పించాయి.  కానీ పెద్దయ్యాక ఏదో ప్రేమ అనే భావన సరిగ్గా అనిపించలేదు.  ఆమె సమ్మతించడానికి ఎంత ప్రయత్నించిందో, ఆమె శరీరం అంతగా ప్రతిఘటించింది.  అంతర్గత స్త్రీ తిరుగుబాటు యొక్క అంగీకారం గురించి ఒక కథ.

పూర్తి టేబుల్ టాక్‌ ని ఇక్కడ చూడండి:

పి..బి.ఎఫ్.ఎఫ్.క్యాస్ట్ & క్రూ నదీమ్ / పరీక్షిత్ దర్శన .ఎఫ్.ఎఫ్.53 - 68 


***



(Release ID: 1878166) Visitor Counter : 134


Read this release in: Urdu , English , Hindi , Tamil