సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప‌లోమా నుంచి పాసిఫికేష‌న్ దాకాః పోర్చుగీస్ సినీ నిర్మాణంలోని సూక్ష్మ అంశాల వేడుక‌

Posted On: 22 NOV 2022 6:25PM by PIB Hyderabad

త‌న బాయ్‌ఫ్రెండ్ జెను చ‌ర్చిలో సంప్ర‌దాయంగా వివాహం చేసుకోవాల‌న్న త‌న క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని ప‌లోమా ఒక మండువేస‌వి రోజున నిశ్చ‌యించుకుంది. ఒక బొప్పాయి తోట‌లో వ్య‌వ‌సాయ కూలిగా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే ఆమె అంకిత‌భావం గ‌ల త‌ల్లి కూడా. ఆమె త‌న సుదీర్ఘ‌కాల స్వ‌ప్నం కోసం డ‌బ్బును ఆదా చేస్తోంది. అయితే, స్థానిక  మ‌తాధికారి  ఆమె వివాహాన్ని నిర్వ‌హించేందుకు తిర‌స్క‌రించ‌డంతో ఆమె స్వ‌ప్నానికి వాస్త‌విక‌త అనే ప‌రీక్ష ఎదురైంది. ఆ ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ అనేక నింద‌ల‌ను, వంచ‌న‌లను , మ‌తాంధ‌త‌ను, అన్యాయాన్ని ఎదుర్కొన్న‌ప్ప‌టికీ, ఆమె విశ్వాసం, ప‌ట్టుద‌ల స్థిరంగా ఉంది. చారిత్ర‌క భూమి అయిన పొర్చుగ‌ల్ నుంచి ప‌లోమా ఇఫ్ఫి 53వ ఎడిష‌న్‌కు విచ్చేసింది. అంతేకాదు, ఐసిఎఫ్‌టి- యునెస్కో గాంధీ మెడ‌ల్ వ‌ర్గంలో పోటీ ప‌డుతోంది. 
 మార్సెలా గోమ్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లోమా (2022) నుంచి స్టిల్‌

 


పోర్చుగ‌ల్ మూలం నుంచి వ‌చ్చిన ఇత‌ర చిత్రాలైన  మార్కో మార్టిన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ గ్రేట్ యార్‌మౌత్ (2022), ఆల్బ‌ర్ట్ సెర్రా ద‌ర్శ‌క‌త్వంలోని పాసిఫికేష‌న్‌ను ఇఫ్ఫి 53వ ఎడిష‌న్‌లో డెలిగేట్లు చూసి ఆనందించ‌వ‌చ్చు. 
దాదాపు 1896 నుంచి కొన‌సాగుతున్న చ‌రిత్ర క‌లిగిన పోర్చుగీస్ సినిమా క‌థ‌లు త‌న ఫిరంగిలో అనేక టోటెమిక్ (తెగ‌ల‌కు సంబంధించిన చిహ్నాల) పేర్ల‌తో  సినీ అభిమానులంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. 
లూమియ‌ర్ సోద‌రులు చరిత్ర సృష్టించిన ఆరు నెల‌ల త‌ర్వాత‌, 18 జూన్ 1896లో పోర్చుగ‌ల్‌లోని లిస్బ‌న్‌లో యల్ కోలిస్యూ దా రువా దా పామా ఎన్‌º 288 జ‌న్మించింది. ఎ సెవెరా అన్న‌ది పూర్తి మాట‌ల‌తో కూడిన పోర్చుగ‌ల్ సినిమా. దీనిని 1931లో నిర్మించారు. త్వ‌ర‌లోనే పోర్చుగీస్ సినిమా త‌న స్వ‌ర్ణ యుగంలోకి ప్ర‌వ‌శించింది. ఇది ఎ కాకో దే లిస్బావ్ అన్న చిత్రంతో 1933లో ప్రారంభ‌మై, త‌ర్వాత 20 ళ్ళ సుదీర్ఘ‌కాలం పాటు ఓ పాషియో దాస్ కాంటిజ‌స్ (1942), ఎ మెనీనా దా రేడియో (1944) వంటి చిత్రాల‌తో కొన‌సాగింది. పోర్చుగీస్ సినిమా ప్ర‌పంచ‌ క్రియాశీల‌త  ఎటువంటిదంటే, అత్యంత ప్రాచుర్యం పొందిన ఇటాలియ‌న్ న‌యా వాస్త‌విక వాదపు సినిమాల‌క‌న్నా ఏడాది ముందే మానోల్ డి ఒలివీరా తొలిచ‌ల‌న చిత్ర‌మైన‌ అనికి-బోబో (1842) ఒక‌ర‌క‌మైన వాస్త‌విక క‌ళాభిరుచిని ప్ర‌ద‌ర్శించింది. 
ఇఫ్ఫి 53వ ఎడిష‌న్‌లో పోర్చుగీస్ సినీ నిర్మాణ ప్ర‌ముఖ వార‌స‌త్వ సంగ్ర‌హావ‌లోక‌నం చేసి, ప‌లోమా, యార్‌మౌత్‌, పాసిఫికేష‌న్ ద్వారా పోర్చుగ‌ల్ చెప్పే అనేక క‌థ‌ల‌ను అనుభూతించండి. 
గ్రేట్ యార్‌మౌత్ సినిమా నుంచి స్టిల్ః తాత్కాలిక గ‌ణాంకాలు

 

పాసిఫికేష‌న్ చిత్రం స్టిల్‌ 

 

ఇఫ్ఫి గురించి

ఆసియాలో నిర్వ‌హించే ప్ర‌ముఖ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో 1952లో స్థాపించిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా ఇఫ్ఫి ఒక‌టి. సినిమాల‌ను అవి చెప్పే క‌థ‌ల‌ను, దాని వెనుక ఉన్న వ్య‌క్తుల‌ను ఉత్స‌వంగా జ‌రుపుకోవ‌డం  ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా వెనుక ఆలోచ‌న. అలా చేయ‌డం ద్వారా, సినిమాల పై ఉన్న‌త‌మైన ప్ర‌శంస‌ల‌ను, ప్ర‌గాఢ ప్రేమ‌ను విస్త్ర‌తంగా, లోతుగా పెంచి, పోషించి, ప్రోత్స‌హించ‌డం, ప్ర‌జ‌ల మ‌ధ్య‌ ప్రేమ‌, అవ‌గాహ‌న‌, సౌభ్ర‌తృత్వ‌పు వంతెన‌ల‌ను నిర్మించ‌డం, వ్య‌క్తిగ‌త‌, సామూహిక ఔన్న‌త్య‌పు నూత‌న శిఖ‌రాల‌ను అధిరోహించేందుకు వారికి స్ఫూర్తినివ్వ‌డం.
ఈ ఉత్స‌వాన్ని ప్ర‌తి ఏడాది ఎన్‌ట‌ర్టైన్‌మెంట్ సోసైటీ ఆఫ్ గోవా స‌హ‌కారంతో, గోవా ప్ర‌భుత్వం అతిథేయ రాష్ట్రంగా కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ మంత్రి నిర్వ‌హిస్తుంది.  ఇఫ్ఫికి సంబంధించిన అన్ని స‌హేతుక‌, తాజా వివ‌రాల కోసం ఫెస్టివ‌ల్ వెబ్‌సైట్ www.iffigoa.org, పిఐబి వెబ్‌సైట్  pib.gov.in, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన‌స్టాగ్రామ్‌ల సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను, పిఐబి గోవా సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌ను చూడ‌టం ద్వారా తెలుసుకోవ‌చ్చు.
వేచి ఉండండి, సినిమా వేడుక క‌ప్ నుంచి ధారాళంగా తాగుతూ, ఆ ఆనందాన్ని పంచుకుందాం.
  
పిఐబి బృందం - అన‌ఖ‌/ ద‌ర్శ‌న ఇఫ్ఫి 53-70



(Release ID: 1878164) Visitor Counter : 129