మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ (సిఐఐ) జాతీయ మండ‌లి స‌మావేశాన్ని ఉద్ద‌శించి ప్ర‌సంగించిన శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌


నూత‌న విద్యా విధానం 2020 స్ఫూర్తికి అనుగుణంగా స‌మ‌ర్ధ‌వంత‌మైన ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను సృష్టించ‌వ‌ల‌సిందిగా ప‌రిశ్ర‌మ‌కు పిలుపు

Posted On: 21 NOV 2022 4:55PM by PIB Hyderabad

 సామాజిక సంక్షేమం, ఆర్ధిక వృద్ధిని ప్రోత్స‌హించేందుకు 21వ శ‌తాబ్దం భ‌విష్య‌త్‌కు సంసిద్ధ‌మైన కార్మిక శ‌క్తిని సృష్టించేందుకు విధాన‌క‌ర్త‌లు, విద్యావేత్త‌లు, ప‌రిశ్ర‌మ‌లు క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సిఐఐ జాతీయ మండ‌లి స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ కేంద్ర విద్య‌, నైపుణ్యాల అభివృద్ధి, వ్య‌వ‌స్థాప‌క‌త మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ సోమ‌వారం సూచించారు. 
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ దార్శ‌నిక‌త అయిన జాతీయ విద్యా విధానం, 2020 అన్న తాత్విక ప‌త్రం అమ‌లు జ‌రుగుతోంద‌ని ఆయ‌న ఎన్ఇపి 2022 గురించి మాట్లాడుతూ అన్నారు. బాల్యం నుంచి ఉన్న‌త విద్య వ‌ర‌కు, నైపుణ్యాల అభివృద్ధి కోసం అన్ని స్థాయిల్లో స‌మ‌గ్ర అభ్యాసం సాగేలా చూసేందుకు తాము ప‌ని చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. 
విద్యా వ్య‌వస్థ అడ్డంకుల‌ను అధిగ‌మించి విద్యార్ధుల‌ను సాధికారం చేయాల‌ని మంత్రి అన్నారు. విద్యా ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత క‌లుపుకుపోయేలా చేసేందుకు మాతృభాష‌లోనూ, స్థానిక భాష‌ల్లోనూ విద్యాభ్యాసాన్ని ప్రవేశ‌పెడుతున్నామ‌న్నారు. 
స‌మాజంలో సంప‌ద‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం గురించి ఎర్ర‌కోట ప్రాకారాల నుంచి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ పేర్కొనడ‌మే కాక‌,  క‌నీస ప్ర‌భుత్వం, గ‌రిష్ట పాల‌న అన్న స్ఫూర్తితో ప్ర‌భుత్వం సంధాత‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. 
మ‌న సంప‌ద సృష్టిక‌ర్త‌లు 21వ శ‌తాబ్ద‌పు కార్మిక శ‌క్తిని అభివృద్ధి చేసే కీల‌క పాత్ర‌ను పోషించాల‌ని శ్రీ ప్ర‌ధాన్ చెప్పారు. జాతీయ విద్యా విధానం 2020 స్ఫూర్తికి అనుగుణంగా స‌మ‌ర్ధ‌వంత‌మైన‌ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను సృష్టించాల‌ని ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న పిలుపిచ్చారు. 
 స‌రైన జ్ఞానానికి డిమాండ్‌ను సృష్టించ‌డం, ఆర్ &డిలో మ‌రిన్ని పెట్టుబ‌డులు, నైపుణ్యాల‌ను ఆధునీక‌రించ‌డం పై దృష్టి, ప్ర‌స్తుత కార్మిక శ‌క్తి నైపుణ్యాలు పెంచ‌డం ద్వారా ప‌రిశ్ర‌మ‌కు చెందిన స‌భ్యులు భార‌త‌దేశ భ‌విష్య‌త్ నిర్మాణం కోసం మ‌రింత స‌చేత‌న‌మైన కార్మిక శ‌క్తిని సృష్టించేందుకు దోహ‌దం చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

***



(Release ID: 1877857) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi