రక్షణ మంత్రిత్వ శాఖ
గోవా షిప్ యార్డ్‌లో రెండు కోస్ట్‌గార్డ్ కాలుష్య నియంత్రణ నౌకల(పిసివి) నిర్మాణానికి కీల్ ఏర్పాటు
బహుముఖీయ పాత్రలను పోషించగలిగే సామర్ధ్యం కలిగిన అత్యంత ఆధునిక పరికరాలు కలిగిన నూతన తరం నౌక స్పెషల్ రోల్ వెస్సెల్ (ప్రత్యేక పాత్ర పోషించే నౌక)
Posted On:
21 NOV 2022 5:01PM by PIB Hyderabad
ఎంఎస్ఎంఇలు సహా దేశీయ సంస్థల నుంచి పరికరాలను, వ్యవస్థలను కొనుగోలు/ సేకరణ చేయాలన్న మేకిన్ ఇండియా నిబద్ధతకు అనుగుణంగా గోవా షిప్‌యార్డులో రెండు కోస్ట్‌గార్డ్ కాలుష్య నియంత్రణ ఓడలను, జిఎస్ఎల్ యార్డ్ 1267& 1268కి కీల్(ఓడ కింద దూలము)ని భారతీయ కోస్ట్ గార్డ్ వేసింది. కాలుష్యాన్ని నియంత్రించే రెండు ఓడలకు గోవా షిప్ యార్డ్ దేశీయంగా రూపకల్పన చసి అభివృద్ధి చేస్తోంది. వీటిని ఫిబ్రవరి 2025 నాటికి, ఆగస్టు 2025 నాటికి బట్వాడా చేయనుంది.
ఓడల నిర్మాణంలో కీల్‌ను ఏర్పాటు చేయడమన్నది ప్రధానమైన మైలురాయి కార్యకలాపం. ఇది లంగరు వేసే చోట నౌకల నిర్మాణ ప్రక్రియకు అధికారిక ప్రారంభానికి సంకేతం. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణ నౌకలు నూతన తరం ప్రత్యేక పాత్ర పోషించే నౌకలని ఇండియన్ కోస్ట్ గార్డ్ శ్రీ విఎస్ పథానియా తెలిపారు. వీటిని, భారతీయ కోస్ట్‌గార్డ్ బహుముఖీయ పాత్రలను పోషించగల సామర్ధ్యంతో, ప్రధానంగా తీరప్రాంతం నుంచి సముద్రంలోకి విస్తరించిన సముద్ర కాలుష్యాన్ని నిరోధించేందుకు వీలుగా అభివృద్ధి చెందిన, అత్యంత ఆధునిక పరికరాలను కలిగి ఉండేలా నిర్మిస్తున్నారని వివరించారు.
ఈ పిసివిలు అత్యాధునిక సాంకేతికత, అభివృద్ధి చెందిన, అత్యంత సున్నితమైన కాలుష్య నియంత్రణ పరికరాలు, నావిగేషన్ (సముద్రయాన నిర్వహణ), కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్, ఇతర యంత్రాలను కలిగి ఉంటాయి.
ఓడలు కాలుష్య కారకాల నియంత్రణ, పునరుద్ధరణ, వేరు చేయడం, విసర్జించడం కోసం అంకితమైన చమురుతెట్టు ప్రతిస్పందన కార్యకలాపాలను నిర్వహించగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. నౌక ప్రయాణిస్తున్నప్పుడు చమురు చందకుండా అరికట్టేందుకు వీలుగా రెండు ఫ్లష్ చేసే సామర్ధ్యం కలిగిన రెండు వ్యాపకం (స్వీపింగ్) బాహువులు ఇరువైపులా సహా సరికొత్త కాలుష్య నియంత్రణ పరికరాలను అమర్చనున్నారు.
సంక్లిష్టమైన చిందిన చమురు నమూనా వ్యాప్తిని అంచనా వేసేందుకు ఒక అధునాతన సాఫ్టవేర్ సాయపడనుంది. దీనితో పాటుగా క్రియాశీలమైన పొజిషనింగ్ వ్యవస్థ, నిర్బంధిత ప్రాంతాలలో ఖచ్చితత్వంతో నౌకను ప్రయాణించేందుకు తోడ్పడుతుంది. గంటలకు 300 టన్నుల చొప్పున తేలికైన నుంచి అత్యంత జిగట చమురును సేకరించేలా ఈ నౌకను రూపొందించారు.ఈ నౌకలను అగ్నిమాపక, సాల్వేజ్ (నౌక ఉద్ధరణ) వ్యవస్థలతో కూడి ఉంటాయి.
***
(Release ID: 1877851)
Visitor Counter : 159