యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్రీడా మంత్రిత్వ శాఖ నీరజ్ చోప్రా, మరో ముగ్గురు అథ్లెట్లను టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం (టాప్స్) కింద విదేశీ శిక్షణా శిబిరాలకు పంపించేందుకు సుమారు రూ. 94 లక్షల నిధుల మంజూరుకు అనుమతి

Posted On: 19 NOV 2022 8:31PM by PIB Hyderabad

 బ్రిటన్ లోని లౌబరో విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందాలనే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ప్రతిపాదనను 18వ తేదీన జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసి) 86వ సమావేశంలో  ఆమోదించింది.  కోచ్ డాక్టర్ క్లాస్ బార్టోనిట్జ్, ఫిజియోథెరపిస్ట్ ఇషాన్ మార్వాహాతో కలిసి నీరజ్ చోప్రా 63 రోజుల పాటు లౌబరోలో శిక్షణ పొందడానికి ఈ వారంలో యూకే వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. 

నీరజ్‌తో పాటు, షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అతని కోచ్ మరియు ఫిజియోథెరపిస్ట్‌తో పాటు ఇండోనేషియాలోని జకార్తాలోని ప్రిస్మా స్పోర్ట్స్ క్లబ్‌లో 29 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు, రెజ్లర్ దీపక్ పునియా, అతని ఫిజియోథెరపిస్ట్‌తో పాటు శిక్షణ పొందే ప్రతిపాదనలను కూడా ఎంఓసి ఆమోదించింది. 34 రోజుల పాటు అమెరికాలోని మిచిగాన్ లో వీరు శిక్షణ పొందనున్నారు. జావెలిన్ త్రోయర్, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అన్నూ రాణి, ఆమె ఫిజియోథెరపిస్ట్‌తో పాటు జర్మనీలోని లీచ్‌టాత్లెటిక్-జెమీన్‌షాఫ్ట్ అఫెన్‌బర్గ్‌లో కోచ్ వెర్నర్ డేనియల్స్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనున్నారు. కోచ్ వెర్నర్ డేనియల్స్ గతంలో నీరజ్ చోప్రా కు కూడా శిక్షణ ఇచ్చారు. 

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద వీరికి నిధులు సమకూరుస్తారు. క్రీడాకారులు, వారి సహాయక సిబ్బంది విమానాలు, వసతి, స్థానిక ప్రయాణం, ఇతర ఖర్చులతోపాటు ఆహార ఖర్చులకు ఈ నిధులు వెచ్చిస్తారు. అంతే కాకుండా టాప్స్ ప్రతి అథ్లెట్‌కు వారి బస సమయంలో వారు చేసే ఇతర ఖర్చుల కోసం రోజుకు 50 డాలర్ల భత్యం అందజేస్తుంది.

పైన పేర్కొన్న అథ్లెట్లందరి శిక్షణకు మొత్తం సుమారుగా రూ. 94 లక్షలు ఖర్చవుతుంది. దీనిని యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ కి చెందిన నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎన్ఎస్డిఎఫ్) కింద విడుదల చేస్తున్నారు. 

***


(Release ID: 1877807)
Read this release in: English , Urdu , Hindi