వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత స్టార్టప్ ల సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత , సమస్యా పరిష్కార విధానం టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం సాధించడానికి దేశానికి సహాయపడుతుంది: శ్రీ పియూష్ గోయల్


పెద్ద ఈకామర్స్ కంపెనీలతో పోటీ పడేందుకు చిన్న వ్యాపారాలు , మామ్, పాప్ స్టోర్ లకు ఒ ఎన్ డి సి వేదికను అందిస్తుంది: శ్రీ పీయూష్ గోయల్

అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు భారతదేశం చేపట్టిన కవాతుకు బెంగళూరు కొత్త శకానికి నాంది పలికింది: శ్రీ గోయల్

100 యూని కార్న్ లో 40కి పైగా బెంగళూరులో ఉన్నాయి; ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఆర్ అండ్ డి సెంటర్లు, ఇంక్యుబేషన్ సెంటర్లు, ఎంతో అధిక నాణ్యత కలిగిన టాలెంట్ యొక్క పెద్ద పూల్ రూపంలో ఇక్కడ ఒక భారీ పర్యావరణ వ్యవస్థ సృష్టించబడింది: శ్రీ పియూష్ గోయల్

Posted On: 18 NOV 2022 8:02PM by PIB Hyderabad

 

స్టార్ట్ అప్ ల సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, ఆవిష్కరణ , సమస్యలు పరిష్కరించే విధానాల శక్తి గుణకం భారత దేశం ప్రపంచ ఆధిక్యాన్ని సాధించడానికి దోహదపడుతోందని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల, వినియోగ దారుల వ్యవహారాలు, ఆహార,  ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈ రోజు బెంగళూరు లో జరిగిన 25వ బంగళూరు టెక్ సదస్సులో ఆయన ప్రసంగించారు.

 

ఈ సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ, మహమ్మారి తర్వాత కోలుకోవడంలో భారతదేశం ముందు నుండి ముందంజలో ఉందని,  భారతీయ స్టార్టప్‌లు దాదాపు బూస్టర్ డోస్ పాత్రను పోషిస్తున్నాయని అన్నారు. భౌగోళిక-రాజకీయ సవాళ్లు ప్రపంచ వాణిజ్యాన్ని వెనక్కి నెట్టివేసి, దేశాలు మాంద్యం మోడ్‌లోకి పడిపోతున్నప్పటికీ, భారతదేశం ప్రపంచ రికవరీకి నాయకత్వం వహించడంలో మన తెలివైన అబ్బాయిలు , అమ్మాయిలు సహాయపడుతున్నారని ఆయన అన్నారు.

 

ప్రపంచం  గుర్తించిన ఇటీవలి భారతీయ టెక్ పరిశ్రమ పెద్ద ఆవిష్కరణలకు శ్రీ గోయల్ ఉదాహరణలు ఇచ్చారు. యూనిఫైడ్ పేమెంట్ గేట్ వే, యుపిఐ, కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహణ , ఆధార్ కార్డు రూపంలో ఒక బిలియన్ మందికి ఉమ్మడి గుర్తింపు కార్డు, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య సంరక్షణ , వన్ నేషన్ వన్ రేషన్ కార్డుతో నిరుపేదలకు నిరంతరాయంగా రేషన్ సరఫరా వంటి కార్యక్రమాలు - ఇవన్నీ మన యువ ఆవిష్కర్తలు అభివృద్ధి చేసిన వేదికలకు ఉదాహరణలని పేర్కొన్నారు. .

 

భారత దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకత గురించి మంత్రి ప్రస్తావిస్తూ, మన ద్రవ్యోల్బణం వాస్తవానికి తగ్గుతోందని, నేటికీ ఇది పది సంవత్సరాల క్రితం

ఉన్న స్థాయిలో సగ భాగం అని అన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ఎనిమిదేళ్లుగా అలుపెరగని కృషి చేయడం ద్వారా, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి 2014-15లో కేంద్ర బ్యాంకును తప్పనిసరి చేసిన తరువాత, ఈ కాలంలో సగటున 4.5 శాతం ద్రవ్యోల్బణం రేటును కలిగి ఉన్న పరిస్థితి ఉందని ఆయన అన్నారు

ఇప్పటికీ ద్రవ్యోల్బణం 6.5 శాతం వద్ద నియంత్రణలో ఉందని ఆయన తెలిపారు

2047 నాటికి మనం ప్రపంచ ఆర్థిక రికవరీని కొనసాగిస్తామని, 2047 నాటికి మన స్వాతంత్ర్యం 100 సంవత్సరాలకు చేరుకున్న ప్పుడు ప్రపంచంలోని తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో మనం ఒకటిగా నిలుస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

బెంగళూరు గురించి శ్రీ గోయల్

ప్రస్తావిస్తూ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే ప్రయత్నంలో ఈ నగరం భారత దేశానికి ఒక కొత్త శకాన్ని ఆవిష్క రింపజేసిందని అన్నారు.ఈ సందర్భంగా బెంగళూరు సాధించిన ఘనత లను మనం తిరిగి చూసుకోవచ్చు అని ఆయన అన్నారు. 100 యూనికార్న్ లలో 40కి పైగా బెంగళూరులోనే ఉన్నాయని, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఆర్ అండ్ డి సెంటర్లు, ఇంక్యుబేషన్ సెంటర్లు, టాలెంట్ , మ్యాన్ పవర్ నైపుణ్యాల అధిక నాణ్యతతో ఇక్కడ భారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించామని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, బెంగళూరులు రేపటి భారతదేశానికి పతాక దారులు అని ఆయన అన్నారు.

 

 ఒఎన్ డిసి చొరవ గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఈకామర్స్ ను ప్రజాస్వామ్యీకరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. వైబ్రెంట్ ఈకామర్స్ నెట్ వర్క్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించడం ద్వారా చిన్న మామ్ , పాప్ స్టోర్లను కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఈ అభివృద్ధిలో బెంగళూరు పెద్ద పాత్ర పోషిస్తుందని, ఈ చొరవ విజయవంతమై ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పుడు, ఈ నగరంలో ప్రారంభ పరీక్షలు నిర్వహించడంతో ఇది బెంగళూరులో ప్రారంభమైందని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

 

ఈ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుంచి జి-20 అధ్యక్ష్య హోదాను భారత దేశం చేపట్టినట్లు శ్రీ గోయల్ తెలిపారు. భారత దేశం సాధించిన విజయాలను,

అవకాశాలను ప్రపంచానికి

ప్రదర్శించడానికి ఇదొక గొప్ప అవకాశం అని ఆయన అన్నారు. మన స్టార్టప్ లు, ఆవిష్కర్తలు ప్రపంచ వేదికపై తమను తాము ప్రదర్శించుకునే అవకాశాన్ని పొందేలా చూడటానికి మనం కలిసి పనిచేయబోతున్నాము అని ఆయన అన్నారు.

 

*****


(Release ID: 1877270) Visitor Counter : 174


Read this release in: English , Urdu , Hindi , Kannada