సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

భారత్, డెన్మార్క్ దేశాల అమూల్యమైన వెండి వస్తువుల ప్రదర్శన పై నేషనల్ మ్యూజియం, ఇండియా , కోల్డింగ్ మ్యూజియం, డెన్మార్క్ మధ్య అవగాహనా ఒప్పందం

Posted On: 17 NOV 2022 6:20PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో సంయుక్తంగా వెండి వస్తువుల ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న భారత నేషనల్ మ్యూజియం, డెన్మార్క్ కోల్డింగ్ మ్యూజియం

2023 మార్చి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం

సేకరించిన ఉత్తమ వెండి వస్తువులను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్న రెండు మ్యూజియంలు

మార్చి 2023 ప్రారంభంలో డెన్మార్క్ లోని కోల్దింగ్ మ్యూజియం , న్యూఢిల్లీలోని ఇండియా నేషనల్ మ్యూజియం సంయుక్తంగా డెన్మార్క్ , భారతదేశ అపురూప వెండి వస్తువులతో ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నాయి. ప్రదర్శనకు సంబంధించిన ఒక అవగాహన  ఒప్పంద పత్రం (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్) పై రోజు న్యూఢిల్లీ లో నేషనల్ మ్యూజియం , కోల్డింగ్ మ్యూజియం మధ్య సంతకాలు జరిగాయి 

2023 మార్చి లో జరిగే ఎగ్జిబిషన్ లో రెండు మ్యూజియంలు సేకరించిన ఉత్తమ వెండి వస్తువులను ప్రదర్శిస్తారు. 2022 నుండి 2026 సంవత్సరాల వరకు భారతదేశం - డెన్మార్క్ మధ్య ఇటీవల కుదిరిన సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం కింద ఉమ్మడి ఎగ్జిబిషన్

ఏర్పాటవుతోంది.

ప్రదర్శన "డెన్మార్క్ , భారతదేశం నుండి వెండి సంపదల" అనే   ప్రదర్శన డానిష్ , ఇండియన్ సిల్వర్ కళాఖండాలపై దృష్టి సారించింది, ఇక్కడ రెండు మ్యూజియంలు వారి సేకరణల నుండి ఉత్తమ వెండి వస్తువులను ప్రదర్శిస్తాయి. రెండు దేశాల్లోని వెండి హస్తకళా నైపుణ్యం అందాన్ని, గొప్పదనాన్ని చాటేలా, ఎగ్జిబిషన్ లో మొత్తం 200 అత్యుత్తమ వెండి వస్తువుల ను ప్రదర్శిస్తారు. మొట్టమొదటిసారిగా, నేషనల్ మ్యూజియం  సందర్శకులు భారతీయ , డానిష్ వెండి వస్తువుల పోటాపోటీ సంప్రదాయాలను చూడగలుగుతారు.

సందర్భంగా భారత దేశం లోని డానిష్ అంబాసిడర్ ఫ్రెడ్డీ స్వానే మాట్లాడుతూ , భారత నేషనల్ మ్యూజియమ్డెన్మార్క్ కోల్డింగ్ మ్యూజియం  కలిసి మార్చి ప్రారంభంలో సంయుక్తంగా వెండి

ప్రదర్శనను ప్రారంభించనున్నట్టు తెలియ జేయడం తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. డానిష్ , భారతీయ వెండి ఆభరణాల తయారీ లో సారూప్యతలు , వ్యత్యాసాలపై ఎగ్జిబిషన్ దృష్టి సారిస్తుందని, ఇక్కడ రెండు మ్యూజియంలు వారి సేకరణల నుండి ఉత్తమ వెండి వస్తువులను ప్రదర్శిస్తాయని ఆయన అన్నారు. భారతీయ ప్రేక్షకులు ప్రదర్శనను ఎలా గ్రహిస్తారో అని ఎదురు చూస్తున్నామని

అన్నారు.

సందర్భంగా జాతీయ మ్యూజియం డైరెక్టర్ జనరల్ , సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి లిల్లీ పాండే మాట్లాడుతూ, "నేషనల్ మ్యూజియం భారతదేశంలో భారతీయ నాగరికత ప్రారంభం నుండి ఆధునిక యుగం వరకు విస్తారమైన కాలక్రమానికి చెందిన అద్భుతమైన వెండి వస్తువుల గణనీయమైన సేకరణ కలిగి ఉందని అన్నారు.కాగా , ఎగ్జిబిషన్ కోసం డానిష్ సిల్వర్ తో పాటుగా ఇండియన్ సిల్వర్ కథను అర్థం చేసుకోవడానికి, దాని వైవిధ్యమైన , విశిష్టమైన చేతి పనితనాన్ని చాటి చెప్పేందుకు నేషనల్ మ్యూజియం ఇండియా రిజర్వ్ కలెక్షన్ నుంచి సుమారు 100 వస్తువులను ఎంపిక చేశారు. నేషనల్ మ్యూజియం డెన్మార్క్ లోని కోల్డింగ్ మ్యూజియంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రదర్శన భారతీయ , డానిష్ వెండి వైభవాన్ని ప్రేక్షకులకు ఆనందానుభూతిని

అందిస్తుందని అన్నారు.

మ్యూజియం కోల్డింగ్ డైరెక్టర్ శ్రీ రూన్ లుండ్ బర్గ్ మాట్లాడుతూ, "భారతదేశండెన్మార్క్ మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగం కావడానికి మ్యూజియం కోల్డింగ్ ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంతో కలిసి పనిచేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది . మ్యూజియం అత్యుత్తమ వెండి సేకరణను ప్రదర్శించడానికి ఎదురు చూస్తున్నాముమా డానిష్ వెండిని భారతీయ ప్రజలు ఎలా స్వీకరిస్తారనే దాని గురించి మేము చాలా ఉద్వేగంగా ఎదురుచూస్తున్నామునేషనల్ మ్యూజియంతో కలిసి, మేము మ్యూజియం సేకరణ , గాంగ్స్టెడ్ ఫౌండేషన్ సేకరణలో ఉత్తమమైన వాటిని చూపించే ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసాము, ఇది డానిష్ , భారతీయ వెండి సంప్రదాయాల వైవిధ్యంపై దృష్టి పెడుతుంది." అన్నారు.

ఫోటో గ్యాలరీ

( ప్రసంగిస్తున్న శ్రీమతి లిల్లీ పాండే, డైరెక్టర్ జనరల్ నేషనల్ మ్యూజియం , సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి)

(ప్రసంగిస్తున్న డానిష్ రాయబారి హెచ్.. ఫ్రెడ్డీ స్వానే

(ప్రసంగిస్తున్న శ్రీ. రూన్ లుండ్ బర్గ్, మ్యూజియం కోల్డింగ్ డైరెక్టర్)

******



(Release ID: 1876941) Visitor Counter : 103


Read this release in: Marathi , English , Urdu , Hindi