రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

పశ్చిమ బంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో రూ.1082 కోట్ల విలువైన 2 ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులను ప్రారంభించిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 17 NOV 2022 5:36PM by PIB Hyderabad

పశ్చిమ బంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో రూ.1082 కోట్ల విలువైన 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ, "దల్ఖోలా (ఎన్‌హెచ్‌-34) ప్రజల 60 ఏళ్ల డిమాండ్‌ను నెరవేర్చాం. రూ.120 కోట్లతో 4 వరుసల్లో నిర్మించిన ఈ 5 కి.మీ. బైపాస్ రోడ్డు దల్ఖోలా పట్టణంలో వాహన రద్దీ సమస్యను పరిష్కరిస్తుంది. బైపాస్ & ఆర్‌వోబీ నిర్మాణం కారణంగా సిలిగురి నుంచి కోల్‌కతాకు ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గుతుంది. రహదారి విస్తరణ వల్ల బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల వెంబడి కూడా ప్రజల కదలికలు మెరుగు పడతాయి" అని చెప్పారు.

రూ.962 కోట్ల వ్యయంతో రాణిగంజ్ నుంచి దల్ఖోలా వరకు నిర్మించిన 4 వరుసల రహదారి వల్ల పశ్చిమ మిడ్నాపూర్‌ - బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య అనుసంధానత మెరుగు పడిందని మంత్రి వివరించారు. బంగాల్ & ఈశాన్య ప్రాంతం మధ్య అనుసంధానతను కూడా ఈ రహదారి విస్తరణ పెంచుతుందని వెల్లడించారు.

***



(Release ID: 1876934) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi , Punjabi