సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పింఛనుదారులచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్న - డి.ఓ.పి.పి.డబ్ల్యూ. దేశవ్యాప్త ప్రచారం

Posted On: 16 NOV 2022 5:36PM by PIB Hyderabad

*     నవంబర్, 1 తేదీ నుంచి 15 తేదీ వరకుఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి జిల్లానాగర్‌ కోయిల్ వరకుఅదేవిధంగాఈశాన్య ప్రాంతంలోని గౌహతి నుంచి పశ్చిమాన అహ్మదాబాద్ వరకుభారత దేశం లోని వివిధ నగరాల్లోప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించబడ్డాయి.

*     వచ్చే రెండు వారాల్లో  విభాగం దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరో 22 డి.ఎల్.సిఅవగాహన శిబిరాలను నిర్వహిస్తుంది

కేంద్ర ప్రభుత్వ పింఛను దారుల డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారం కోసం, భారత ప్రభుత్వ పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది.  ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (పి.పి) డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు.  పింఛనుదారుల 'సులభ జీవనం' కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ / ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని ప్రోత్సహించాలని, అన్ని రిజిస్టర్డ్ పెన్షనర్ల అసోసియేషన్లు, పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సి.జి.హెచ్.ఎస్. కేంద్రాలను  ఆదేశించడం జరిగింది. 

20222 నవంబర్, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి జిల్లా, నాగర్‌ కోయిల్ వరకు అదేవిధంగా ఈశాన్యంలో గౌహతి నుంచి పశ్చిమాన అహ్మదాబాద్ వరకు భారతదేశంలోని వివిధ నగరాల్లో, ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించబడ్డాయి.  ఢిల్లీ, నోయిడా, చండీగఢ్, మొహాలి, జమ్మూ, శ్రీనగర్, నాగ్‌పూర్, పూణే, అలహాబాద్, జలంధర్, గ్వాలియర్, త్రిసూర్, మధురై, నాగర్‌కోయిల్, వడోదర, అహ్మదాబాద్ వంటి నిర్దిష్ట నగరాల్లో ఇప్పటివరకు అవగాహనా శిబిరాలు నిర్వహించడం జరిగింది. 

ప్రచార సైట్‌ లను స్పాన్సర్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ); పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్.బి) సహాయంతో డి.ఓ.పి.పి.డబ్ల్యూ అధికారులు దేశ వ్యాప్త ప్రచారాన్ని నిర్వహించారు.  ఈ ప్రచారంలో నమోదిత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్లు;  ఐ.పి.పి.బి; యు.ఐ.డి.ఏ.ఐ; ఎన్.ఐ.సి. అలాగే సి.జి.డి.ఏ. ప్రతినిధులు ప్రతి నగరంలో చురుకుగా పాల్గొన్నారు.  

ఈ ప్రయోజనం కోసం డెవలప్ చేసిన ఫేస్ అథెంటికేషన్ యాప్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా, ఎన్.ఐ.సి. త్వరగా స్పందించి, వాటిని పొందుపరిచింది.  ఉదాహరణకు, లైవ్ సర్టిఫికేట్‌ ను ఓ.టి.పి లో స్వీకరించి, డౌన్‌ లోడ్ చేసిన తర్వాత యాప్‌ లో తెరవవచ్చు.  అయితే, పెన్షనర్ల నుండి వచ్చిన ఫీడ్‌ బ్యాక్ కారణంగా, ఓ.టి.పి. ని స్వీకరించిన వెంటనే లైఫ్ సర్టిఫికేట్‌ ను యాక్సెస్ చేయవచ్చు.  అన్ని ప్రదేశాలలో ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఎస్.బి.ఐ. పూర్తి శక్తి తో ముందుకు వచ్చింది, వారి అధికారులు సెలవు దినాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనడం కనిపించింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పింఛనుదారులు ఈ ప్రచారాన్ని విస్తృతంగా ప్రశంసించారు.  దేశవ్యాప్తంగా వార్తాపత్రికలు, దూరదర్శన్ ద్వారా ప్రచారం విస్తృతంగా జరిగింది.  2022 నవంబర్, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ తన ట్విట్టర్ ఖాతా నుండి 214 ట్వీట్‌ లను ప్రసారం చేసింది.  వీటితో పాటు, ఈ ప్రచారానికి సంబంధించిన ఇతర వాటాదారులు ఈ కాలంలో 316 ట్వీట్‌ లను రీ-ట్విట్ చేశారు.  డిపార్ట్‌మెంటు తన యూట్యూబ్ పేజీలో ఐదు వీడియోలను అప్‌-లోడ్ చేసింది. 

పెరుగుతున్న అవగాహన కారణంగా, ఫేస్ అథెంటికేషన్ మరింత ప్రజాదరణ పొందింది. డి.ఎల్.సి. ప్రక్రియ విస్తృతంగా ఆమోదించబడుతోంది.  2022 నవంబర్, 15వ తేదీ వరకు, మొత్తం 21.01 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు విజయవంతంగా డి.ఎల్.సి. ని ఉపయోగించారు, ఇందులో 1.83 లక్షల మంది డి.ఎల్.సి. ఫేస్ అథెంటికేషన్ ద్వారా సృష్టించబడ్డాయి. 

వచ్చే రెండు వారాల్లో ఈ విభాగం దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరో 22 డి.ఎల్.సి. అవగాహన శిబిరాలను నిర్వహిస్తుంది

 

<><><>



(Release ID: 1876692) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi , Bengali