సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఫోటోగ్రఫీ ప్రియులకోసం 'మేళాక్షణాలు' పేరిట పోటీ


కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆధ్వర్యంలో నిర్వహణ..

Posted On: 15 NOV 2022 5:12PM by PIB Hyderabad

 ముఖ్యాంశాలు:

  • సంప్రదాయ ఉత్సవాల, మేళాల ప్రాముఖ్యతను గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో వివరించారు.
  • ఫొటోగ్రఫీ పోటీలో విజేతలకు ఫైనల్ అవార్డులు, నెలవారీ అవార్డులు ప్రదానం చేస్తారు.
  • నెలవారీ అవార్డుల విభాగంలో ప్రథమ బహుమతిగా రూ. 10,000; ద్వితీయ బహుమతిగా రూ. 7,500, తృతీయ బహుమతిగా రూ. 5,000.

  ఫోటోగ్రఫీ అభిమానులకోసం కోసం 'మేళా క్షణాలు' పేరిట ఛాయాగ్రహణం(ఫోటోగ్రఫీ)లో ఒక  పోటీని భారత ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. సంప్రదాయ ఉత్సవాల ప్రాముఖ్యతను గురించి ‘మన్ కీ బాత్’ 91వ విడత ప్రసంగం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించారు.

  ఫోటోగ్రఫీ పోటీలో పాల్గొనాలనుకునే వారందరూ ఏదైనా సంప్రదాయ ప్రదర్శన, ఉత్సవం, మేళాలో గడిపిన క్షణాలనుంచి తాము తీసిన ఉత్తమమైన ఛాయాచిత్రాలను (ఫొటోలను) ఈ పోటీకి పంపించుకోవచ్చు. తద్వారా, వారు నగదు బహుమతులను, ప్రోత్సాహక పురస్కారాలను గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.

  ఈ పోటీలో విజేతలకు ఫైనల్ అవార్డులు, నెలవారీ అవార్డులు అందుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ అవార్డుల్లో ప్రథమ బహుమతిగా రూ. 1,00,000, ద్వితీయ బహుమతిగా రూ. 75,000, తృతీయ బహుమతిగా రూ. 50,000 ప్రదానం చేస్తారు. ఇంకా,. నెలవారీ అవార్డుల ప్రథమ బహుమతిగా రూ. 10,000, ద్వితీయ బహుమతిగా రూ. 7,500, తృతీయ బహుమతిగా రూ. 5,000 ఇస్తారు.

ఫొటోగ్రఫీ పోటీలో పాల్గొనడానికి, దిగువన ఇచ్చిన ఈ ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది:  

https://docs.google.com/forms/d/1Tkb-t08neMAb6EOHZGYlM5CfqfHMcDk8hVikPQye-Bs/edit?pli=1

 

https://ci6.googleusercontent.com/proxy/6r6TjiUtha23DnIz09q6bS2TK0nBTIGWhOpmc1ChWheHw3iyCIcpbmQ4KpP0B7s39P4wm2mMrcJ-91GB9WRzit1FvNNJotMpbbse1rs2cOHcCglLyoOkj_CYTw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HI2H.png

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరిట భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని ప్రోత్సహించడంలో సాంప్రదాయ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 2022 జూలై 31న ‘మన్ కీ బాత్’ 91విడత ప్రసంగంలో తెలియజేశారు. మన దేశంలో నిర్వహించే జాతరలకు, మేళాలకు ఎంతో గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజలను,  జన హృదయాలను జాతరలు అనుసంధానం చేస్తాయన్నారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో అనేక గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సంప్రదాయ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయని ఆయన తెలిపారు. కొన్ని జాతరలు గిరిజన సంస్కృతికి సంబంధించినవి కాగా, మరి కొన్నింటిని గిరిజన చరిత్ర, వారసత్వానికి అనుసంధానంగా నిర్వహిస్తూ ఉంటారని ఆయన చెప్పారు.

సంబంధిత లింకులు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1847058

 

*** 



(Release ID: 1876331) Visitor Counter : 105


Read this release in: English , Urdu , Hindi , Punjabi