కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

'జన్ జాతీయ గౌరవ్ దివస్' సందర్భంగా గిరిజన సమాజాల అభివృద్ధికి తన నిబద్ధతను పునరుద్ఘాటించిన - డి.ఓ.టి.


వామ పక్ష తీవ్రవాద పథకం-I కింద 2,343 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది.


ఈశాన్య ప్రాంత సమగ్ర టెలికాం అభివృద్ధి పథకం కింద 1,358 టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది.

Posted On: 15 NOV 2022 7:47PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి.ఓ.టి) 5.11.2022.0న జరుపుకుంటున్న ‘జంజాతీయ గౌరవ్ దివస్’ సందర్భంగా గిరిజన వర్గాల అభివృద్ధికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.  దేశంలోని గిరిజన జనాభాకు డి.ఓ.టి. టెలికాం కనెక్టివిటీని అందిస్తోంది.  గణనీయమైన గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో, మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు టెలికాం శాఖ, అనేక పథకాలను అమలు చేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం (ఎల్.డబ్ల్యూ.ఈ) మొదటి దశ పథకం కింద 2,343 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది.  కాగా,  ఎల్.డబ్ల్యూ.ఈ.  రెండో దశ పథకం కింద మరో 2,542 మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఈశాన్య ప్రాంత సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక (సి.టి.డి.పి) కింద అంటే, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ప్రాంతాల్లో గతంలో మొబైల్ కనెక్టివిటీ కల్పించని గ్రామాల్లో 1,358 టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా మొబైల్ కనెక్టివిటీ అందించడం జరుగుతోంది.  అదనంగా, బంగ్లాదేశ్ సబ్‌-మెరైన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్ (బిఎస్.సి.సి.ఎల్), బంగ్లాదేశ్ నుండి కాక్స్ బజార్ / కౌకటా ద్వారా అగర్తలాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం 20 జి.బి.పి.ఎస్. అంతర్జాతీయ బ్యాండ్‌-విడ్త్ ప్రారంభించబడింది.

ఆశావహ జిల్లాల పధకం కింద 7,789 కొత్త గ్రామాలను  అనుసంధామం చేయాలని డి.ఓ.టి. ప్రణాళిక రూపొందిస్తోంది. 

ఇంతవరకు మొబైల్ కనెక్టివిటీ కల్పించని 24,680 గ్రామాల్లో సంతృప్త పథకం కింద, 4-జి మొబైల్ సేవలను అందించడానికి, బి.ఎస్.ఎన్.ఎల్. ద్వారా ఒక ప్రాజెక్టు అమలు చేయడం జరుగుతోంది.  వీటిలో చాలా మారుమూల, గ్రామీణ, సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఉన్నాయి.  ఈ ప్రాజెక్టు 2023 డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. 

ఈ పథకాలన్నీ ప్రాజెక్టు ప్రాంతాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో గిరిజనులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

*****



(Release ID: 1876326) Visitor Counter : 110


Read this release in: English , Urdu , Hindi