నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

మెగా టింకరింగ్ , నీతి ఆయోగ్‌ సీఈఓతో సంభాషణ కార్యక్రమాల ద్వారా ఘనంగా బాలల దినోత్సవాన్ని జరుపుకున్న భారతదేశంలోని ఏటిఎల్ పాఠశాలలు

Posted On: 15 NOV 2022 4:23PM by PIB Hyderabad

భారతదేశంలోని పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ (ఏటిఎల్)ల కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ ద్వారా 2 రోజుల వేడుకల లో భాగంగా, నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ వర్చ్యువల్ గా దేశవ్యాప్తంగా ఏటిఎల్ పాఠశాలల విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులు తమ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌లను సీఈఓకి ప్రదర్శించారు, వారి మాడ్యూల్స్ ఆఫ్ ఆపరేషన్‌ను తెలియజేసారు. నీతి ఆయోగ్ ప్రాంగణంలో విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించడానికి ఏటిఎల్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

 

 

'భారతదేశంలో పది లక్షల మంది పిల్లలను నియోటెరిక్ ఇన్నోవేటర్‌లుగా తీర్చిదిద్దే' లక్ష్యంతో, అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారతదేశంలోని పాఠశాలల్లో అటల్ టింకరింగ్ లాబొరేటరీలను (ఏటిఎల్ లను) ఏర్పాటు చేస్తోంది. ఇటీవల ఏఐఎం యువతలో చైతన్యం, సృజనాత్మకత, ఊహాశక్తిని పెంపొందించే లక్ష్యంతో భారతదేశంలోని పాఠశాలల్లో 10,000 కంటే ఎక్కువ ఏటిఎల్ లను స్థాపించే లక్ష్యాన్ని సాధించింది; డిజైన్ మైండ్‌సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ మొదలైన నైపుణ్యాలను పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది.  

 

విద్యార్థులతో తన ఇంటరాక్షన్ తర్వాత నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ ఈ విశిష్టమైన, వినూత్నమైన ప్రాజెక్ట్‌లతో ఈరోజు విద్యార్థుల్లో ఉన్న శక్తి, ఉత్సాహం చుస్తే సంతోషంగా ఉందని అన్నారు.  ఏటిఎల్ లు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో ఆవిష్కరణ, సృజనాత్మకత  టింకరింగ్ నిజమైన సామర్థ్యాన్ని ఆవిష్కరించాయన్నారు. ఇది యువతలో ఆవిష్కరణ స్ఫూర్తిని పెంపొందించడానికి ఖచ్చితంగా సహాయపడుతుందని,ఏటిఎల్ లలో విద్యార్థులు పొందే మార్గదర్శకత్వం, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రాప్యత మన యువ ఆవిష్కర్తలు వారి ఊహలకు రెక్కలు వచ్చేలా చేస్తుందని,  ఆవిష్కరణలు సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పాల్జో నామ్‌గ్యాల్ గర్ల్స్ స్కూల్, సిక్కిం, గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ కోటిబాగ్ జమ్ము కశ్మీర్, ప్రభుత్వ మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్, బిలాస్‌పూర్, ఎయిర్ ఫోర్స్ స్కూల్, హెబ్బల్, కేంద్రీయ విద్యాలయ జనక్‌పురి, బాల్ భారతి పబ్లిక్ స్కూల్ పితంపురా ఢిల్లీ తమ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌లను వివరించారు. 

హెబ్బాల్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్కూల్‌కు చెందిన విద్యార్థి విజయ్‌సుబ్రమణియన్ తన అనుభవాన్ని పంచుకుంటూ, “ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది, టెక్, ఇన్నోవేషన్, బిజినెస్‌ల కలయికతో నిజ జీవిత పరిష్కారాలను రూపొందించడమే నా లక్ష్యం. ఏటిఎల్ మెంటార్‌లు నిర్వహించిన సెషన్‌లు డిజిటల్ స్కిల్లింగ్, ప్రొడక్ట్ డిజైనింగ్‌లో నాకు సహాయం చేశాయి. మన ప్రోటోటైప్‌ను విలువైన ఉత్పత్తిగా మార్చడం,  దాని ద్వారా ఎలా సంపాదించవచ్చనే దానిపై నాకు ఒక ఆలోచన ఇచ్చింది: అని అన్నారు. 

అంతకుముందు నవంబర్ 14 న బాలల దినోత్సవం సందర్బంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కార్యక్రమంలో, భారతదేశం నుండి 5000 కంటే ఎక్కువ పాఠశాలల నుండి సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు నీతి ఆయోగ్ నిర్వహించిన ఒక ప్రత్యేకమైన మెగా టింకరింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  దేశ నలువైపుల నుండి అనేక పాఠశాలల విద్యార్థులు, ఏటిఎల్ ఇన్‌ఛార్జ్‌లు, ప్రధానోపాధ్యాయులు, మెంటర్లు, ఏఐఎం బృందం, భాగస్వాములతో పాటు వర్చ్యువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో, భారతదేశం అంతటా పాల్గొన్న విద్యార్థులు ఒకే రోజులో సమిష్టిగా చేసిన అతిపెద్ద గ్లోబల్ టింకరింగ్ ఒక ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.

 

మెగా టింకరింగ్ కార్యాచరణ యువ విద్యార్థులలో కొత్త ప్రయోగాలు, టింకర్ పట్ల మంచి ఆలోచన విధానాన్ని, అభిరుచిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటిఎల్ విద్యార్థులు టింకరింగ్ ఉద్యమానికి అంబాసిడర్‌లుగా ఉన్నారు మరియు ఆవిష్కరణ ప్రాజెక్ట్‌ల మెరుగైన సంస్కరణలను రూపొందించడానికి వారి సృజనాత్మక శక్తిని ఉపయోగించారు. అందులో త్రీడీ ప్రింటింగ్‌ను పొందుపరిచేలా మార్పులు కూడా చేశారు. కొంతమంది విద్యార్థులు సంక్లిష్టమైన రోబోలు, డ్రోన్‌లను రూపొందించడం ద్వారా దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లారు. పాఠశాలల్లో ఈ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌ల మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో సహాయం చేయడంలో ఏటిఎల్ ముందు వరుసలో ఉంది.

ఎఐఎం  మిషన్ డైరెక్టర్  డాక్టర్ చింతన్ వైష్ణవ్  తన సందేశంలో చిన్నతనంలో ఇలాంటి టింకరింగ్ కార్యకలాపాన్ని మొదటిసారి చేసినప్పటి నుండి తన జ్ఞాపకాలను పంచుకున్నారు  “నేటి వయస్సులో ఉన్న పిల్లలకు ఇంతకు ముందు అందుబాటులో లేని సాధనాలు, వనరులు ఉన్నాయి. భారతదేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలో ఈ ఈవెంట్ నిజంగా ‘స్పిరిట్ ఆఫ్ మేకింగ్’ను ప్రదర్శించింది... అని అన్నారు. 

దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు హాజరు కావడానికి ఏఐఎం యూట్యూబ్ ఛానెల్‌లో కార్యక్రమాలను  ప్రత్యక్ష ప్రసారం చేసారు.

 

ఏటిఎల్  ప్రోగ్రామ్ గురించి మరింత తెలుసుకోవడానికి ... సందర్శించండి -  http://aim.gov.in/atl.php

 

***


(Release ID: 1876285) Visitor Counter : 172


Read this release in: English , Urdu , Hindi