ఆర్థిక మంత్రిత్వ శాఖ

నగరాల రుణ పరపతి యోగ్యతపై 5రోజుల వర్క్‌షాప్‌ను సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆర్థిక వ్యవహారాల విభాగం, కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ప్రపంచ బ్యాంక్ గ్రూప్

Posted On: 14 NOV 2022 6:38PM by PIB Hyderabad

నగరాల రుణ పరపతి  యోగ్యతపై 5రోజుల వర్క్‌షాప్‌ను  ఆర్థిక వ్యవహారాల విభాగం, కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ప్రపంచ బ్యాంక్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భవిష్యత్ నగరాలకు ఆర్థిక సహాయం చేయడానికి వీలు కల్పించే పర్యావరణ వ్యవస్థ రూపొందించాలన్న  ఉద్దేశ్యంతో "సిటీస్ క్రెడిట్ వర్తినెస్ అకాడమీ" పేరుతో 5-రోజుల వర్క్‌షాప్‌ ఏర్పాటయింది. ఈరోజు ప్రారంభమైన వర్క్‌షాప్‌ 2022 నవంబర్ 18 వరకు జరుగుతుంది. 

  వర్క్‌షాప్‌ను ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్ ప్రారంభించారు.కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ మనోజ్ జోషి, ప్రపంచ బ్యాంకు భారతదేశ  కంట్రీ డైరెక్టర్, పట్టణ మౌలిక సదుపాయాల విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మున్సిపల్ కార్పొరేషన్‌లకు చెందిన 150 మంది సీనియర్ అధికారులు.వర్క్‌షాప్‌ లో పాల్గొంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ అండ్ ప్లానింగ్ సంయుక్త కార్యదర్శి  శ్రీ పీయూష్ కుమార్ వర్క్‌షాప్ లక్ష్యాలను వివరించి స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. 

ఇంధనం, నైపుణ్యం మరియు పట్టణీకరణ అనే మూడు అంశాల ప్రాతిపదికన దేశంలో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయింపు జరుగుతుందని  శ్రీ అజయ్ సేథ్ తెలిపారు. నిధులను అత్యంత సమర్ధవంతంగా వినియోగించుకోవడం కోసం రేట్‌పేయర్-పన్ను చెల్లింపుదారుల నమూనాల మిశ్రమం ద్వారా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని శ్రీ సేథ్ సూచించారు. . మున్సిపల్ ఆర్థిక అంశాలకు  సంబంధించి ఎదురవుతున్న సమస్యలను జనవరి 2023 లో నిర్వహించ తలపెట్టిన  ముఖ్య కార్యదర్శుల సదస్సు,  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ నిర్వహించనున్న  జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ లలో  రాష్ట్రాలు,  మునిసిపల్ కార్పొరేషన్‌లు చర్చించి పరిష్కార మార్గాల రూపకల్పనకు  తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. సామర్థ్యం, మున్సిపల్ నిధుల సమీకరణ, పట్టణ ప్రణాళిక అంశాలు పట్టణ  స్థానిక సంస్థల  సమర్థవంతమైన పనితీరును నిర్దేశిస్తాయని శ్రీ మనోజ్ జోషి వివరించారు. పట్టణ స్థానిక సంస్థలు తమ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి సాంకేతిక సామర్థ్య సంబంధిత అంశాలపై దృష్టి సారించాలని అన్నారు.

'రేపటి ఆర్థిక నగరాలు' అనే అంశంపై ఆర్థిక, ఖర్చుల విభాగం కార్యదర్శి  డాక్టర్ టివి సోమనాథన్ ప్రత్యేక ప్రసంగం ఇచ్చారు. సొంత ఆదాయం, రుణాల ద్వారా పొందే నిధుల ఆధారంగా  పట్టణ ఆర్థిక రంగం పనిచేస్తుందని  డాక్టర్  సోమనాథన్ వివరించారు. బాండ్ల మార్కెట్ నుంచి అదనంగా నిధులు సమీకరించడానికి స్థానిక సంస్థలు తమ సొంత ఆదాయ వనరులను ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

నాలుగు ప్రధాన అంశాలపై మొదటి రోజు వర్క్‌షాప్‌ లో నిపుణులు చర్చించారు.    టసెషన్‌ను 'విజన్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ రెసిలెంట్ సిటీస్ ఆఫ్ ది ఫ్యూచర్' అనే అంశంపై జరిగిన చర్చకు  శ్రీ ఓపీ అగర్వాల్ సంధానకర్తగా వ్యవహరించారు.  'కనెక్టింగ్ మునిసిపాలిటీస్ విత్ క్యాపిటల్' అనే అంశంపై  నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF)కి చెందిన శ్రీ ప్రసాద్ గడ్కరీ నేతృత్వంలో సదస్సు జరిగింది.   మోడరేట్ చేశారు. మార్కెట్లు'. 'మునిసిపల్ ఫైనాన్సింగ్ మరియు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్'  అంశంపై జరిగిన చర్చకు  బ్యాంక్ నిపుణుడు మిస్టర్ రోలాండ్ వైట్  'మునిసిపల్ ఫైనాన్సింగ్‌లో పీపీపీ ల పాత్ర'పై జరిగిన చర్చకు  ఐ ఎఫ్ సి  నగరాల నిపుణులు శ్రీ నీరజ్ గుప్తా నేతృత్వం వహించారు. 

.వర్క్‌షాప్‌లో మిగిలిన నాలుగు రోజులలో విధానాలు, నియంత్రణ, పెట్టుబడుల మార్కెట్‌, మునిసిపల్ నిధుల యాజమాన్యం,మునిసిపల్ పెట్టుబడుల ప్రణాళిక, రుణ పరపతి మెరుగుదల కోసం కార్యాచరణ ప్రణాళిక, మున్సిపాలిటీల కార్యాచరణ ప్రణాళిక లాంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రముఖ అంతర్జాతీయ మరియు స్థానిక నిపుణులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.  

దేశంలోపల మరియు ఇతర ప్రాంతాల్లో  విజయవంతమైన ప్రణాళికలు, విధానాలను వర్క్‌షాప్‌ లో చర్చించడం జరుగుతుంది వడోదర మునిసిపల్ కార్పొరేషన్  బాండ్ జారీ, అమెరికా లోని ఒరెగాన్ అమలు జరిగిన భౌగోళిక నగర ప్రణాళిక, దక్షిణాఫ్రికా మరియు టర్కీ దేశాల  మూలధన మార్కెట్ జోక్యం లాంటి అంశాలు చర్చకు రానున్నాయి. 

ఈ 5 రోజుల వర్క్‌షాప్‌లో మునిసిపల్ కమీషనర్‌లతో పాటు దేశంలోని అనేక పట్టణ స్థానిక సంస్థల నిపుణులు  పాల్గొంటున్నారు.

***

 



(Release ID: 1876015) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi