ఆయుష్
ఆయుష్ ఫర్ గ్లోబల్ హెల్త్ అన్న ఇతివృత్తం కింద భిన్న చొరవలను ప్రదర్శించనున్న మంత్రిత్వశాఖ
ఆరోగ్యవంతమైన ఆయుష్ జీవనశైలి గురించి చైతన్యపరిచేందుకు/ వ్యాపింపచేసేందుకు ఐఐటిఎఫ్ 2022లో ఆయుష్ మంత్రిత్వ శాఖ పెవిలియన్‌లో వివిధ ప్రభావశీల కార్యకలాపాలు
ఆయుష్ పెవిలియన్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్న సాఫ్ట్‌వేర్ ఆధారిత ప్రకృతి& మిజాజ్ పరీక్షన్, భిన్న ఆయుష్ స్రవంతుల ఉచిత ఒపిడి సౌకర్యాలు
మరొక ఆకర్షణీయమైన బిందువు ఆయుష్ స్టార్టప్‌లు
Posted On:
12 NOV 2022 6:31PM by PIB Hyderabad
తాము చేపట్టిన చొరవలను, భిన్న విజయాలను 14 నుంచి 27 నవంబర్ 2022 వరకు న్యూఢిల్లీలోని, ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 41వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆయుష్ మంత్రిత్వ శాఖ తన పెవిలియన్‌లో ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ప్రపంచ ఆరోగ్యానికి ఆయుష్ అన్న ఇతివృత్తం చేపట్టిన చొరవలను మంత్రిత్వ శాఖ పట్టిచూపనుంది.
ఆయుష్ వ్యవస్థ కింద అందుబాటులో ఉన్న రోజువారీ చర్యలు, మంచి ఆహార అలవాట్లు వంటివాటిని అనుసరించడం ద్వారా జీవనశైలిలో ఆయుష్‌ను జోడించి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ప్రజలలో చైతన్యాన్ని తెచ్చేందుకు వివిధ ఆయుష్ సంస్థలు, ఆయుర్వేద పరిశోధనా సంస్థలు, యోగ, నాచురోపతీ, యునానీ, సిద్ధ, సోవా- రిగ్పా, హోమియోపతి స్రవంతులు తమ తమ స్టాళ్ళను ఏర్పాటు చేయనున్నాయి.
ఈ ఏడాది ఆయుష్ పెవిలియన్ ముఖ్యాంశం, వచ్చిన సందర్శకులు సబ్బు, జెల్, క్రీమ్, గోలీ, తదితరాలు, మసాలా వస్తువులను గుర్తించి సరిపోల్చడం వంటి క్రియేట్ యువర్ ఓన్ కార్యకలాపాల ద్వారా ఆయుష్ లాభాలను తెలుసుకునేందుకు ప్రభావశీల కార్యకలాపాలు చేపట్టడం. పరమపద సోపానపటం వంటి సరళమైన, అనాదిగా వస్తున్న క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకోవడం ఎలాగో సందర్శకులు తెలుసుకుంటారు. మనకు వచ్చే ఆరోగ్య సమస్యలకు వంటింటి చిట్కాలు వంటిని దాదీ సే పూఛో కార్యకలాపం ద్వారా తెలుసుకోవడం మరొక ఆసక్తికరమైన కార్యకలాపం. అనేక ఆరోగ్య లాభాలు కలిగిన ఔషధ మొక్కలను ఉచితంగా సందర్శకులకు పంచనున్నారు. ఆయుష్ క్విజ్‌లో విజయం సాధించినవారికి ఆకర్షణీయమైన బహుమానాలు ఉన్నాయి.
ఆయుష్ ప్రాక్టిషనర్లు/ ఆయుర్వేద, యునాని, హోమియోపతి, సిద్ధ, సోవా రిగ్పా, యోగ & నాచురోపతి వైద్యులు ఉచిత ఒపిడి సౌకర్యం ద్వారా ఆరోగ్య సలహాలు ఇస్తారు. వ్యక్తి ప్రత్యేక ప్రొఫైల్ లేదా అతడి లేక ఆమె శారీరక, క్రియాత్మక, ప్రవర్తనా లక్షణాలను కలిగి ఉన్న సైకోసొమాటిక్ (మనశ్చర్మ సంబంధిత) స్వభావం ఆధారంగా వారి ప్రకృతి( ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం), మిజాజ్ (యునాని సిద్ధాంతాల ప్రకారం అంచనా వేసే ప్రకృతి పరీక్షన్ & మిజాజ్ పరీక్షణ్ చేస్తారు.
ఇక్కడ వ్యక్తి యొక్క ప్రకృతి (ఆయుర్వేదం యొక్క సిద్ధాంతాల ప్రకారం) మరియు మిజాజ్ (యునాని సిద్ధాంతాల ప్రకారం) వ్యక్తి యొక్క ప్రొఫైల్ లేదా అతని లేదా ఆమె శారీరక, క్రియాత్మక మరియు ప్రవర్తనా లక్షణాలను కలిగి ఉన్న ప్రత్యేక మానసిక స్వభావాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
యోగా ఫ్యూషన్ కార్యక్రమం, ప్రత్యక్ష యోగా ప్రదర్శన, పని ప్రదేశంలో యోగా బ్రేక్, యోగా థెరపీ వంటివాటిని న్యూఢిల్లీకి చెందిన మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగ (ఎండిఎన్ఐవై) నిపుణులు ప్రదర్శిస్తారు.
ఆయుర్వద, యోగ, నాచురోపతి, ఉనాని, సిద్ధా, హోమియోపతి రంగాలలో వ్యవస్థాపకతను భారతదశ్‌పు చురుకైన స్టార్టప్ పర్యావరణం ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. భిన్న వర్గాలకు చెందిన 14కి పైగా స్టార్టప్‌లు పెరుగుతున్న ఆయుష్ బలాన్ని ప్రదర్శించనున్నాయి.
విజేతలు ఆకర్షణీయమైన బహుమానాలు పొందడానికి ప్రోత్సహించేలా ఆయుష్ పెవిలియన్‌లో ఆసక్తికరమైన ఆయుష్ క్విజ్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
***
(Release ID: 1875690)
Visitor Counter : 189